newssting
Radio
BITING NEWS :
కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై సస్పెన్స్‌కు తెరపడింది. బీఎస్‌ యడియూరప్ప సోమవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సాయంత్రం గవర్నర్‌ను కలిసి రాజీనామాను సమర్పించనున్నారు. రాజీనామాపై ఆయన స్పందిస్తూ.. ‘‘ రాజకీయ జీవితంలో ఎన్నో అగ్నిపరీక్షలు ఎదుర్కొన్నా. కర్ణాటక అభివృద్ధి కోసం చాలా చేశా. 75 ఏళ్లు దాటినా నాకు రెండేళ్ల పాటు అవకాశం ఇచ్చారు. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తా’’ అని అన్నారు. * ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా సోమవారం 2,128 కోవిడ్‌ టీకా కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ అందిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల కోవిడ్‌ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. * చరిత్రలోనే మొట్టమొదటిసారి మన తెలుగు సంపద అయిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన రామప్ప ఆలయానికి ఐక్యరాజ్య సమితి విద్య, విజ్ఞాన (పరిశోధన), సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా కోసం 2015లోనే ప్రయత్నాలు మొదలయ్యాయి. * టోక్యో ఒలింపిక్స్‌లో జపాన్‌కి చెందిన మోమిజీ నిషియా సంచలనం సృష్టంచింది. ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన రెండో అతి పిన్న వయస్కురాలిగా రికార్డు క్రియాట్‌ చేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన స్కేట్‌బోర్డింగ్ లో నిషియా స్వర్ణ పతకం సాధించింది. * ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ పూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చోర్‌ బజార్‌’’. ‘దళం, జార్జ్‌ రెడ్డి’ చిత్రాల ఫేమ్‌ జీవన్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

మొన్న హ‌రీశ్.. ఇప్పుడు ఈటెల‌.. కేసీఆర్ టార్గెట్స్..?

27-02-202127-02-2021 14:43:32 IST
Updated On 27-02-2021 13:28:51 ISTUpdated On 27-02-20212021-02-27T09:13:32.835Z27-02-2021 2021-02-27T07:42:26.697Z - 2021-02-27T07:58:51.422Z - 27-02-2021

మొన్న హ‌రీశ్.. ఇప్పుడు ఈటెల‌.. కేసీఆర్ టార్గెట్స్..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాజ‌కీయం అంటే అదే. ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవ‌రికీ తెలీదు. ఇప్పుడు సీఎం కేసీఆర్, మినిస్ట‌ర్ ఈటెల కి మ‌ధ్య ఏం జ‌రుగుతోంది అనే సిచ్చువేష‌న్ క్రియేట్ అయింది. సీఎం కేసీఆర్ తో.. ఇర‌వై పాతికేళ్ల ఫ్రెండ్షిప్ ఉందంటారు ఈటెల రాజేంద‌ర్. కేసీఆర్ ని అజ‌మాయిషీ చేసే స్వ‌తంత్రం ఉందంటారు ఈటెల‌. రాజ‌కీయంలో కేసీఆర్ కి మొద‌ట్నుంచీ స‌పోర్టింగ్ గా ఉండి.. ఆయన వెన‌కే న‌డిచిన లీడ‌ర్ మినిస్ట‌ర్ ఈటెల రాజేంద‌ర్.

కానీ.. రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు ఎప్పుడూ ఒకేలా ఉండ‌వు. ఒక్కోసారి వేరే పార్టీల లీడ‌ర్ల‌తోనే కాదు. సొంత పార్టీ లీడ‌ర్ల‌తో కూడా కొట్లాట త‌ప్ప‌దు. రాజ‌కీయాలు, ఎత్తులు పై ఎత్తులు ఇలా ఎన్నో ఉంట‌య్. ఇప్పుడు సీఎం కేసీఆర్ ప‌రిస్థితి కూడా అదే. పోరాడాల్సింది ప్ర‌త్య‌ర్థుల‌తో కాదు.. సొంత పార్టీ లీడ‌ర్ల‌తోనే అన్న‌ట్లు ఉంది అంటున్నారు పొలిటిక‌ల్ సెటైర్ల‌తో బిజీగా ఉండే లీడ‌ర్లు. పొలిటిక‌ల్ గా ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయింది. మొన్న‌టి దాకా హ‌రీశ్ రావుని దూరం పెడుతున్నారు.. దూరం పెడుతున్నారు అనుకున్నారు. అవును క‌దా.. హ‌రీశ్ రావు లాంటి లీడ‌ర్ కి మినిస్ట్రీ ఇవ్వ‌లేదంటే ఏదో పెద్ద ఎవ్వార‌మే జ‌రిగి ఉంటుంది అని తెలిసిందే క‌దా. మొత్తానికైతే ఎవ్వారం కూల్ అయ్యాక‌.. హ‌రీశ్ రావుకి మినిస్ట్రీ వ‌చ్చింది. అంతా సాఫీగానే ఉంది. 

ఇప్పుడు ఈటెల రాజేంద‌ర్ తో కేసీఆర్ కి వ‌చ్చిన ప్రాబ్ల‌మ్ ఏంటి అన్న‌ది ఇంట్ర‌స్టింగ్ గా మారింది. మొన్నా మ‌ధ్య కూడా కేటీఆర్ ముఖ్య‌మంత్రి అంటే ఊరుకునేది లేదు.. బండ‌కేసి కొడ‌తా.. చీరి చింత‌గ్గ‌డ‌తా అన్న రేంజ్ లో వార్నింగ్ లు ఇచ్చారు క‌దా సీఎం కేసీఆర్. ఆ టైంలో బాగా హైలైట్ అయింది ఈటెల వ్యాఖ్య‌లే. ఇండైరెక్ట్ గా ఈటెల‌కే త‌గిలాయి ఆ మాట‌లు. ఇప్పుడు కూడా అలాంటిదే జ‌రిగింది. సీఎం కేసీఆర్ హ‌డావిడిగా ఓ మినిస్టర్ల మీటింగ్ పెట్టారు. అంద‌రినీ లంచ్ కి ర‌మ్మ‌న్నారు.

ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లా కి చెందిన‌ మినిస్ట‌ర్ గంగుల కూడా వ‌చ్చారు. అయితే.. అంత ఇంపార్టెన్స్ ఉన్న ఈటెల‌ని మాత్రం పిల‌వ‌క‌పోవ‌డం పొలిటిక‌ల్ గా ఇంట్ర‌స్టింగ్ టాపిక్ అయింది. అయితే.. అందుబాటులో ఉన్న‌వారినే పిలిచాం అనే మాట‌లు వినిపిస్తున్నాయి. అలాంట‌ప్పుడు హైద‌రాబాద్ ఆఫీస్ లోనే వ‌ర్క్ లో ఉన్న మినిస్ట‌ర్ అందుబాటులో లేక‌పోవ‌డం ఏంటి అనేది సీరియ‌స్ పాయింట్ అయింది. అయితే.. మినిస్ట‌ర్ ఈటెల పేరుకే మినిస్ట‌ర్ అని.. ఆయ‌న మాట కూడా చెల్ల‌డం లేద‌నీ.. సీఎం కేసీఆర్.. ఆయ‌న‌ను సైడ్ చేశారు అనే టాక్ అయితే వినిపిస్తోంది. ఈ ప‌రిస్థితి చానాళ్ల నుంచీ న‌డుస్తుంద‌నే టాక్ కూడా ఉంది.


Newssting User


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle