ఆహా అనిపించేలా డ్యాన్సులు.. ఎంఐఎం నేతల రేవ్ పార్టీ వీడియోలు..!
07-04-202107-04-2021 12:47:22 IST
Updated On 07-04-2021 10:02:39 ISTUpdated On 07-04-20212021-04-07T07:17:22.043Z07-04-2021 2021-04-07T03:24:27.039Z - 2021-04-07T04:32:39.740Z - 07-04-2021

హైదరాబాద్ కు చెందిన ఎంఐఎం నేతలు ఇప్పుడు సరికొత్త వివాదంలో ఇరుక్కున్నారు. హైదరాబాద్ నగరంలోని చాంద్రాయణగుట్టలో రేవ్ పార్టీ జరిగిందంటూ వీడియోల కలకలం రేపుతోంది. ఫిబ్రవరి 13న ఓ ఇంట్లో ఎంఐఎం కార్యకర్తలు రేవ్ పార్టీ నిర్వహించినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆ పార్టీకి సంబంధించిన వీడియోలు కూడా బయటకు రావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మజ్లిస్ నేత తన స్నేహితులతో కలిసి రేవ్ పార్టీ నిర్వహించినట్లు వార్తలు వచ్చాయి. రేవ్ పార్టీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చాంద్రాయణగుట్ట పోలీసులు స్పందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీనికి సంబంధించి పర్వేజ్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఘటన జరిగిన సమయంలో వెంటనే దాడి చేస్తే వివరాలు తెలిసేవని, ప్రస్తుతం కేవలం వీడియో మాత్రమే ఉన్నందున దానికి సంబంధించిన వివరాలు సేకరించాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. బార్కాస్‌కు చెందిన మజ్లిస్ పార్టీ నాయకుడు పర్వేజ్‌కు గౌస్‌నగర్ ఉందాహిల్స్‌లో ఇంపీరియల్ ఫాం హౌజ్ ఉంది. కాగా ఈ ఏడాది ఫిబ్రవరి 13వ తేదీన పర్వేజ్ తన స్నేహితులతో కలిసి ఇతర రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలను రప్పించి రేవ్ పార్టీ నిర్వహించాడు. వీరు విచ్చలవిడిగా నృత్యాలు చేస్తున్న వీడియో రెండు నెలల అనంతరం తాజాగా వెలుగులోకి వచ్చింది. మహిళలను పిలిపించి ఆశ్లీల నృత్యాలు చేయించారు. మద్యం సేవించిన వారు మగువలతో చిందులు వేసిన వీడియోలు బయటకు వచ్చాయి. తెలంగాణ భవన్ లో సంబరాలు.. చేతిలో గన్ తో టీఆర్ఎస్ నేత పోలీసులు దాడులు చేస్తున్నప్పటికీ నగరంలో రేవ్ పార్టీ కల్చర్ కొనసాగుతూనే ఉంది. మజ్లిస్ కార్యకర్తలు ఈ రేవ్ పార్టీ నిర్వహించారు. పక్క రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి.. ఫుల్లుగా మందు కొట్టారు. ఆ తర్వాత అశ్లీల నృత్యాలు చేశారు.. మద్యం మత్తులో మగువలతో చిందులేశారు. ఎంఐఎం కార్యకర్తల అశ్లీల నృత్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఫిబ్రవరి 13న జరిగిన ఈ రేవ్ పార్టీలో సదరు నాయకుడికి చెందిన స్నేహితులు మద్యం సేవించి మహిళలతో చిందులు వేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో ఫలక్‌నుమా ఏసీపీ మహ్మద్ మజీద్, చాంద్రాయణగుట్ట ఇన్స్పెక్టర్ రుద్ర భాస్కర్, అదనపు ఇన్స్పెక్టర్ కె.ఎన్.ప్రసాద్ వర్మలు ఫాంహౌజ్‌ను పరిశీలించారు. ఈ వీడియోను ఆధారంగా చేసుకొని పర్వేజ్‌తో పాటు వీడియోలో ముఖాలు గుర్తు పడుతున్న వారిపై కేసులు నమోదు చేశారు.

షర్మిల ట్రయల్స్.. పార్టీ పెట్టకుండానే ఎన్నికల్లో పోటీకి రెడీ
41 minutes ago

వెంట వెంటనే ఎన్నికలు.. మంచికేనట
14 hours ago

లొంగిపోయిన కూన రవికుమార్
10 hours ago

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
12 hours ago

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
15 hours ago

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
17 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
19 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
20 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
21 hours ago

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
a day ago
ఇంకా