newssting
Radio
BITING NEWS :
విజయవాడలో కన్నకూతురిని అమ్మకానికి పెట్టిన తాగుబోతు తండ్రి. విషయం తెలిసి తండ్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చిన చైల్డ్ లైన్ అధికారులు. అనంతరం చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు. * తెలుగు రాష్ట్రాల్లో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 11 మంది దుర్మరణం. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఇన్నోవా - బోర్ వెల్ లారీ ఢీ. ప్రమాదంలో ఆరుగురు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు. ప్రమాద సమయంలో ఇన్నోవాలో 11 మంది ప్రయాణికులు. మృతులంతా హైదరాబాద్ లోని తాడ్ బన్ కు చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * కర్నూల్ జిల్లా గూడూరు వద్ద బైక్ ను ఢీ కొట్టిన ట్రాక్టర్. ముగ్గురు దుర్మరణం, మృతులంతా బ్రాహ్మణదొడ్డికి చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * ఖమ్మం జిల్లా కామేపల్లి వద్ద టిప్పర్ - స్కూటీ ఢీ, ఇద్దరు మృతి. * మూడోరోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు. రాష్ట్రంలో ఇసుక సమస్యపై అసెంబ్లీలో టీడీపీ వాయిదా తీర్మానం.

కేసీఆర్ ను రంగంలోకి దింపేస్తున్నారుగా

21-11-202021-11-2020 08:15:22 IST
2020-11-21T02:45:22.115Z21-11-2020 2020-11-21T02:45:19.734Z - - 02-12-2020

కేసీఆర్ ను రంగంలోకి దింపేస్తున్నారుగా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

 జీహెచ్ఎంసీ ఎన్నికలను టీఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని స్పష్టంగా తెలుస్తోంది. గత ఎన్నికల్లో కేటీఆర్ ఒంటి చేత్తో పార్టీని నడిపించగా.. ఈసారి మాత్రం కేసీఆర్ కూడా రంగంలోకి దిగనున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం టీఆర్ఎస్ కు షాక్ ఇవ్వడంతో.. జీహెచ్ఎంసీ ఎన్నికల విషయంలో మాత్రం ఆ తప్పు జరగకూడదని టీఆర్ఎస్ భావిస్తోంది. అందులో భాగంగానే కేసీఆర్ ప్రాచారంలోకి దిగనున్నారు.  నవంబర్ 28న ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగసభ జరుగుతుందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించబోతోందని ధీమా వ్యక్తం చేశారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సెంచరీ మిస్ అయిందని... ఈ సారి సెంచరీ కొట్టడం ఖాయమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఒక్క రన్ తేడాతో గతంలో సెంచరీ మిస్ అయ్యామని చెప్పారు. జాంభాగ్ లో కేవలం 5 ఓట్ల తేడాతో ఓడిపోయామని తెలిపారు. ఈసారి 105 నుంచి 110 స్థానాల్లో విజయం సాధిస్తామని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్నవారంతా టికెట్ల కోసం పోటీపడిన వారిని కలవాలని కేటీఆర్ సూచించారు. హైదరాబాద్ ప్రజలకు తాగునీటి కష్టాలను తప్పించింది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని.. 24 గంటల నాణ్యమైన విద్యుత్ ను అందించిన ఘనత కేసీఆర్ దేనని అన్నారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాత హైదరాబాద్ లో ఎలాంటి లొల్లి లేదని చెప్పారు. నగరానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు. రానున్న 10 రోజులు 24 గంటలపాటు అలుపెరగకుండా నిర్విరామంగా పని చేయాలని చెప్పారు. 

పోలవరంలో అవినీతి జరిగిందన్నారు.. నిరూపించకుండా ఏడాదిన్నరగా గాడిదలు కాస్తున్నారా?

పోలవరంలో అవినీతి జరిగిందన్నారు.. నిరూపించకుండా ఏడాదిన్నరగా గాడిదలు కాస్తున్నారా?

   2 hours ago

పోలవరం ఎత్తుపై అసెంబ్లీ సాక్షిగా మంత్రి అనిల్ ఏమ‌న్నారంటే..?

పోలవరం ఎత్తుపై అసెంబ్లీ సాక్షిగా మంత్రి అనిల్ ఏమ‌న్నారంటే..?

   2 hours ago

ఉచిత ఇళ్లపై వైసీపీ ప్రభుత్వం చెప్పిన లాజిక్ వింటే మైండ్ గాన్ అంతే!

ఉచిత ఇళ్లపై వైసీపీ ప్రభుత్వం చెప్పిన లాజిక్ వింటే మైండ్ గాన్ అంతే!

   3 hours ago

పోలవరం ఆపం.. 100 అడుగుల వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం..!

పోలవరం ఆపం.. 100 అడుగుల వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం..!

   4 hours ago

అసెంబ్లీలో 'జయము.. జయము చంద్రన్న' వీడియో టెలీకాస్ట్.. ఒక్కొక్కరి ముఖాల్లో నవ్వులే నవ్వులు

అసెంబ్లీలో 'జయము.. జయము చంద్రన్న' వీడియో టెలీకాస్ట్.. ఒక్కొక్కరి ముఖాల్లో నవ్వులే నవ్వులు

   4 hours ago

ఏపీ అసెంబ్లీకి చుట్టుకున్న కరోనా భయం

ఏపీ అసెంబ్లీకి చుట్టుకున్న కరోనా భయం

   4 hours ago

పోలవరంపై అసెంబ్లీలో చర్చ.. టీడీపీ ఎమ్మెల్యేలను ఎందుకు సస్పెండ్ చేశారంటే

పోలవరంపై అసెంబ్లీలో చర్చ.. టీడీపీ ఎమ్మెల్యేలను ఎందుకు సస్పెండ్ చేశారంటే

   5 hours ago

ఏపీ సర్కార్ వద్దంటున్న ఎన్నికలు కర్ణాటకలో ప్రకటించేశారు!

ఏపీ సర్కార్ వద్దంటున్న ఎన్నికలు కర్ణాటకలో ప్రకటించేశారు!

   5 hours ago

వెంకన్న సాక్షిగా ప్రధాని హోదా వాగ్ధానం.. అదే బీజేపీ పాలిట శాపం?!

వెంకన్న సాక్షిగా ప్రధాని హోదా వాగ్ధానం.. అదే బీజేపీ పాలిట శాపం?!

   6 hours ago

ఓటైతే వేయలే గాని.. వైన్ షాప్ ముందు క్యూలు కట్టారు!

ఓటైతే వేయలే గాని.. వైన్ షాప్ ముందు క్యూలు కట్టారు!

   6 hours ago

ఇంకా

Naresh

 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle