newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

సోనియాకి జగ్గారెడ్డి లేఖ.. కోరికలు చాలా ఉన్నాయే?!

03-01-202103-01-2021 08:31:12 IST
Updated On 03-01-2021 08:49:03 ISTUpdated On 03-01-20212021-01-03T03:01:12.042Z03-01-2021 2021-01-03T03:01:07.913Z - 2021-01-03T03:19:03.339Z - 03-01-2021

సోనియాకి జగ్గారెడ్డి లేఖ.. కోరికలు చాలా ఉన్నాయే?!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోడానికి ఆ పార్టీ నాయకులు ఎంతగానో కష్టపడుతూ ఉన్నారు. ఇతర పార్టీలలోకి వెళ్లలేకపోతున్న వాళ్లు, ఈ మధ్య కాలంలోనే కాంగ్రెస్ పార్టీలోకి చేరిన వారంతా కలిసి కాంగ్రెస్ తెలంగాణలో మాయమైపోకుండా ఉండాలని చాలా ప్రయత్నాలను చేస్తూ ఉన్నారు. ఇటీవలి కాలంలో తెలంగాణ పీసీసీ చీఫ్ పదవికి సంబంధించి తీవ్రమైన చర్చ జరిగింది. నాయకుడు ఎవరైనా కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి తిరిగి పూర్వ వైభవం తీసుకుని రావాలని హైకమాండ్ ఇప్పటికే పెద్ద బాధ్యతలను వారి భుజాన మోపడానికి సిద్ధంగా ఉంది. 

ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ నేత జగ్గారెడ్డి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు లేఖలను రాశారు. పీసీసీ అధ్యక్ష పదవి పై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఇబ్బందిరకరంగా ఉందని.. కాంగ్రెస్ కు కావాల్సింది పులుల ,సింహాలు కాదని చెప్పుకొచ్చారు జగ్గారెడ్డి. అందరినీ కలుపుకొని పార్టీకి  విధేయులుగా ఉండే నాయకత్వం  కావాలని.. పార్టీ బలోపేతానికి 25మంది తో కమిటీ వేస్తే బాగుంటుందని లేఖలో తెలిపారు. బలమైన నాయకులను ఎంపిక చేసి ఒక్కొక్కరికి 5 నియోజకవర్గాలు గెలిపించే బాధ్యత అప్పగించాలని కోరారు. రైతులు, నిరుద్యోగులు‌, మహిళలు, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ ల  సమస్యల పై పోరాడేందుకు విడి విడిగా కమిటీ లు వేయమని కోరారు. వారిని సమన్వయం చేసే బాధ్యత పీసీసీకి అప్పగించాలని కోరారు.

ఇక పీసీసీ అధ్యక్ష పీఠంకు సంబంధించిన ప్రచారం ఇటీవలి కాలంలో విపరీతంగా సాగుతున్న సమయంలో జగ్గారెడ్డి ఆ విషయాన్ని కూడా కాంగ్రెస్ హై కమాండ్ కు చెప్పారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో పీసీసీ ఎంపిక నిర్ణయం వాయిదా వేయాలని కోరారు. ఈ ప్రతిపాదనలో నాకు ఎలాంటి స్వార్థం లేదని చెప్పారు. నాగార్జునసాగర్ లో కాంగ్రెస్ గెలవాలన్నదే తన బలమైన ఆకాంక్ష అని అన్నారు. నేను పరిమితి దాటి మాట్లాడితే క్షమించమని ఆయన లేఖ కోరారు.మరో వైపు నాగార్జున సాగర్ కాంగ్రెస్ కు ఎంతో బలమైన ప్రాంతం.. ఈసారి మాత్రం అక్కడ తప్పకుండా గెలవాలని కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలను రచిస్తూ ఉంది.  

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   17 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   13 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   16 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   20 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   a day ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   a day ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle