తెలంగాణలో బీజేపీ గెలుపు గాలివాటమా..? బలమా..? తేలేది అక్కడేనట..!
12-01-202112-01-2021 16:20:57 IST
Updated On 12-01-2021 16:19:56 ISTUpdated On 12-01-20212021-01-12T10:50:57.688Z12-01-2021 2021-01-12T08:20:12.635Z - 2021-01-12T10:49:56.491Z - 12-01-2021

బీజేపీ తెలంగాణలో వేగంగా విస్తరించేందుకు వ్యూహాత్మకంగా ముందుకెళ్తుంది. ఇటీవల దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో తన ప్రభావాన్ని చూపిన బీజేపీ.. రాష్ట్రంలో తెరాసకు ప్రత్యామ్నాయం మేమేఅని బల్లగుద్ది చెబుతుంది. తెరాస, కాంగ్రెస్ లు మాత్రం బీజేపీది వాపు మాత్రమేనని.. బలంకాదని ప్రచారం చేస్తున్నాయి. ఈ క్రమంలో త్వరలో జరగబోయే నాగార్జునసాగర్ ఉప ఎన్నిక బీజేపీకి అగ్నిపరీక్షే అవుతుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. తెలంగాణలో అసలు బీజేపీది వాపా.. బలమా అనేది ఆ ఉపఎన్నికతో తేలుతుందని ప్రజలుసైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో నాగార్జునసాగర్ ఉపఎన్నికను బీజేపీ నేతలుసైతం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. నాగార్జున సాగర్ నియోజకవర్గం కాంగ్రెస్ కు కంచుకోటలాంటిది. అక్కడ జానారెడ్డి ఇప్పటికే ఏడుసార్లు కాంగ్రెస్ జెండాను ఎగురవేశారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థిగా బరిలో నిలిచిన నోముల నర్సింహయ్య విజయం సాధించాడు. అయితే ఇటీవల ఆయన మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఏపీలో తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక మార్చి 15లోపు నోటిఫికేషన్ విడుదల చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తున్నట్లు తెలుస్తోంది. తిరుపతి ఉప ఎన్నికతో పాటే నాగార్జున సాగర్ ఉప ఎన్నికను నిర్వహించనున్నట్లు సమాచారం. దీంతో అన్ని పార్టీలు నాగార్జున సాగర్ నియోజకవర్గంపై దృష్టిసారించాయి. ఇప్పటికే సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకొనేందుకు తెరాస వ్యూహాలు రచిస్తుంది. కాంగ్రెస్ నుంచి జానారెడ్డి బరిలో దిగడం ఖరారు కావటంతో.. ఇప్పటికే కాంగ్రెస్ ప్రచారాన్ని మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. జానారెడ్డిలాంటి బలమైన నేతను ఢీకొట్టాలంటే బలమైన అభ్యర్థిని బరిలో దింపేలా సీఎం కేసీఆర్ సమాలోచన చేస్తున్నారు. ఇక బీజేపీకి ఈ ఉప ఎన్నిక అగ్నిపరీక్షగా మారబోతుంది. ఇటీవల దుబ్బాక, జీహెచ్ ఎంసీలో బీజేపీ గెలుపు గాలివాటం కాదని.. బీజేపీ బలమేనని తేల్చేందుకు ఈ ఉప ఎన్నికలో గెలవాల్సిన తప్పని పరిస్థితి. దీంతో బీజేపీ అధిష్టానం వ్యూహాత్మకంగా ఉప ఎన్నికను ఎదుర్కొనేందుకు ముందుకెళ్తుంది. కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డిని ఎదుర్కోవాలంటే అంత ఆసామాసీ విషయం కాదు. దీంతో బీజేపీకి అభ్యర్థి ఎంపికే కీలకం కానుంది. ఇప్పటికే జిల్లాకు చెందిన పలువురు ఆశావహులు ఎవరికి వారుగా ప్రచారం చేసుకుంటూ తామే బరిలో ఉంటున్నట్లు సంకేతాలు ఇస్తున్నారు. అయితే బీజేపీ అధిష్టానం మాత్రం ఆచితూచి అడుగులు వేస్తుంది. నియోజకవర్గంలో కుల సమీకరణల ఆధారంగా యాదవ సామాజిక వర్గానికి టికెట్ ఇస్తే బాగుంటుందా..? లేక తెరాసలో టికెట్ ఆశించి భంగపడ్డ వారిని పార్టీలోకి ఆహ్వానించి బరిలో నిలిపితే బాగుంటుందా అని బీజేపీ అధిష్టానం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో త్రిముఖ పోటీ ఉండబోతుండటంతో.. ఓట్లు చీలుతాయని.. ఆ మేరకు వ్యూహం రచించి ముందుకెళ్లాలని కమలనాథులు కసరత్తు చేస్తున్నారు. మొత్తానికి తెలంగాణలో బీజేపీ గెలుపు గాలివాటం కాదు.. బలమే అని నిరూపించుకోవాలంటే నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో తప్పక గెలవాల్సిందే.

అమిత్ షాతో ముగిసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ
3 hours ago

తిరుమలలో నిన్న పందులు.. నేడు దొంగలు.. ఏంది సార్ ఇది
3 hours ago

ఢిల్లీ చేరుకున్న వైఎస్ జగన్.. ఎలాంటి రాజకీయ కారణాలు లేవంటున్న సజ్జల
5 hours ago

దేవినేని ఉమ విడుదల..!
7 hours ago

ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం.. ఎవరెవరు ఉన్నారంటే..!
7 hours ago

'దీదీ'ని ఓడించకపోతే రాజకీయాల్లోంచే తప్పుకుంటా.. సువేందు
8 hours ago

ఏ పార్టీలో అయినా చేరండి.. కానీ రాజీనామా చేయండి.. రజనీ మక్కల్ మన్రం
10 hours ago

బలమేంటో తెలీదా.. లేదంటే బలమే లేదా
12 hours ago

మతం పేరు వర్కవుట్ అవుతుందా.. తెలుగోళ్లు పట్టించుకుంటారా
13 hours ago

ఉన్నదే ముచ్చటగా ముగ్గురు నలుగురు.. మళ్లీ అందులో గ్రూపులా
14 hours ago
ఇంకా