newssting
Radio
BITING NEWS :
అమెరికాలోని కుంబా ప్రాంతంలో తుపాకులతో దాడులు. పాఠశాలపై దాడులకు పాల్పడిన దుండగులు. 8 మంది చిన్నారులు దుర్మరణం. ఇంతవరకూ దాడికి గల కారణాలపై నో క్లారిటీ. వేర్పాటువాదుల పనైఉంటుందని అనుమానిస్తున్న పోలీసులు. * ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా ఉత్సవాలు. ఆఖరిరోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో దర్శనమిస్తున్న దుర్గమ్మవారు. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు. * దుర్గమ్మను దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. దసరా సందర్భంగా విజయవాడలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన కిషన్ రెడ్డి. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందన్న కేంద్ర మంత్రి. * రానున్న 4 రోజుల్లో ఏపీకి భారీ వర్షాలు. * సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద పేలుడు. ఆలయం సమీపంలోని చెత్తకుప్పలో పేలిన పెయింట్ డబ్బా, వ్యక్తికి గాయాలు. * వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం బుద్దారం గ్రామంలో విషాదం. భారీ వర్షాలకు నానిపోయిన ఇంటి పై కప్పు కూలి ఐదుగురు దుర్మరణం, ఇద్దరికి తీవ్రగాయాలు. * తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్.

కన్నీటి కష్టంలోనూ రాజకీయాలే.. పరామర్శలపై ప్రజల ధ్వజం

16-10-202016-10-2020 13:15:45 IST
2020-10-16T07:45:45.822Z16-10-2020 2020-10-16T07:45:43.035Z - - 25-10-2020

కన్నీటి కష్టంలోనూ రాజకీయాలే.. పరామర్శలపై ప్రజల ధ్వజం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
విశ్వనగరంగా తెలంగాణ ప్రభుత్వం, ప్రజలు కూడా గర్వంగా చెప్పుకునే హైదరాబాద్ మహా నగరాన్ని వరద కష్టాలు ఇంకా వీడలేదు. ఎడతెరిపి లేకుండా కురిసిన వానలు నగరవాసికి నరకాన్ని చూపించాయి. వాన వెలిసి 48 గంటలైనా అనేక లోతట్టు ప్రాంతాలు ఇంకా జల దిగ్బంధంలో, అంధకారంలోనే ఉండిపోయాయి. గురువారం వాన తెరిపి నిచ్చినా.. పూడ్చలేని నష్టాలు, కష్టాల కడగండ్లు మాత్రం అలాగే మిగిలాయి. 

బాధితులకు తినడానికి తిండి.. కంటి నిండా కునుకు కరువయ్యాయి. వందలాది కుటుంబాలు ప్రాణాలు అరచేత పట్టుకొని సహాయం కోసం బిక్కుబిక్కుమంటున్నాయి. వాననీరు వెళ్లే దారులన్నీ మూసుకుపోవడంతో ముంపు ప్రాంతాలు ఇంకా చెరువు లను తలపిస్తున్నాయి. కనీసం తాగేందుకూ నీళ్లు కరువై.. పాలు, ఇతర నిత్యావసరాలు అందక బాధితులు పస్తులతో తల్లడిల్లుతున్నారు. ఇది జనాగ్రహానికి దారితీసి రెండు రోజుల తర్వాత సందర్శించడానికి వచ్చిన నాయకులపై విరుచుకు పడుతున్నారు.

ముంపు ప్రాంతాల్లో పరిస్థితిని పరిశీలించేందుకు వస్తున్న ప్రజాప్రతినిధులకు బాధితుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. నీళ్లు వెళ్లే నాలాలన్నీ ఆక్రమణలకు గురవడం, భారీ వర్షపునీటి ప్రవాహానికి నాలాలు సరిపోకపోవడం.. నగరానికి కన్నీటి కష్టాలను మిగిల్చాయి. నాలాల పునరుద్ధరణ, ఆధునీకరణకు ప్రజా ప్రతినిధులు, అధికారులు ఇస్తున్న హామీలు ప్రకటనలకే పరిమితమై శాశ్వత పరిష్కారానికి నోచుకోవడం లేదన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

హబ్సిగూడ లక్ష్మీనగర్‌లో బాధితులను పరామర్శించడంతో పాటు పరిస్థితుల అంచనాకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బోటులో అధికారులతో కలిసి వచ్చిన ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డిపై.. ఇళ్లపై ఉండి సాయం కోసం చూస్తున్న ముంపు బాధిత మహిళలు ఆగ్రహావేశాలు ప్రదర్శించారు. ‘అలానే వెళ్లిపోతారా.. రెండ్రోజులుగా నీటిలో ఉంటూ పస్తులున్నా పట్టించుకోరా మీ పేరు రాసి చచ్చిపోతాం’ అంటూ విరుచుకుపడ్డారు. దీంతో ఇబ్బందిపడిన ఎమ్మల్యే ఎవరికీ ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని వారికి సర్దిచెప్పారు.

హుస్సేన్‌సాగర్‌ నాలా పరీవాహక ప్రాంతమైన దత్తానగర్, హిమాయత్‌నగర్‌ స్ట్రీట్‌ నంబర్‌–1, దోమలగూడ డివిజన్‌లోని వెంకటమ్మ బస్తీలో  పర్యటించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి, నగర ప్రధాన కార్యదర్శి రామన్‌గౌడ్‌కు చేదు అనుభవం ఎదురైంది. ‘వర్షాలతో మూడ్రోజులుగా ఇబ్బంది పడుతుంటే.. ఇప్పుడా మీరొచ్చేది’ అంటూ బస్తీవాసులు నిలదీశారు. స్వల్ప ఆగ్రహానికి గురైన కిషన్‌రెడ్డి.. వర్షాల్లో చిక్కుకున్న మిమ్మల్ని చూసి పరామర్శించి, చేతనైన సాయం చేద్దామని వచ్చామని సర్దిచెప్పారు. ‘మమ్మల్ని నిలదీస్తే మీకేం వస్తుంది మీరు ఓట్లు గెలిపించుకున్న వాళ్లను నిలదీయండి’ అంటూ బస్తీవాసులకు బదులిచ్చారు.

నగరంలోని పలు అపార్ట్‌మెంట్ల సెల్లార్లలోకి నీరు చేరింది. ఈ నీటిని తోడిపోయడం తలకు మించిన భారమవుతోంది. సెల్లార్లలో భారీగా నీరు చేరడంతో ఎవరూ ప్లాట్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేకుండాపోయింది. పలుచోట్ల విద్యుత్‌ సరఫరాను అధికారులు నిలిపేశారు. ఓవైపు అంధకారం.. మరోవైపు జలదిగ్బంధం.. ఇంకోవైపు నిత్యావసరాలు తెచ్చుకునే వీలులేక కాలనీలవాసులు నానాయాతన పడుతున్నారు. సెల్లార్లలోని కార్లు, టూవీలర్లు పూర్తిగా మొరాయించడంతో మెకానిక్‌ల వద్దకు పలువురు క్యూ కడుతున్నారు. కరెంట్‌ సరఫరా లేక, లిఫ్టులు పనిచేయక వృద్ధులు, అనారోగ్య సమస్యలున్నవారు ఆస్పత్రులకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.

సెల్లార్ల లోని మొత్తం నీటిని తొలగించి, ఎలాంటి తడి లేకుండా ఉంటేనే లిఫ్టును ఉపయోగించాలని విద్యుత్‌ శాఖ హెచ్చరించడంతో పై అంతస్తుల్లోని వారు ప్రతి చిన్న అవసరానికి మెట్లు దిగక తప్పట్లేదు. అనేక కాలనీల్లోని అపార్ట్‌మెంట్లు, బహుళ అంతస్తుల సెల్లార్లలోకి చేరిన వర్షపునీటిని తోడేందుకు ఒక్కసారిగా జనరేటర్లకు డిమాండ్‌ పెరిగింది. రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు ఖర్చుచేస్తే కానీ అవి దొరకడంలేదు.  ఆయా భవ నాల వాచ్‌మన్లు అపార్ట్‌మెంట్‌ సెల్లార్, పార్కింగ్‌ ప్రదేశాల్లో కేటాయించిన గదుల్లోనే ఎక్కువగా ఉంటుంటారు. సెల్లార్లు నీటితో నిండిపోవడంతో వీళ్ల కష్టాలు చెప్పనలవి కాకుండా ఉన్నాయి. అపార్ట్‌మెంట్‌ కాపలాతోపాటు అందులో ఉండే నివాసితులకు సమయానికి ఏదికావాలంటే అది సమకూర్చే వాచ్‌మన్లు ఇప్పుడు తాముండటానికే చోటులేక రోడ్డునపడ్డారు.

ఖైరతాబాద్‌ ముంపు ప్రాంతాల బాధితులకు కాంగ్రెస్‌ ఆహార పదార్థాలను అందించింది. పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, గ్రేటర్‌ హైదరాబాద్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్, ఖైరతాబాద్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి దాసోజు శ్రవణ్, నాంపల్లి ఇన్‌చార్జి ఫిరోజ్‌ ఖాన్, íపీసీసీ కార్యదర్శి మధుకర్‌యాదవ్, మహేష్‌యాదవ్‌ తదితరులు బాధితులను పరామర్శించారు. స్థానికుల ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌తో మాట్లాడి సూచించారు. ఈ సందర్భంగా మక్తాలో బ్రెడ్డు, పాలు అందజేశారు.  

పల్లె చెరువుకు గండిపడటంతో లోతట్టు బస్తీల్లోకి నీరుచేరి 48 గంటలు కావస్తున్నా పరిస్థితి అదుపులోకి రాలేదు. దిగువన ఉన్న జీఎం కాలనీ, చావునీలలో కొద్దిగా నీటి ప్రవాహం తగ్గినా.. క్రాంతినగర్‌లో మాత్రం ఇళ్లలో నీరు అలాగే ఉంది. ఆయా బస్తీలవాసులు కంటి మీద కునుకు కరువై ఇంటి పైకప్పుల పైకెక్కి సాయం కోసం చూస్తున్నారు. వర్ష బీభత్సంతో వణికిపోయిన పాతబస్తీ ఇప్పుడి ప్పుడే తేరుకుంటోంది. ఇక్కడి లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇళ్ల ఆవరణలో నిలిచిన నీటిని పారబోసే పనిలోపడ్డారు.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle