newssting
Radio
BITING NEWS :
హైదరాబాద్ వాసులను వెంటాడుతున్న వరద భయం. రానున్న మూడ్రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. ఏ క్షణాన వరద ముంచెత్తుతుందోనని కంటిమీద కునుకులేకుండా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న లోతట్టు ప్రాంతాల ప్రజలు. * హైదరాబాద్ ను ఆదుకునేందుకు కదిలిన టాలీవుడ్ తారాగణం. సీఎం రిలీఫ్ ఫండ్ కు చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేష్ కోటి రూపాయల విరాళం. చెరో 50 లక్షలు ఇచ్చిన ఎన్టీఆర్, రామ్ చరణ్. * విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఘనంగా పోలీస్ సంస్మరణ దినోత్సవ వేడుకలు. కరోనాతో మృతి చెందిన పోలీసుల కుటుంబాలకు రూ.50 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం వైసీపీనే అన్న మంత్రి సుచరిత. * ఏపీ - తెలంగాణ ప్రభుత్వాల మధ్య ఇంకా కుదరని ఆర్టీసీ ఒప్పందం. ప్రభుత్వాల మొండి వైఖరితో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. ఆర్టీసీ అలసత్వాన్ని క్యాష్ చేసుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్. ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచిన ప్రైవేట్ బస్సులు. ప్రతి ఏటా ఆర్టీసీకి లాభాలు తెచ్చిపెడుతున్న దసరా. * స్కందమాతగా దర్శనమిస్తోన్న బాసర సరస్వతీ దేవి. * పూర్తిగా నిండిన గండిపేట చెరువు. ఏ క్షణంలోనైనా గేట్లు ఎత్తి నీరు విడుదల చేసే అవకాశం. లోతట్టుప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు.

హైదరాబాద్ లోని రోడ్లు మూసివేత.. క్యుములోనింబస్‌ మేఘాల కారణంగానే..!

18-10-202018-10-2020 18:05:18 IST
2020-10-18T12:35:18.443Z18-10-2020 2020-10-18T12:31:21.268Z - - 21-10-2020

హైదరాబాద్ లోని రోడ్లు మూసివేత.. క్యుములోనింబస్‌ మేఘాల కారణంగానే..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

శనివారం సాయంత్రం నుంచి అర్థరాత్రి వరకు హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షానికి రహదారులు మొత్తం జలమయమయ్యాయి. పలు కాలనీల్లో, రోడ్లపై ఎక్కడికక్కడ వరద నీరు నిలిచిపోయింది. ట్రాఫిక్‌ పోలీసులు బారికేడ్లతో రహదారులను మూసివేశారు. మలక్‌పేట రైలు వంతెన, ముసారాంబాగ్‌ వంతెన రోడ్లు మూసివేశారు. చాదర్‌ఘాట్‌, పురానాపూల్‌ 100 ఫీట్‌రోడ్డులో రాకపోకలు నిలిపివేశారు. గడ్డిఅన్నారం నుంచి శివగంగ రోడ్లు అదేవిధంగా బండ్లగూడ మీదుగా ఆరాంఘర్‌ వెళ్లే దారి, మహబూబ్‌నగర్‌ క్రాస్‌ రోడ్డు నుంచి ఐఎస్‌ సదన్‌కు వెళ్లే రోడ్డును మూసివేశారు. 

క్యుములోనింబస్‌ మేఘాల కారణంగా శనివారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఏకధాటిగా కురిసిన భారీవర్షం జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. లోతట్టు ప్రాంతాల్లోకి మళ్లీ నీళ్లు చేరాయి. నాలాలు పొంగిపొర్లాయి. రహదారులు చెరువులను తలపించాయి. జాతీయరహదారులపై భారీగా వరద ప్రవహిస్తున్నది. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాత్రి 12గంటల వరకు మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ మండలం సింగపూర్‌ టౌన్‌షిప్‌లో మళ్లీ రికార్డుస్థాయిలో అత్యధికంగా 19.7 సెం.మీ. వర్షపాతం నమోదైంది. రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌ మండలం రాక్‌టౌన్‌లో 17.1సెం.మీ., భవానీ నగర్‌లో 17.03 సెం.మీ. చొప్పున వర్షం కురిసిందని టీఎస్‌డీపీఎస్‌ వెల్లడించింది. 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle