newssting
Radio
BITING NEWS :
శరన్నవరాత్రోత్సవాల్లో మూడో రోజు ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మవారు గాయత్రీదేవి అలంకరణలో దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ. * నేడు, రేపు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన. ఏపీ తీరానికి దక్షిణంగా పశ్చిమ వాయువ్య మధ్య బంగాళాఖాతంలో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం. రెండ్రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ అధికారులు. భారీ వర్షాలకు బెంబేలెత్తిపోతున్న హైదరాబాద్ వాసులు. భారీ వర్షాలపై మైకుల్లో నగరవాసులను అలర్ట్ చేస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బంది. * దుర్గమ్మకు విజయవాడ ఎన్‌ఆర్ఐ తాతినేని శ్రీనివాస్ అనే భక్తుడి కానుక. రూ.45 లక్షల విలువైన ఏడువారాల వజ్రాల నగలు దుర్గగుడి ఈవో సురేశ్ బాబుకు అందజేత. * భారీ వర్షాలకు కుంగిన పురానాపూల్ బ్రిడ్జి. వరద నీటి ఉద్ధృతి పెరగడంతో పిల్లర్ కుంగుబాటు. వాహనాల రాకపోకలు నిలిపివేత. మరమ్మతులు పూర్తయిన అనంతరం వాహనాల రాకపోకల పునరుద్ధరణ. * అసోం, మిజోరం గ్రామాల ప్రజల మధ్య ఘర్షణ. సరిహద్దుల వద్ద పరిస్థితి ఉద్రిక్తం. అసోం ప్రజలపై మిజోరం వాసుల దాడి. గుడిసెలు, స్టాల్స్‌కు నిప్పు పెట్టిన అసోం వాసులు. ప్రధాని, హోంశాఖకు సమాచారం అందించిన అసోం ముఖ్యమంత్రి. * కడప జిల్లా రాజాంలో గంజాయి ముఠా గుట్టురట్టు. 8 మంది అరెస్ట్, 53 కేజీల గంజాయి, బైక్ స్వాధీనం.

ఏపీ నీటి తరలింపునకు కేసీఆర్‌ చక్కటి సహకారం.. ఉత్తమ్‌ మండిపాటు

25-09-202025-09-2020 14:36:44 IST
2020-09-25T09:06:44.650Z25-09-2020 2020-09-25T08:23:36.002Z - - 20-10-2020

ఏపీ నీటి తరలింపునకు కేసీఆర్‌ చక్కటి సహకారం.. ఉత్తమ్‌ మండిపాటు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా ఏపీ సర్కారు నీటిని తరలించుకుపోతుంటే టీఆర్‌ఎస్‌, బీజేపీ ప్రభుత్వాలు అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదని, దీని వల్ల దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతుందని సబార్డినేట్‌ పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశంలోనూ ప్రస్తావించానని  పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వెల్లడించారు.  

తెలంగాణకు రావాల్సిన నీటిలో రోజుకు 6 టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్‌ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా అన్యాయంగా తరలించుకుపోతుంటే సీఎం కేసీఆర్‌ కుట్రపూరితంగా సహకరిస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు.

ఈ అంశంపై చర్చకు ఆన్‌లైన్‌లో జరిగే అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశానికి రావాలని సీఎం కేసీఆర్‌కు ఆగస్టులో లేఖ రాసినట్లు కేంద్ర జలశక్తి కార్యదర్శి యూపీ సింగ్‌ చెప్పారని ఉత్తమ్‌ వివరించారు. కేసీఆర్‌ హైదరాబాద్‌లో ఉన్నప్పటికీ ఆ సమావేశంలో పాల్గొనకపోవడంతో వాయిదా పడిందని యూపీ సింగ్‌ తెలిపారన్నారు. 

ఏపీ చేపడుతున్న ప్రాజెక్టు పనులను నిలిపివేసే అధికారాన్ని కృష్ణా నదీ యాజమన్య బోర్డుకు ఇవ్వాలని కోరానని ఉత్తమ్‌ అన్నారు. కాగా, రైతు వ్యతిరేక బిల్లుతో ఆదానీ, అంబానీ, అమెజాన్‌ వంటి కార్పొరేట్‌ కంపెనీలకు లాభం జరుగుతుందని, రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు.  

హ‌రీశ్ వ‌ర్సెస్ ర‌ఘునంద‌న్..దుబ్బాక‌లో దుమ్ముదుమారం

హ‌రీశ్ వ‌ర్సెస్ ర‌ఘునంద‌న్..దుబ్బాక‌లో దుమ్ముదుమారం

   10 hours ago


వ‌ల్ల‌భ‌నేని వంశీ దారెటు..? అనుచ‌రుల కొత్త స‌ల‌హా!

వ‌ల్ల‌భ‌నేని వంశీ దారెటు..? అనుచ‌రుల కొత్త స‌ల‌హా!

   14 hours ago


అమరావతిని తప్పించిన ఎక్స్‌ప్రెస్ వే.. కేంద్రం ఆమోదముద్ర

అమరావతిని తప్పించిన ఎక్స్‌ప్రెస్ వే.. కేంద్రం ఆమోదముద్ర

   16 hours ago


టీడీపీ కొత్త టీమ్

టీడీపీ కొత్త టీమ్

   17 hours ago


తల దూర్చకంటూ బీజేపీ ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇచ్చిన జేపీ నడ్డా

తల దూర్చకంటూ బీజేపీ ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇచ్చిన జేపీ నడ్డా

   17 hours ago


కరోనా కేసుల రికవరీలో దేశంలోనే నంబర్‌వన్‌ ఏపీ..

కరోనా కేసుల రికవరీలో దేశంలోనే నంబర్‌వన్‌ ఏపీ..

   19 hours ago


మీలో మాస్క్ మహారాజు ఎవరు.. తెలంగాణ సర్కార్ కొత్త ప్రచారం

మీలో మాస్క్ మహారాజు ఎవరు.. తెలంగాణ సర్కార్ కొత్త ప్రచారం

   19 hours ago


బీసీ నేతలు చేయలేని మేలు ఏపీ సీఎం చేశారు.. ఆర్‌. కృష్ణయ్య

బీసీ నేతలు చేయలేని మేలు ఏపీ సీఎం చేశారు.. ఆర్‌. కృష్ణయ్య

   20 hours ago


పాకిస్థాన్ ప్ర‌ధానికి మూడిన‌ట్లే ఉంది

పాకిస్థాన్ ప్ర‌ధానికి మూడిన‌ట్లే ఉంది

   20 hours ago


ఆంధ్రప్రదేశ్ కు పొంచి ఉన్న వరుణ భీభత్సం

ఆంధ్రప్రదేశ్ కు పొంచి ఉన్న వరుణ భీభత్సం

   21 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle