జై తెలంగాణ నినాదం ఇప్పుడు వర్కవుట్ అవుతుందా
21-02-202121-02-2021 12:14:51 IST
2021-02-21T06:44:51.225Z21-02-2021 2021-02-21T03:00:06.880Z - - 09-03-2021

జై తెలంగాణ అంటే.. నాలుగు కోట్ల మంది.. ఆరు కోట్ల మంది.. ఎనిమిది కోట్ల మంది గుండెల్లో గంటలు మోగేవి.. నరాలు ఉప్పొంగేవి.. మనసు ఉద్వేగానికి గురయ్యేది.. రక్తం మరిగేది.. పిడికిలి బిగపడేది.. ఆ నినాదంలో ఉన్న వైబ్రేషన్ అలాంటిది. సీఎం కేసీఆర్ లాంటి వాళ్లు.. ఉద్యమ జేఏసీ లీడర్లు జై తెలంగాణ అంటే.. టీవీల్లో చూస్తున్న వాళ్లు కూడా జై తెలంగాణ అనే వాళ్లు.. బయటికి అనకపోయినా.. మనసులో అనుకునే వాళ్లు.. అదీ తెలంగాణ నినాదం పవర్. ఉద్యమ టైంలో అలా నడిచింది.
కానీ.. ఇప్పుడు జై తెలంగాణ నినాదం వినిపించడం లేదు. ఆ నినాదంతో రెండు సార్లు అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ లీడర్లు కూడా మర్చిపోయారు. జై తెలంగాణ అనే నినాదం వినిపించిన గొంతుల్ని తొక్కేసిన లీడర్లనే పార్టీలో చేర్చుకుని.. పదవులు కట్టబెట్టారనే ఆరోపణ టీఆర్ఎస్ పై ఉంది. మరి వాళ్లకి ఆ అర్హత లేదు అనుకుంటున్నారో.. ఇప్పుడు వర్కవుట్ కాదు అనుకుంటున్నారో కానీ.. టీఆర్ఎస్ వాళ్లు కూడా తెలంగాణ నినాదం వినిపించడం మానేశారు. ఇప్పుడు పాలిటిక్స్ అన్నీ రంగులు మారాయి కదా.
అలాంటి టైంలో.. షర్మిల వచ్చారు. పార్టీ పెడుతున్నారు. మీటింగులు పెడుతున్నారు. రాజన్న రాజ్యం అంటున్నారు. మరి తెలంగాణ వచ్చి రాజన్న రాజ్యం అంటే నడవదని ఫీలయ్యారా. ఇంకోటి ఇంకోటి ఏమైనా ఉందా అనేది పక్కన పెడితే.. జై తెలంగాణ అంటున్నారు. షర్మిలకి అర్దం కాని విషయం ఏంటంటే.. ఇప్పుడు తెలంగాణలో కూడా ఎమోషన్స్ తగ్గిపోయాయి. పాలిటిక్స్ పెరిగిపోయాయి. జై తెలంగాణ నినాదాన్ని లీడర్లు పట్టించుకోవడం లేదు అనే విషయం అందరికీ అర్దం అయిపోయింది. ఇలాంటి టైంలో.. షర్మిల జై తెలంగాణ నినాదం పట్టుకుంటే ఏ మాత్రం వర్కవుట్ అవుతుంది అన్నది ఇక్కడ ఇంట్రస్టింగ్ గా మారింది. అసలు ఆమె ఆ నినాదం వినిపించినా.. మనసులోనుంచి రాలేదు.. జనంలో ఉన్నారు కాబట్టి.. జస్ట్ గొంతులోంచి మాత్రమే వచ్చింది.. గుండెల్లోంచి రాలేదు అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నయ్. అసలు ఆమెకు తెలంగాణలో ఓటైనా ఉందా.. అనే సీరియస్ కామెంట్లు కూడా అంటున్న వాళ్లు ఉన్నారు.

నోటికొచ్చినట్లు మాట్లాడితే తాటతీస్తాం.. బీజేపీపై మండిపడ్డ కేటీఆర్
7 hours ago

కేతిరెడ్డిపై ఫైర్ అయిన పరిటాల శ్రీరామ్..!
9 hours ago

కాంగ్రెస్ వామపక్షాల మధ్య పొత్తా, శత్రుత్వమా.. డైలమ్మాలో కార్యకర్తలు
10 hours ago

వైసీపీ రౌడీయిజానికి బ్రేకులేస్తాం
10 hours ago

ఇదేం అన్యాయం.. హర్ట్ అయిన విడదల రజనీ ఫ్యాన్స్
11 hours ago

రాంజీ మృతి పట్ల తెలుగుదేశం పార్టీ నాయకుల దిగ్భ్రాంతి
11 hours ago

హైదరాబాద్ పేరును మార్చేస్తామని అంటున్న బీజేపీ నేత
11 hours ago

పవన్ కి విశాఖలో అడుగు పెట్టే ధైర్యం లేదా
2 hours ago

ఎంపీ గోరంట్ల మాధవ్ కు మహిళ నుండి ఊహించని ప్రశ్న
9 hours ago

డాక్టర్ చిరంజీవి కొల్లూరి కన్నుమూత..!
13 hours ago
ఇంకా