newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

హైదరాబాద్ పేరును మార్చేస్తామని అంటున్న బీజేపీ నేత

08-03-202108-03-2021 13:24:59 IST
2021-03-08T07:54:59.709Z08-03-2021 2021-03-08T07:54:55.399Z - - 11-04-2021

హైదరాబాద్ పేరును మార్చేస్తామని అంటున్న బీజేపీ నేత
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక ఎన్నో ప్రాంతాల పేర్లను మార్చడం జరిగింది. ముఖ్యంగా మొఘలుల కాలంలో మార్చిన పేర్లన్నిటినీ చాలా వరకూ మార్చారు. ఇక హైదరాబాద్ ను భాగ్యనగరం అంటారని అందరికీ తెలిసిందే..! గ‌తంలోనూ కొంద‌రు బీజేపీ నేత‌లు హైద‌రాబాద్ పేరును భాగ్య‌న‌గ‌ర్‌గా మార్చుతామ‌ని వ్యాఖ్యలు చేశారు. తాజాగా కూడా హైద‌రాబాద్ పేరును మార్చేస్తామ‌ని బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు వ్యాఖ్యానించారు. ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న మాట్లాడుతూ... హైదరాబాద్ పేరును భాగ్యనగర్‌గా మార్చి తీరతామని, ఈ విష‌యంలో త‌మ‌ను  ఎవరూ అడ్డుకోలేరని తెలిపారు. కేవలం న‌గ‌ర‌ పేరును మార్చ‌డం మాత్ర‌మే తమ ఉద్దేశం కాదని, స‌మాజంలో సైద్ధాంతిక మార్పును కూడా తీసుకువ‌స్తామ‌ని తెలిపారు. ఈ  అంశాల‌పై తాము  ప్రజల నుంచి మద్దతును కూడగడతామని అన్నారు. ప్ర‌జ‌ల‌కు తాము అవగాహన కలిగిస్తామని చెప్పారు. ప్రపంచానికే మ‌న దేశం ఆదర్శంగా నిలుస్తోందని ఆయ‌న తెలిపారు.  

ఆదివారం నగరంలోని విశ్వేశ్వరయ్య భవన్‌లో ‘భారత్ నీతి’ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ‘డిజిటల్ హిందూ కాంక్లేవ్’ కార్యక్రమంలో మాట్లాడిన బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు హైదరాబాద్ పేరు మార్చే విషయంలో తమను ఎవరూ అడ్డుకోలేరని తేల్చి చెప్పారు. కేవలం పేరు మార్పే తమ ఉద్దేశం కాదని... సైద్ధాంతిక మార్పు కూడా తమ ఉద్దేశమన్నారు. 

తెలంగాణ రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ టీఆర్ఎస్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రం ఏమీ ఇవ్వడంలేదని కేటీఆర్ అంటున్నారని, అన్నీ ఇచ్చాక వీళ్లు పొడిచేది ఏమిటని అన్నారు. కేంద్రం నిధులు లేనిదే ఏ పథకం ముందుకు కదిలే పరిస్థితి లేదని బండి సంజయ్ స్పష్టం చేశారు. 20 లక్షలు ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే కేసీఆర్ కు తోమాల సేవ చేస్తానని, నిరూపించకుంటే బడితె పూజ చేస్తానని అన్నారు. ఎన్టీఆర్, పీవీ ఘాట్ లను కూల్చుతామని ఒవైసీ అంటే కేసీఆర్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   17 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   13 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   16 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   20 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   a day ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   a day ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle