హైదరాబాదీలకు ఓట్ వేయాలనే అనిపించడం లేదా..?
01-12-202001-12-2020 16:28:34 IST
Updated On 01-12-2020 16:56:02 ISTUpdated On 01-12-20202020-12-01T10:58:34.288Z01-12-2020 2020-12-01T10:58:25.652Z - 2020-12-01T11:26:02.018Z - 01-12-2020

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలనే జోష్ ప్రజల్లో అసలు కనిపించడం లేదు. గతంతో పోలిస్తే ఎక్కువ ఓటింగ్ శాతం నమోదవుతుందని అధికారులు భావించారు. కానీ పరిస్థితులు చూస్తుంటే అందుకు విరుద్ధంగా ఉన్నాయి. మధ్యాహ్నం 3 గంటల సమయానికి కూడా కేవలం 25.34 శాతం ఓటింగ్ నమోదు అయ్యింది. ప్రతి ఒక్కరూ ఓటేయాలని విస్తృతంగా ప్రచారం జరిగినా ఆశించిన మేర ఓటింగ్ నమోదు కాలేదు. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి పార్థసారథి మాట్లాడుతూ కరోనా కారణంగా ఓటింగ్ తగ్గిందని, చలి వాతావరణం కూడా ఉదయం పూట ఓటర్లకు ఇబ్బందిగా మారిందన్నారు. సాధారణంగా మధ్యాహ్నం 12 గంటల సమయానికే భారీగా పోలింగ్ జరిగేదని, ఈసారి మధ్యాహ్నం తర్వాత ఓటింగ్ శాతం పుంజుకుంటుందని భావిస్తున్నామన్నారు. ఎన్నికల్లో ఆందోళనకర స్థాయిలో గొడవలు ఏమీలేవని, పోలీసులు అప్రమత్తంగానే ఉన్నారని అన్నారు. ఇది చదవండి: ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం.. ఇంకాస్త టెన్షన్..! జీహెచ్ఎంసీ పరిధిలో జరుగుతున్న ఈ పోలింగ్ లో ఈసారి ఐటీ ఉద్యోగుల సందడి కూడా పెద్దగా కనిపించలేదని అంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని మొత్తం 150 డివిజన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటింగ్ కోసం బ్యాలెట్ పేపర్లు ఉపయోగిస్తున్నారు. కరోనా వ్యాప్తి జరగకుండా సామాజిక దూరం, శానిటైజర్లు ఉపయోగించారు. మాస్క్ వేసుకునే ఓటు వేయడానికి రావాలని ఎన్నికల కమీషన్ ఓటర్లను కోరింది.

ఎన్నికలకు సహకరిస్తామని చెప్పిన ఏపీ ప్రభుత్వం..!
an hour ago

ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా ఠాకూర్.. షాక్ లో ప్రతిపక్షాలు
29 minutes ago

రేషన్ డోర్ డెలివరీ వాహనాలను ప్రారంభించిన వైఎస్ జగన్
2 hours ago

జగన్ సర్కార్ కి మరో దెబ్బ.. ఎన్నికలు జరపాలని చెప్పిన హై కోర్టు
2 hours ago

రేవంత్ రెడ్డి, రఘువీర్ రెడ్డి.. జానారెడ్డి గెలుపుకి బాధ్యులు అవుతారా?
an hour ago

బెదిరింపులకు ఆయుధంగా మారిన అట్రాసిటీ కేసులు.. హైకోర్టు అక్షింతలు
2 hours ago

భారతీ సిమెంట్ మీద మమకారం.. వందల కోట్ల ప్రభుత్వ నిధుల చెల్లింపు
3 hours ago

ఆ ఒక్క మాట.. రెండు కులాల మధ్య చిచ్చు.. ప్రభుత్వానికి తప్పని చికాకు
4 hours ago

పల్నాడులో టీడీపీ నేత అంకులును చంపింది వీరే
5 hours ago

విడుదలైన కళా వెంకట్రావు
5 hours ago
ఇంకా