newssting
Radio
BITING NEWS :
కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై సస్పెన్స్‌కు తెరపడింది. బీఎస్‌ యడియూరప్ప సోమవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సాయంత్రం గవర్నర్‌ను కలిసి రాజీనామాను సమర్పించనున్నారు. రాజీనామాపై ఆయన స్పందిస్తూ.. ‘‘ రాజకీయ జీవితంలో ఎన్నో అగ్నిపరీక్షలు ఎదుర్కొన్నా. కర్ణాటక అభివృద్ధి కోసం చాలా చేశా. 75 ఏళ్లు దాటినా నాకు రెండేళ్ల పాటు అవకాశం ఇచ్చారు. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తా’’ అని అన్నారు. * ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా సోమవారం 2,128 కోవిడ్‌ టీకా కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ అందిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల కోవిడ్‌ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. * చరిత్రలోనే మొట్టమొదటిసారి మన తెలుగు సంపద అయిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన రామప్ప ఆలయానికి ఐక్యరాజ్య సమితి విద్య, విజ్ఞాన (పరిశోధన), సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా కోసం 2015లోనే ప్రయత్నాలు మొదలయ్యాయి. * టోక్యో ఒలింపిక్స్‌లో జపాన్‌కి చెందిన మోమిజీ నిషియా సంచలనం సృష్టంచింది. ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన రెండో అతి పిన్న వయస్కురాలిగా రికార్డు క్రియాట్‌ చేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన స్కేట్‌బోర్డింగ్ లో నిషియా స్వర్ణ పతకం సాధించింది. * ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ పూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చోర్‌ బజార్‌’’. ‘దళం, జార్జ్‌ రెడ్డి’ చిత్రాల ఫేమ్‌ జీవన్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

హుజూరాబాద్ బరిలోకి కౌశిక్ రెడ్డి..?

12-06-202112-06-2021 08:31:42 IST
2021-06-12T03:01:42.803Z12-06-2021 2021-06-12T03:01:33.258Z - - 27-07-2021

హుజూరాబాద్ బరిలోకి కౌశిక్ రెడ్డి..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఈ నెల 14న బీజేపీలో చేరనున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ఆ పార్టీ హుజూరాబాద్‌ అభ్యర్థిగా బరిలోకి దిగనుండటం ఖాయం కావడంతో టీఆర్‌ఎస్‌ నుంచి ఎవరిని పోటీలో నిలపాలనే చర్చ కొన్ని రోజులుగా గులాబీ దళంలో సాగుతోంది. అయితే ఈటలను ఢీకొనే స్థాయి గల నాయకుడు టీఆర్‌ఎస్‌ నుంచి హుజూరాబాద్‌లో పోటీ చేస్తారు అన్న ప్రశ్న తలెత్తుతోంది. గతంలో ఈటలపై పోటీ చేసి ఓడిన వకులాభరణం కృష్ణమోహన్‌ రావు, మాజీ మంత్రి, బీజేపీ నేత ఇనుగాల పెద్దిరెడ్డి, కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు కుటుంబం నుంచి ఒక్కొక్కరి పేర్లు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రేసులో వినిపించాయి అయితే తాజాగా కాంగ్రెస్ నేత పాడి కౌశిక్‌రెడ్డి తెరమీదికి తీసుకువస్తున్నట్లు సమాచారం.

కౌశిక్ రెడ్డి, ఈటెల రాజేందర్ పై విమర్శలు గుప్పించడంలో ఎప్పుడూ ముందుంటారు. 2018 ఎన్నికల్లో ఈటలపై పోటీ చేసిన కౌశిక్‌ సుమారు 40 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయినా హుజూరాబాద్‌లో ఈటలను టార్గెట్‌ గా చేసుకొని విమర్శలు కురిపించేవారు. టీఆర్‌ఎస్‌లో ఈటలకు అన్యాయం జరిగిందని కాంగ్రెస్‌ అగ్రనేతలు సాను భూతి వ్యక్తం చేసినా కౌశిక్‌రెడ్డి మాత్రం ఈటల భూకబ్జాల పేరుతో మీడియా సమావేశాలు పెట్టి మరీ ధ్వజమెత్తారు. ఈ నేపధ్యంలో ఈటెలని ఎన్నికల బరిలో కౌశిక్ రెడ్డి అయితే దీటుగా ఎదుర్కున్తారన్న చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అంతే కాదు ఈ మధ్య మంత్రి కేటిఆర్ తో సైతం కౌశిక్ భేటీ అయినట్లు, వీరిద్దరూ ఏకాంతంగా చర్చలు జరిపినట్లు ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో హుజూరాబాద్ ఉప ఎన్నికలో కౌశిక్ రెడ్డి టిఆరెస్ లోకి చేర్పించి ఎన్నికల బరిలో నిలపాలన్నది టిఆరెస్ ఆలోచన్ అని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. 


Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle