newssting
Radio
BITING NEWS :
అమెరికాలోని కుంబా ప్రాంతంలో తుపాకులతో దాడులు. పాఠశాలపై దాడులకు పాల్పడిన దుండగులు. 8 మంది చిన్నారులు దుర్మరణం. ఇంతవరకూ దాడికి గల కారణాలపై నో క్లారిటీ. వేర్పాటువాదుల పనైఉంటుందని అనుమానిస్తున్న పోలీసులు. * ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా ఉత్సవాలు. ఆఖరిరోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో దర్శనమిస్తున్న దుర్గమ్మవారు. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు. * దుర్గమ్మను దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. దసరా సందర్భంగా విజయవాడలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన కిషన్ రెడ్డి. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందన్న కేంద్ర మంత్రి. * రానున్న 4 రోజుల్లో ఏపీకి భారీ వర్షాలు. * సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద పేలుడు. ఆలయం సమీపంలోని చెత్తకుప్పలో పేలిన పెయింట్ డబ్బా, వ్యక్తికి గాయాలు. * వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం బుద్దారం గ్రామంలో విషాదం. భారీ వర్షాలకు నానిపోయిన ఇంటి పై కప్పు కూలి ఐదుగురు దుర్మరణం, ఇద్దరికి తీవ్రగాయాలు. * తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్.

కూలిన గోల్కండ కోట గోడ.. ప్రకృతి చేసిన బీభత్సం

17-10-202017-10-2020 11:58:42 IST
Updated On 17-10-2020 12:14:28 ISTUpdated On 17-10-20202020-10-17T06:28:42.130Z17-10-2020 2020-10-17T06:28:33.554Z - 2020-10-17T06:44:28.634Z - 17-10-2020

కూలిన గోల్కండ కోట గోడ.. ప్రకృతి చేసిన బీభత్సం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

భారీ వర్షాలకు హైదరాబాద్ లోని చారిత్రక గోల్కండ కోటలోని ఓ గోడ కుప్పకూలింది. శ్రీజగదాంబిక అమ్మవారి ఆలయం ముందున్న 20 అడుగుల ఎత్తయిన గోడ కూలినట్టు అధికారులు తెలిపారు. పది నెలల క్రితం ఇదే గోడపై ధ్వంసమైన బురుజులకు మరమ్మతులు నిర్వహించారు. అప్పటికే ఈ గోడకు పగుళ్లు వచ్చి ప్రమాదకరంగా మారినప్పటికీ దానిని పట్టించుకోలేదు. దీంతో ఇప్పుడు కురిసిన భారీ వర్షాలకు అది కాస్తా నాని కుప్పకూలింది. పర్యాటకులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

భారీ వర్షాలకు వందల ఏళ్ల చరిత్ర కలిగిన గోల్కొండ గోడ కూడ కదిలిపోయిందని స్థానికులు అంటున్నారు. భారీ వర్షాలకు గోల్కొండ కోటలోని శ్రీజగదాంబికా అమ్మవారి ఆలయం ముందున్న దాదాపు 20 అడుగుల ఎత్తయిన గోడ కూలిపోయిందని గోల్కొండ ప్రాంత వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొవిడ్‌ నేపథ్యంలో పర్యాటకుల తాకిడి తక్కువగా ఉండటంతో ప్రమాదం తప్పింది. పది నెలల క్రితమే ఈ గోడపైన ధ్వంసమైన బురుజులకు పురావస్తుశాఖ అధికారులు మరమ్మతులు చేయించారు. ప్రహరీ కింది భాగంలో అప్పటికే పగుళ్లు వచ్చినా వారు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

నగరంలోని ప‌లు కాల‌నీల్లోకి వ‌ర్ష‌పు నీరు చేర‌డం, చెట్లు విరిగిపోవ‌డంతో.. డీఆర్ఎఫ్(డిజాస్ట‌ర్ రిలీఫ్ ఫోర్స్) బృందాలు స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ముమ్మ‌రం చేశాయి. 100 గంట‌ల్లో 382 ఫిర్యాదుల‌ను డీఆర్ఎఫ్ బృందాలు ప‌రిష్క‌రించాయి. న‌గ‌ర వ్యాప్తంగా స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొన్న డీఆర్ఎఫ్ బృందాలు స్థానికుల‌కు అండ‌దండ‌గా నిలిచాయి. రాబోయే 12 గంట‌ల్లో ఇంకా నీరు నిలిచిన ప్రాంతాలతో పాటు అక్క‌డ‌క్క‌డ నేల‌కొరిగిన చెట్ల‌ను క్లియ‌ర్ చేస్తామ‌ని డీఆర్ఎఫ్ బృందాలు తెలిపాయి. డీఆర్ఎఫ్ బృందాల స‌హాయం కోసం 040-29555500 నంబ‌ర్‌కు కాల్ చేయొచ్చు. 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle