newssting
Radio
BITING NEWS :
పశ్చిమగోదావరి జిల్లా పూళ్లలో వింతవ్యాధితో కళ్లు తిరిగి పడిపోతున్న జనం. వింతవ్యాధితో పడిపోయిన 20 మంది బాధితులు, పలువురికి గాయాలు. * లక్షద్వీప్ లో తొలి కరోనా కేసు నమోదు. కోచి నుంచి నౌకలో వచ్చిన కానిస్టేబుల్ కు పాజిటివ్. * అధికార సంప్రదాయాలు, లాంఛనాలకు స్వస్తి పలికిన ట్రంప్. రేపు జో బైడెన్ దంపతులకు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్న వైట్ హౌస్. * గొల్లపూడిలో హై టెన్షన్. మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా గొల్లపూడి ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్షకు వెళ్లిన దేవినేనిని అడ్డుకున్న పోలీసులు, దేవినేని ఉమా అరెస్ట్. కోవిడ్ ఆంక్షల కారణంగా దీక్షకు అనుమతి లేదన్న పోలీసులు. దీక్షకు బయల్దేరిన బుద్ధావెంకన్న హౌస్ అరెస్ట్. * నేడు ఢిల్లీకి వెళ్లనున్న ఏపీ సీఎం జగన్. అమిత్ షా సహా పలువురు మంత్రులతో భేటీ అయ్యే అవకాశం. పోలవరం ప్రాజెక్ట్ పెండింగ్ నిధులు, హై కోర్టు తరలింపు తదితర అంశాలపై చర్చించే అవకాశం. * గొల్లపూడిలో వైసీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు. దేవినేని ఉమా ఇంటికెళ్లే దారిలో భారీగా పోలీసుల మోహరింపు.

సాగ‌ర్ పై జానారెడ్డి ధీమా.. అందుకే పోటీ

07-01-202107-01-2021 12:33:23 IST
Updated On 07-01-2021 12:47:50 ISTUpdated On 07-01-20212021-01-07T07:03:23.959Z07-01-2021 2021-01-07T07:03:20.499Z - 2021-01-07T07:17:50.524Z - 07-01-2021

సాగ‌ర్ పై జానారెడ్డి ధీమా.. అందుకే పోటీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
యాక్చువ‌ల్ గా అయితే.. కుమారుడు ర‌ఘువీరారెడ్డిని బ‌రిలోకి దింపాల్సింది జానారెడ్డి. సాగ‌ర్ బై పోల్ లో అదే జ‌రుగుతుంది అనుకున్నారు. అప్పుడెప్పుడు కుమారుడ్ని ఇంట్ర‌డ్యూస్ చేయ‌డంతో అదే జ‌రుగుతుంది ఎలాంటి డౌటూ లేదు అనుకున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి కుమారుడికి ఫాలోయింగ్ తెప్పించి.. ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి దింపాలి అనుకున్నారు. కానీ.. స‌డ‌న్ గా బై పోల్ వ‌చ్చింది. నోముల న‌ర్సింహ‌య్య చ‌నిపోవ‌డంతో.. బైపోల్ వ‌చ్చింది. కాంగ్రెస్ లెక్క‌లు మారిపోయాయి. జానారెడ్డి లెక్క‌లు కూడా మారిపోయాయి.

సాగ‌ర్ అంటే.. జానారెడ్డిదే. ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. ఆ ఏరియాలో ప్ర‌తి ఒక్క‌రికీ తెలిసిన లీడ‌ర్.. త‌న‌కి కూడా ప్ర‌తి ఒక్క‌రూ తెలుసు అనుకోవ‌చ్చు. చిన్న చిన్న కార్య‌క‌ర్త‌ల నుంచి అంద‌రితో ట‌చ్ లో ఉంటారు. ప్ర‌తి ఇంటికీ వెళ్తార‌ట‌. ప్ర‌తి పెళ్లికీ.. ప్ర‌తి చావుకీ.. ప్ర‌తి ఫంక్ష‌న్ కీ వెళ్లి ప‌ల‌క‌రించి వ‌స్తార‌ని టాక్ ఉంది. ఇక త‌న స్టైల్ లో నియోజ‌క వ‌ర్గం మొత్తం ద‌ర్జాగా తిరుగుతుంటార‌ని.. జ‌నం ఏం చెప్పినా వింటార‌ని.. స‌మ‌స్య‌ల్ని కూడా ఊళ్ల‌ల్లో తిరిగి మ‌రీ సాల్వ్ చేస్తార‌నే టాక్ ఉంది. అందుకే ఏడు సార్లు గెలిచారు. మినిస్ట‌ర్ ప‌లు శాఖ‌ల్లో ప‌ని చేశారు. సో.. నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ట్టు బానే ఉంది. పైగా సామాజిక వ‌ర్గం కూడా క‌లిసొస్తుంది.

ఇప్పుడు జానా కుమారుడు ఎలాగూ పాపుల‌ర్ కాలేదు. బ‌రిలోకి దింపినా.. గెలుస్తారు అనే గ్యారంటీ లేదు. త‌నే దిగితే గెలిచే ఛాన్సెస్ ఫుల్లుగా ఉన్నాయిట‌. అందుకే.. కుమారుడ్ని ప‌క్క‌న పెట్టి తానే దిగుతున్నాను అని హింట్స్ ఇస్తున్నారు జానారెడ్డి. త‌నతో పాటు పార్టీలో ప‌నిచేసిన చాలా మంది కిందిస్థాయి లీడ‌ర్లు.. ఇప్పుడు టీఆర్ఎస్ లో ఉన్నా.. వారంద‌రూ జానాకోసం ప‌నిచేస్తార‌నే న‌మ్మ‌కం ఉందంట జానాకి. ఎందుకంటే.. పాత ప‌రిచ‌యాలు క‌దా. పైగా టీఆర్ఎస్ లో గ్రూపు గొడ‌వ‌లు ఉన్న‌య్. ఇదొక్క‌సారి జానారెడ్డికి విజ‌యం అందించాలి అనే అభిమానంతో ఉన్నార‌ట‌. టీఆర్ఎస్ స‌ర్వేలో కూడా ఇదే విష‌యం బ‌య‌టికొచ్చింది అన్న ద‌గ్గ‌ర్నుంచి కాంగ్రెస్ లో కూడా ఆశ‌లు చిగురిస్తున్న‌య్. పైగా ఓడిపోయినా నియోజ‌క‌వ‌ర్గాన్ని అంటిపెట్టుకుని.. కార్య‌క‌ర్త‌ల్ని అంటిపెట్టుకుని ఉండ‌డం కూడా జానారెడ్డికి క‌లిసి వ‌స్తుంది అంటున్నారు.

అమిత్ షాతో ముగిసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ

అమిత్ షాతో ముగిసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ

   3 hours ago


తిరుమలలో నిన్న పందులు.. నేడు దొంగలు.. ఏంది సార్ ఇది

తిరుమలలో నిన్న పందులు.. నేడు దొంగలు.. ఏంది సార్ ఇది

   4 hours ago


ఢిల్లీ చేరుకున్న వైఎస్ జగన్.. ఎలాంటి రాజకీయ కారణాలు లేవంటున్న సజ్జల

ఢిల్లీ చేరుకున్న వైఎస్ జగన్.. ఎలాంటి రాజకీయ కారణాలు లేవంటున్న సజ్జల

   5 hours ago


దేవినేని ఉమ విడుదల..!

దేవినేని ఉమ విడుదల..!

   7 hours ago


ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం.. ఎవరెవరు ఉన్నారంటే..!

ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం.. ఎవరెవరు ఉన్నారంటే..!

   8 hours ago


'దీదీ'ని ఓడించకపోతే రాజకీయాల్లోంచే తప్పుకుంటా.. సువేందు

'దీదీ'ని ఓడించకపోతే రాజకీయాల్లోంచే తప్పుకుంటా.. సువేందు

   8 hours ago


ఏ పార్టీలో అయినా చేరండి.. కానీ రాజీనామా చేయండి.. రజనీ మక్కల్ మన్రం

ఏ పార్టీలో అయినా చేరండి.. కానీ రాజీనామా చేయండి.. రజనీ మక్కల్ మన్రం

   10 hours ago


బ‌ల‌మేంటో తెలీదా.. లేదంటే బ‌ల‌మే లేదా

బ‌ల‌మేంటో తెలీదా.. లేదంటే బ‌ల‌మే లేదా

   12 hours ago


మ‌తం పేరు వ‌ర్క‌వుట్ అవుతుందా.. తెలుగోళ్లు ప‌ట్టించుకుంటారా

మ‌తం పేరు వ‌ర్క‌వుట్ అవుతుందా.. తెలుగోళ్లు ప‌ట్టించుకుంటారా

   13 hours ago


ఉన్న‌దే ముచ్చ‌ట‌గా ముగ్గురు న‌లుగురు.. మ‌ళ్లీ అందులో గ్రూపులా

ఉన్న‌దే ముచ్చ‌ట‌గా ముగ్గురు న‌లుగురు.. మ‌ళ్లీ అందులో గ్రూపులా

   15 hours ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle