newssting
Radio
BITING NEWS :
హైదరాబాద్ వాసులను వెంటాడుతున్న వరద భయం. రానున్న మూడ్రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. ఏ క్షణాన వరద ముంచెత్తుతుందోనని కంటిమీద కునుకులేకుండా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న లోతట్టు ప్రాంతాల ప్రజలు. * హైదరాబాద్ ను ఆదుకునేందుకు కదిలిన టాలీవుడ్ తారాగణం. సీఎం రిలీఫ్ ఫండ్ కు చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేష్ కోటి రూపాయల విరాళం. చెరో 50 లక్షలు ఇచ్చిన ఎన్టీఆర్, రామ్ చరణ్. * విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఘనంగా పోలీస్ సంస్మరణ దినోత్సవ వేడుకలు. కరోనాతో మృతి చెందిన పోలీసుల కుటుంబాలకు రూ.50 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం వైసీపీనే అన్న మంత్రి సుచరిత. * ఏపీ - తెలంగాణ ప్రభుత్వాల మధ్య ఇంకా కుదరని ఆర్టీసీ ఒప్పందం. ప్రభుత్వాల మొండి వైఖరితో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. ఆర్టీసీ అలసత్వాన్ని క్యాష్ చేసుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్. ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచిన ప్రైవేట్ బస్సులు. ప్రతి ఏటా ఆర్టీసీకి లాభాలు తెచ్చిపెడుతున్న దసరా. * స్కందమాతగా దర్శనమిస్తోన్న బాసర సరస్వతీ దేవి. * పూర్తిగా నిండిన గండిపేట చెరువు. ఏ క్షణంలోనైనా గేట్లు ఎత్తి నీరు విడుదల చేసే అవకాశం. లోతట్టుప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు.

కవిత విజయం సరే.. డిపాజిట్లు కోల్పోవడం ఏమిటి ఉత్తమ్?

13-10-202013-10-2020 11:56:08 IST
2020-10-13T06:26:08.099Z13-10-2020 2020-10-13T06:26:04.552Z - - 21-10-2020

కవిత విజయం సరే.. డిపాజిట్లు కోల్పోవడం ఏమిటి ఉత్తమ్?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో తెరాస అభ్యర్థి, తెలంగాణ సీఎం కుమార్తె, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత తప్పకుండా గెలుస్తారని ముందునుచి అంచనాలు ఉండటంతో పెద్దగా ఆశ్చర్యం కలగలేదు. కానీ ప్రతిపక్షాలు మూకుమ్మడిగా డిపాజిట్లు కోల్పోవడమే అందరినీ షాక్‌కు గురిచేసింది. కాంగ్రెస్ పార్టీ అయితే మూడో స్థానంలో నిలవడంతో ఆ పార్టీ పరువు పోయినంత పనైంది.

అధికార పార్టీ తరపున పోటీ చేసిన కల్వకుంట్ల కవిత 672 ఓట్ల భారీ మెజారిటీతో ఘనవిజయం సాధించగా బరిలో దిగిన బీజేపీ, కాంగ్రెస్‌కు డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరాస పనిపడతాం, కేసీఆర్ కుటుంబానికి బుద్ధి చెబుతాం అంటూ ఎన్నికల ప్రచార సమయంలో వీరంగమాడిన కాంగ్రెస్, బీజేపీ నేతలకు ఫలితం తర్వాత ముఖాల్లో నెత్తురు చుక్క లేకుండా పోయిందంటే ఇంత ఘోర పరాజయాన్ని వారే మాత్రం ఊహించలేదనే స్పష్టం.

కవితకు 728 మొదటి ప్రాధాన్యత ఓట్లు దక్కాయి. అంటే 88 శాతం ఓట్లు కేసీఆర్ తనయకే వచ్చాయి. రెండోస్థానంలో నిలిచిన బీజేపీ అభ్యర్థి పోతనకర్‌ లక్ష్మీనారాయణకు 56 మొదటి ప్రాధాన్యత ఓట్లు రాగా, మూడో స్థానానికి పడిపోయిన కాంగ్రెస్‌ అభ్యర్థి వి.సుభాష్‌ రెడ్డికి 29 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. 

అభ్యర్థులకు డిపాజిట్లు దక్కాలంటే మొత్తం పోలైన ఓట్లలో ఆరోవంతు ఓట్లు రావాలి. మొత్తం 823 ఓట్లలో ఆరోవంతు అంటే 138 మొదటి ప్రాధాన్యత ఓట్లు రావాల్సి ఉంటుంది. కానీ, బీజేపీకి 56, కాంగ్రెస్‌కు 29 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. రెండు పార్టీల అభ్యర్థులకు కలిపినా డిపాజిట్లు దక్కేలా ఓట్లు రాకపోవడం గమనార్హం. జిల్లాలోని స్థానిక సంస్థల్లో కాంగ్రెస్‌తో పోలిస్తే బీజేపీకి నామమాత్రంగానే బలముంది. బీజేపీకి 85 మంది సభ్యులు ఉన్నారు. కానీ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే ఎక్కువగా 56 ఓట్లు సాధించింది. 

క్రాస్ ఓటింగులోనూ కాంగ్రెస్‌కు పరాభవమే

ఈ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌ జరిగినట్లు స్పష్టమైంది. కాంగ్రెస్, బీజేపీల నుంచి గెలిచిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కవితకు ఓట్లేయడం గమనార్హం. స్థానిక సంస్థలైన మున్సిపాలిటీలు, జిల్లా, మండల పరిషత్‌లతో కలిపి కాంగ్రెస్‌ పార్టీకి మొత్తం 141 మంది సభ్యుల బలం ఉంది. ఇందులో సుమారు 75 మంది కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్‌లో చేరారు. కాంగ్రెస్‌లో మిగిలిన సుమారు 66 మంది కూడా ఆ పార్టీ అభ్యర్థికి ఓటు వేయలేదు. అందులో 29 మంది మాత్రమే కాంగ్రెస్‌ అభ్యర్థి వి.సుభాష్‌రెడ్డికి ఓటు వేశారు. దీన్ని బట్టి చూస్తే 37 మంది కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడినట్లు తేలింది. 

ఒక ప్రాంతీయ పార్టీ చేతిలో జాతీయపార్టీలు ఇంత ఘోరంగా పరాజయం పాలైన నేపథ్యంలో సమీప భవిష్యత్తులోనూ తెరాసకు పోటీ ఉండదనే చెప్పాలి. తెరాస గెలుపుకు, ప్రతిపక్షాల ఓటమికి ప్రజల విశ్వసనీయత ఇప్పటికీ అధికార పక్షం వైపే ఉండటమే కారణమనిపిస్తోంది. ఈ విజయ పరాజయాలు ప్రతిపక్షాలకు గుణపాఠాలు కావలసిందే.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle