newssting
Radio
BITING NEWS :
అమెరికాలోని కుంబా ప్రాంతంలో తుపాకులతో దాడులు. పాఠశాలపై దాడులకు పాల్పడిన దుండగులు. 8 మంది చిన్నారులు దుర్మరణం. ఇంతవరకూ దాడికి గల కారణాలపై నో క్లారిటీ. వేర్పాటువాదుల పనైఉంటుందని అనుమానిస్తున్న పోలీసులు. * ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా ఉత్సవాలు. ఆఖరిరోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో దర్శనమిస్తున్న దుర్గమ్మవారు. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు. * దుర్గమ్మను దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. దసరా సందర్భంగా విజయవాడలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన కిషన్ రెడ్డి. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందన్న కేంద్ర మంత్రి. * రానున్న 4 రోజుల్లో ఏపీకి భారీ వర్షాలు. * సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద పేలుడు. ఆలయం సమీపంలోని చెత్తకుప్పలో పేలిన పెయింట్ డబ్బా, వ్యక్తికి గాయాలు. * వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం బుద్దారం గ్రామంలో విషాదం. భారీ వర్షాలకు నానిపోయిన ఇంటి పై కప్పు కూలి ఐదుగురు దుర్మరణం, ఇద్దరికి తీవ్రగాయాలు. * తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్.

హైద‌రాబాద్ గోస‌లు..లీడ‌ర్ల బాస‌లు

17-10-202017-10-2020 10:06:22 IST
Updated On 17-10-2020 10:21:19 ISTUpdated On 17-10-20202020-10-17T04:36:22.161Z17-10-2020 2020-10-17T04:35:34.210Z - 2020-10-17T04:51:19.392Z - 17-10-2020

హైద‌రాబాద్ గోస‌లు..లీడ‌ర్ల బాస‌లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హైద‌రాబాద్ అంతా అల్ల‌క‌ల్లోలం అయిపోయింది. ఎంత డ్రీమ్ సిటీ అయినా.. జ‌నాలు చిరాకులో ఉన్నారు. హైద‌రాబాద్ వెళ్లాలంటే ఈత రావాలి. బ‌స్సులు కాదు ప‌డ‌వ‌లు కావాలి అంటూ మెమెస్ చూసి న‌వ్వుకుంటున్నారు జ‌నాలు. లీడ‌ర్లు గ‌తంలో చెప్పిన మాట‌ల్ని కోట్ చేస్తూ సోష‌ల్ మీడియాలో ఆడేసుకుంటున్నారు. మైకులు ప‌ట్టుకుని డైలాగులు దంచే లీడ‌ర్ల‌ని, ప‌డ‌వ‌లు ఏసుకుంటూ టూర్ కి తిరిగిన‌ట్లే తిరిగే లీడ‌ర్ల‌ని మొహం ప‌ట్టుకుని అడుగుతున్నారు. దొరికితే గ‌ల్లా ప‌ట్టుకుని దులిపేలా ఉన్నారు జ‌నాలు. వాళ్లు ఎన్ని మాట‌లు చెప్పినా ఎందుకు ప‌నికొస్త‌య్ చెప్పండి.

అవును నిజ‌మే. వ‌స్తారు పోతారు. రెండు దుప్ప‌ట్లు.. రెండు కేజీల బియ్యం.. రెండు రోజుల బోజనాలు.. ఇంత‌కు మించి ఏమీ చేయ‌రు. ఇల్లు కూలిన వాళ్ల‌కి ఇల్లుక‌ట్టిస్తాం అంటారు. కూలిన వాళ్లు క‌ట్టించేదాకా ఏం చేయాలో చెప్ప‌రు. ఎక్క‌డుండాలో మ‌రి. ఆ బాధ ఎవ‌రు ప‌డాలి. గ‌వ‌ర్న‌మెంట్ కాదా చూసుకోవాల్సింది అనేది బిగ్ క్వ‌శ్చ‌న్. ఇల్లంతా గుల్లైంది.. బోజ‌నాలు ఏర్పాటు చేస్తున్నాం అంటారు. ఎన్ని రోజులు ఏర్పాటు చేస్తారు. ఎక్క‌డో పెడితే అక్క‌డి దాకా బిచ్చ‌గాళ్ల‌లా వెళ్లి తినాలా అనేది ఇంకో కొచ్చ‌న్. రోడ్లు పోతే.. ఇమీడియ‌ట్ గా ఆప్ష‌న్ ఏంటో తెలీదు. వీట‌న్నీటిపైనా లీడ‌ర్లు చాలా మాట‌లు చెబుతారు. మేమున్నాం అంటూ బాధ‌లు వినేసి వెళ్తున్నారు. కానీ.. ప‌డాల్సింది అక్క‌డ ఉండే వాళ్లే.

కన్నీటి కష్టంలోనూ రాజకీయాలే.. పరామర్శలపై ప్రజల ధ్వజం

గ‌వ‌ర్న‌మెంట్ ఎన్ని నెల‌ల త‌ర్వాత బిల్ పాస్ చేస్తుంది. ఇల్లులు ఎప్పుడొస్తాయి అనేది ఎవ‌రికీ తెలీదు. అప్ప‌టి దాకా ఎక్క‌డ త‌ల దాచుకోవాలో చూసుకోవాల్సింది జ‌నాలే. ఇప్పుడు వ‌ర‌ద పోయింది. నీళ్లు తోడి ఎటో ఒక్క‌ళ్లి పోసేశారు. కానీ.. ఈ బుర‌ద నుంచి ఎలా బ‌య‌ట ప‌డాలి. రెండు రోజుల త‌ర్వాత దాన్నుంచి ఎలా త‌ట్టుకోవాలి. వాటి ద్వారా వ‌చ్చే దోమ‌లు.. దోమ‌ల ద్వారా వ‌చ్చే వ్యాధులు. అన్నీ త‌ట్టుకోవాల్సింది జ‌నాలే. ఇప్పుడు హైదరాబాద్ జ‌నాలు అదే బాధ‌లో ఉన్నారు. ఏం చేయాలో తెలీక దిక్కుతోచ‌ని స్థితిలో ఉన్నారు. 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle