newssting
Radio
BITING NEWS :
హైదరాబాద్ వాసులను వెంటాడుతున్న వరద భయం. రానున్న మూడ్రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. ఏ క్షణాన వరద ముంచెత్తుతుందోనని కంటిమీద కునుకులేకుండా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న లోతట్టు ప్రాంతాల ప్రజలు. * హైదరాబాద్ ను ఆదుకునేందుకు కదిలిన టాలీవుడ్ తారాగణం. సీఎం రిలీఫ్ ఫండ్ కు చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేష్ కోటి రూపాయల విరాళం. చెరో 50 లక్షలు ఇచ్చిన ఎన్టీఆర్, రామ్ చరణ్. * విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఘనంగా పోలీస్ సంస్మరణ దినోత్సవ వేడుకలు. కరోనాతో మృతి చెందిన పోలీసుల కుటుంబాలకు రూ.50 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం వైసీపీనే అన్న మంత్రి సుచరిత. * ఏపీ - తెలంగాణ ప్రభుత్వాల మధ్య ఇంకా కుదరని ఆర్టీసీ ఒప్పందం. ప్రభుత్వాల మొండి వైఖరితో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. ఆర్టీసీ అలసత్వాన్ని క్యాష్ చేసుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్. ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచిన ప్రైవేట్ బస్సులు. ప్రతి ఏటా ఆర్టీసీకి లాభాలు తెచ్చిపెడుతున్న దసరా. * స్కందమాతగా దర్శనమిస్తోన్న బాసర సరస్వతీ దేవి. * పూర్తిగా నిండిన గండిపేట చెరువు. ఏ క్షణంలోనైనా గేట్లు ఎత్తి నీరు విడుదల చేసే అవకాశం. లోతట్టుప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు.

ఒక్కో కుటుంబానికి రూ.2,800 విలువైన వస్తువుల అందజేత

18-10-202018-10-2020 18:52:27 IST
2020-10-18T13:22:27.254Z18-10-2020 2020-10-18T13:22:20.427Z - - 21-10-2020

ఒక్కో కుటుంబానికి రూ.2,800 విలువైన వస్తువుల అందజేత
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

వరద ప్రభావిత ప్రాంతాలకు చెందిన ఒక్కో కుటుంబానికి రూ.2,800 విలువైన వస్తువులను అందజేస్తున్నామని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ అన్నారు. ముంపు ప్రాంతాలను సాధారణ స్థితికి తెచ్చేందుకు అన్నివిధాలా కృషి చేస్తున్నామని‌ అన్నారు. ఈ నెల 13 నుంచి కురిసిన భారీ వర్షానికి పలు కాలనీలు నీటమునిగాయని అన్నారు. ముంపు ప్రభావిత ప్రాంతాల్లోని 2100 కుటుంబాలను ఖాళీ చేయించామని తెలిపారు.  నగర వ్యాప్తంగా 35,309 కుటుంబాలు వరద ముంపు బారినపడ్డాయని, బాధిత కుటుంబాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నామని ఆయన చెప్పారు.

మరోమూడు రోజులు నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అందుకు అనుగుణంగా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అధికారులను అప్రమత్తం చేశామని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని అన్నారు.  

ముంపు ప్రాంతాల్లో తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలని జలమండలి ఎండీ దాన కిశోర్‌ సూచించారు.  ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాలని సిబ్బందికి సూచించారు. పునరావాస ప్రాంతాల్లో  నీటి ప్యాకెట్లు, వాటర్ క్యాన్లు అందించాలన్నారు.  భారీ వర్షాల నేపథ్యంలో పైపులైన్లు లీకై తాగునీరు కాలుషితమయ్యే అవకాశముందని, ప్రజలు కాచీచల్లార్చిన నీటిని తాగితే మంచిదని చెప్పారు. బ్లీచింగ్‌ కలుపుకొని నీటిని వాడుకోవాలని కోవాలన్నారు. జలమండలి డైరెక్టర్లు, సీజీఎంలు, జనరల్‌ మేనేజర్లతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు.  సీవరేజ్‌ ఫిర్యాదుల పరిష్కారానికి రూ. 1.20 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. రిజర్వాయర్ల శుద్ధి మరమ్మతుల కోసం మరో రూ. 50 లక్షలు మంజూరు చేశామన్నారు.  అత్యవసర సేవల కోసం అదనంగా మరో 700 మంది సిబ్బందిని నియమించినట్లు వెల్లడించారు.  


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle