ఫార్మాలో 700 కోట్ల పెట్టుబడులు.. స్థానికులకు ఉద్యోగాలు.. కేటీఆర్
28-10-202028-10-2020 16:41:29 IST
Updated On 28-10-2020 16:43:24 ISTUpdated On 28-10-20202020-10-28T11:11:29.135Z28-10-2020 2020-10-28T08:58:33.768Z - 2020-10-28T11:13:24.542Z - 28-10-2020

రాష్ట్రంలో ఫార్మా సహా వివిధ రంగాల్లో అనేక పెట్టుబడులు వస్తున్నాయని, పెట్టుబడులతో వచ్చే కంపెనీలకు అన్ని విధాలా సాయం అందిస్తామని రాష్ట్ర మంత్రి కె. తారకరామారావు పేర్కొన్నారు. గ్రాన్యూల్స్ ఇండియా, లారస్ ల్యాబ్ పెట్టు బడులతో తయారీ రంగంలో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రాన్యూల్స్ ఇండియా సీఎండీ కృష్ణ ప్రసాద్, లారస్ ల్యాబ్ సీఈఓ సత్యనారాయణ మంగళవారం కేటీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలిసి తమ నూతన పెట్టుబడుల గురించి వివరించారు. ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగంలో పేరొందిన రెండు ప్రముఖ కంపెనీలు హైదరాబాద్‌లో రూ. 700 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు మంగళవారం ప్రకటించాయి. ప్రపంచంలోనే అతిపెద్ద కమర్షియల్ ఫార్మాస్యూటి కల్ ఫార్ములేషన్ కంపెనీ గ్రాన్యూల్స్ ఇండియా రాష్ట్రంలో మరో రూ. 400 కోట్లతో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ యూనిట్ ద్వారా 1,600 మందికి ఉపాధి లభిస్తుంది. వేయి కోట్ల ఫినిష్డ్ డోస్‌లను కొత్తగా ఏర్పాటు చేసే యూనిట్ ద్వారా ఉత్పత్తి చేస్తామని గ్రాన్యూల్స్ ఇండియా ప్రకటించింది. తమ తాజా యూనిట్‌ను జీనోమ్ వ్యాలీలో ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ సీఎండీ కృష్ణప్రసాద్ వెల్ల డించారు. మరోవైపు లారస్ ల్యాబ్స్ కూడా జీనోమ్ వ్యాలీలో రూ. 300 కోట్లతో దశల వారీగా ఫార్ములేషన్ ఫెసిలిటీ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే లారస్ ల్యాబ్ జీనోమ్ వ్యాలీలోని ఐకేపీ నాలెడ్జ్ పార్కులో పరిశోధన అభివృద్ధి కేంద్రాన్ని నెల కొల్పింది. ఇక్కడ యాంటీ రిట్రోవైరల్, అంకా లజీ, కార్డియోవా స్క్యులార్, యాంటీ డయా బెటిక్స్, యాంటీ ఆస్తమా, గ్యాస్ట్రో ఎంటరాల జీకి సంబంధించిన యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్లను తయారు చేస్తుంది.

కొత్త విగ్రహాల తయారీకి ఆయన డబ్బు ఇస్తే తీసుకోని ప్రభుత్వం
an hour ago

కేసుతో సంబంధమే లేదంటున్న అఖిలప్రియ..?
an hour ago

మమతకు మహిళా ఎంపీ షాక్.. భవిష్యత్తు నిర్ణయంపై సంచలన పోస్టు
6 hours ago

వరస్ట్ సీఎంలలో కేసీఆర్ ది నాలుగో ప్లేస్.. సి ఓటర్ సర్వే
7 hours ago

అబద్దాలు ఎప్పట్నుంచి మొదలెట్టావు రాహుల్... తోమర్ ఎద్దేవా
9 hours ago

మైహోంపై దాడుల వెనుక ఒత్తిడి తెచ్చిన నేత ఎవరు?
9 hours ago

దాడులలో టీడీపీ-బీజేపీ నేతలు.. డీజీపీ పక్కా పొలిటికల్ స్టేట్మెంట్
10 hours ago

ముద్రగడ ఇంటికి సోము.. ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు?
11 hours ago

క్రిస్టియానిటీ అంశం తెరమీదకి తెచ్చి జగన్ కు మంచే చేశారా?
11 hours ago

ఓటర్ల జాబితా విడుదల.. నిమ్మగడ్డకు ఎంటీ ధైర్యం?
12 hours ago
ఇంకా