newssting
Radio
BITING NEWS :
హైదరాబాద్ వాసులను వెంటాడుతున్న వరద భయం. రానున్న మూడ్రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. ఏ క్షణాన వరద ముంచెత్తుతుందోనని కంటిమీద కునుకులేకుండా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న లోతట్టు ప్రాంతాల ప్రజలు. * హైదరాబాద్ ను ఆదుకునేందుకు కదిలిన టాలీవుడ్ తారాగణం. సీఎం రిలీఫ్ ఫండ్ కు చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేష్ కోటి రూపాయల విరాళం. చెరో 50 లక్షలు ఇచ్చిన ఎన్టీఆర్, రామ్ చరణ్. * విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఘనంగా పోలీస్ సంస్మరణ దినోత్సవ వేడుకలు. కరోనాతో మృతి చెందిన పోలీసుల కుటుంబాలకు రూ.50 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం వైసీపీనే అన్న మంత్రి సుచరిత. * ఏపీ - తెలంగాణ ప్రభుత్వాల మధ్య ఇంకా కుదరని ఆర్టీసీ ఒప్పందం. ప్రభుత్వాల మొండి వైఖరితో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. ఆర్టీసీ అలసత్వాన్ని క్యాష్ చేసుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్. ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచిన ప్రైవేట్ బస్సులు. ప్రతి ఏటా ఆర్టీసీకి లాభాలు తెచ్చిపెడుతున్న దసరా. * స్కందమాతగా దర్శనమిస్తోన్న బాసర సరస్వతీ దేవి. * పూర్తిగా నిండిన గండిపేట చెరువు. ఏ క్షణంలోనైనా గేట్లు ఎత్తి నీరు విడుదల చేసే అవకాశం. లోతట్టుప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు.

ప్రతి ఇంటికీ ఉచితంగా బ్లీచింగ్‌ పౌడర్, క్లోరిన్‌ మాత్రలు పంపిణీ

17-10-202017-10-2020 12:20:51 IST
2020-10-17T06:50:51.895Z17-10-2020 2020-10-17T06:50:47.244Z - - 21-10-2020

ప్రతి ఇంటికీ ఉచితంగా బ్లీచింగ్‌ పౌడర్, క్లోరిన్‌ మాత్రలు పంపిణీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

తెలంగాణ రాష్ట్రాన్ని భారీ పైపులైన్లు లీకై వరద నీరు సంపుల్లోకి, ట్యాంకుల్లోకి చేరి నీరు అపరిశుభ్రమై అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉండటంతో ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు యుద్ధప్రాతిపదికన ఇంటింటికీ బ్లీచింగ్‌ పౌడర్, క్లోరిన్‌ మాత్రలు పంపిణీ చేయాలని అధికారులను మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. మంత్రి ఆదేశాలకు మేరకు జలమండలి అధికారులు వెంటనే పంపిణీ ప్రారంభించారు. సంపులను, ట్యాంకులను ప్రభుత్వం సరఫరా చేసే బ్లీచింగ్‌ పౌడర్‌తో శుభ్రం పరుచుకోవాలని, సరఫరా చేసే తాగునీటిలో క్లోరిన్‌ మాత్రలు కలుపుకొని వాడుకోవాలని  హైదరాబాద్ జలమండలి ప్రజలకు సూచించింది. ప్రజారోగ్య పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, హైదరాబాద్‌లో సాధ్యమైనంత త్వరగా పరిస్థితిని చక్కదిద్దేందుకు అన్నిచర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. న‌గ‌రంలో ప్రజలు తాగునీటి విష‌యంలో కొన్నిరోజులు జాగ్రత్తలు తీసుకోవాల‌ని సూచించారు. కాచివ‌డ‌పోసిన నీటిని తాగితే సీజ‌న‌ల్ వ్యాధులు దరిచేరవని చెప్పారు. వ‌ర‌ద ముంపు ప్రాంతాల్లో ప్రజలకు అవ‌స‌ర‌మైన వైద్య సదుపాయాలు  కల్పిస్తామని స్పష్టం చేశారు. 

జలమండలి ఉద్యోగులు కేటీఆర్ ఆదేశాలమేరకు హైదరాబాద్ లోని ఇంటింటికీ బ్లీచింగ్ పౌడర్, క్లోరిన్ మాత్రలు పంపిణీ చేస్తున్నారు. ఇంటికి ఒక కిలో బ్లీచింగ్ పౌడర్, నీటిలో కలపడానికి క్లోరిన్ మాత్రలను ఇస్తున్నారు. ఇటీవలి భారీ వర్షాల కారణంగా ఇంటి నిల్వ సంపు.. వర్షపు నీటితో కలిసి ఉంటే, మీ సంపులు, ట్యాంకులను బ్లీచింగ్ పౌడర్ తో శుభ్రపరచాలని కూడా జలమండలి హైదరాబాద్ ప్రజలకు ఒక ప్రకటన జారీ చేసింది. జలమండలి సరఫరా నీటితో సంపులు నింపుకుని ఆ నీటిలో క్లోరిన్ మాత్రలను కలిపి నీటిని వాడుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇతర వివరాలకు జల మండలి కస్టమర్ కేర్ నెం. 155313 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయాలని తెలిపారు.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle