newssting
Radio
BITING NEWS :
కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై సస్పెన్స్‌కు తెరపడింది. బీఎస్‌ యడియూరప్ప సోమవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సాయంత్రం గవర్నర్‌ను కలిసి రాజీనామాను సమర్పించనున్నారు. రాజీనామాపై ఆయన స్పందిస్తూ.. ‘‘ రాజకీయ జీవితంలో ఎన్నో అగ్నిపరీక్షలు ఎదుర్కొన్నా. కర్ణాటక అభివృద్ధి కోసం చాలా చేశా. 75 ఏళ్లు దాటినా నాకు రెండేళ్ల పాటు అవకాశం ఇచ్చారు. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తా’’ అని అన్నారు. * ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా సోమవారం 2,128 కోవిడ్‌ టీకా కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ అందిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల కోవిడ్‌ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. * చరిత్రలోనే మొట్టమొదటిసారి మన తెలుగు సంపద అయిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన రామప్ప ఆలయానికి ఐక్యరాజ్య సమితి విద్య, విజ్ఞాన (పరిశోధన), సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా కోసం 2015లోనే ప్రయత్నాలు మొదలయ్యాయి. * టోక్యో ఒలింపిక్స్‌లో జపాన్‌కి చెందిన మోమిజీ నిషియా సంచలనం సృష్టంచింది. ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన రెండో అతి పిన్న వయస్కురాలిగా రికార్డు క్రియాట్‌ చేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన స్కేట్‌బోర్డింగ్ లో నిషియా స్వర్ణ పతకం సాధించింది. * ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ పూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చోర్‌ బజార్‌’’. ‘దళం, జార్జ్‌ రెడ్డి’ చిత్రాల ఫేమ్‌ జీవన్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

ఈటెల‌కి పేరొస్తుంద‌ని.. కేసీఆర్ కు భ‌య‌మా

24-04-202124-04-2021 17:10:41 IST
Updated On 24-04-2021 15:51:44 ISTUpdated On 24-04-20212021-04-24T11:40:41.617Z24-04-2021 2021-04-24T10:09:48.625Z - 2021-04-24T10:21:44.279Z - 24-04-2021

ఈటెల‌కి పేరొస్తుంద‌ని.. కేసీఆర్ కు భ‌య‌మా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎట్టెట్టా.. కేసీఆర్ కి భ‌య‌మా. ఏమ‌న్నా పిచ్చి ప‌ట్టిందా జ‌నాల‌కి. అనుకోవ‌డానికి కూడా కాస్త ఉండాలి క‌దా. కేసీఆర్ అస‌లు భ‌య‌ప‌డ‌తారా అనే వాళ్లు ఉంటారు. ఏం.. ఎందుకు భ‌య‌ప‌డ‌రు. మోడీ మీద రంకెలేసి.. ఢిల్లీకి ఢీలా ప‌డ‌లేదా. ఇప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడ‌కుండా కిక్కురుమ‌న‌కుండా ఉండ‌డం లేదా. కేసీఆర్ ఏమైనా దిగొచ్చారా ఏంటి. అనుకుంటారు చాలా మంది. రెండు ర‌కాలుగా మాట్లాడుకునే వాళ్లూ ఉన్నారు. ఇక పోతే.. సీఎం కేసీఆర్ కి.. మినిస్ట‌ర్ ఈటెల రాజేంద‌ర్ కీ చానాళ్ల నుంచీ ప‌డ‌డం లేదు క‌దా. ఎడ మొహం పెడ మొహం గా ఉంటున్నార‌ని.. కేటీఆర్ క‌లిపే ప్ర‌య‌త్నాలు చేసినా.. వ‌ర్క‌వుట్ కావ‌డం లేద‌నీ.. హెల్త్ మినిస్ట‌ర్ అయిన ఈటెల రాజేంద‌ర్ ని మొన్న‌టి వ‌ర‌కూ ప‌క్క‌న పెట్టార‌ని వార్త‌లు విన్నాం క‌దా. అయితే.. ఇప్పుడు స‌డ‌న్ గా క‌రోనా పెర‌గ‌డంతో.. ఈటెల మ‌ళ్లీ యాక్టివ్ అయ్యారు. పైగా సీఎం కేసీఆర్ కి.. క‌రోనా సోక‌డం.. కేటీఆర్ కూడా పాజిటివ్ రావ‌డం.. హ‌రీశ్ ఏమ‌య్యారో ఎవ‌రికీ తెలీక పోవ‌డం.. చుక్కానీ ప‌ట్టే దిక్కే లేకుండా పోయింది.

కానీ.. ఈటెల అంటే పొలిటీషియ‌న్ కాదు. త‌నొక లీడ‌ర్. ఏ సిచ్చువేష‌న్ ని అయినా డీల్ చేసే క్యాలిబ‌ర్ ఉన్న లీడ‌ర్. మినిస్ట‌ర్ గా పోయిన సారి కూడా క‌రోనా టైంలో సీఎం గ‌ప్ చుప్ అయినా ఈటెల బానే డీల్ చేశారు. కానీ.. క్రెడెట్స్ ఎవ‌రికి పోతాయి అనేది తెలిసిందే క‌దా. అయితే.. ఇప్పుడు స‌డ‌న్ గా.. ఈటెల యుద్ధ విమానాల్ని రంగంలోకి దింపారు. మినిస్ట‌ర్ ప‌వ‌ర్ ఏంటో చూపించారు. ఒరిస్సాకి యుద్ధ విమానాలు పంపి.. వాటిలో.. భారీ లారీ ట్యాంక‌ర్ల ద్వారా.. ఆక్సిజ‌న్ తెప్పిస్తున్నారు. ఒక్క‌రోజులో హీరో అయిపోయారు మినిస్ట‌ర్ ఈటెల రాజేంద‌ర్.

దేశంలో ఎవ‌రూ చేయ‌ని ప్లాన్ చేశారు. నిజ‌మే.. క‌రోనా పేషెంట్లు బెడ్స్ మీద‌.. ఊపిరాడ‌కుండా ఉంటే.. రోడ్డు మార్గం ద్వారానో.. రైలు మార్గం ద్వారానో.. రెండు మూడు రోజుల పాటు ఒక ట్యాంక‌ర్ ట్రావెల్ చేసి.. ఆక్సిజ‌న్ తీసుకొస్తే.. అప్ప‌టి దాకా.. వెంటిలేట‌ర్ పై ఊపిరాడ‌ని పేషెంట్ ఊపిరి ఆగిపోతుంది. ఈ ట్యాంక‌ర్ మ‌ధ్య‌లో ఎక్క‌డ ఆగినా.. ఊపిరి ఆగిపోతుంది. అందుకే.. ఎమ‌ర్జెన్సీ టైంలో.. ఎమ‌ర్జెన్సీ నిర్ణ‌యం తీసుకున్నారు మినిస్ట‌ర్ ఈటెల రాజేంద‌ర్. నిర్ణ‌యం ఎవ‌రిది, ఐడియా ఎవ‌రిదీ అనే విష‌యం ప‌క్క‌న పెడితే.. ఈటెల ఆధ్వ‌ర్యంలో జ‌రిగింది. అంత ప‌వ‌ర్ ఫుల్ గా నుంచున్నారు ఈటెల‌. అందుకే.. ఈటెల‌కి వ‌న్ డే హీరో అయిపోయారు. సో.. ఇక ఆగితే బాగోద‌ని.. కేసీఆర్ కూడా ఈటెల‌కి ఆర్డ‌ర్స్ ఇవ్వ‌డం పాస్ చేశారు అనే టాక్ న‌డుస్తోంది. అగ్నిప్ర‌మాదాల‌పై జాగ్ర‌త్త‌గా ఉండాలి అంటూ.. కేసీఆర్  కూడా యాక్టివ్ అయ్యే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని కామెంట్స్ వినిపిస్తున్నాయి.


Newssting User


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle