newssting
Radio
BITING NEWS :
కరోనా సంక్షోభ తరుణంలోనూ వైద్యరంగంలో విశేష సేవలందిస్తున్న సంస్థలు, వైద్యులను ప్రముఖ మార్కెట్‌ రిసెర్చ్‌ కంపెనీ ‘టాప్‌ గ్యాలెంట్‌ మీడియా’ అవార్డులతో సత్కరించనుంది. ఈ సంవత్సరానికి(2020)గానూ సర్జికల్‌ అంకాలజీలో అత్యంత విశ్వసనీయ ఆస్పత్రిగా హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్‌ కేన్సర్‌ ఆస్పత్రిని ఎంపిక చేయడం విశేషం * సుక్మా జిల్లాలోని టల్మెటాలా ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాలపై మావోయిస్టులు మళ్లీ రెచ్చిపోయారు. ఐఈడీ బ్లాస్ట్‌లతో విరుచుకుపడ్డారు. ఈ దాడి శనివారం అర్థరాత్రి జరిగింది. ఈ దాడిలో సీఆర్పీఎఫ్‌ కోబ్రాకి చెందిన ఎనిమిది మంది జవాన్లు గాయపడగా ఓ సీఆర్పీఎఫ్ అధికారి ప్రాణాలను కోల్పోయారు * కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ దేశరాజధాని ఢిల్లీలో భారీఎత్తున రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు. బురారి ప్రాంతంలోని నిరంకార్‌ మైదానంలో నిరసనకు పోలీసులు అనుమతిచ్చిన నేపథ్యంలో వేలమంది రైతులు నిరసన స్థలికి చేరుకుని కేంద్రంపై నిరసన వ్యక్తం చేశారు * పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి. తొమ్మిది రోజులుగా చమురు ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. ఈనెల 19 నుంచి శనివారం వరకు (25వ తేదీ మినహా) ధరలు పెరుగుతూనే ఉన్నాయి. శనివారం అర్ధరాత్రి కూడా మరోసారి ధరలు పెరిగాయి. గడిచిన పది రోజుల్లో పెట్రోల్‌పై లీటర్‌కు రూ.1.28, డీజిల్‌ రూ.2.09 చొప్పున పెరిగింది * బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆదివారం జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు ఆయన ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకుని.. 10:45 గంటలకు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకుని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు * రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రత భారీగా పడిపోయింది. మెదక్‌లో అతితక్కువగా 14.8 డిగ్రీలు, హైదరాబాద్‌లో 17డిగ్రీల కనిష్ఠ ఉష్ణో గ్రత నమోదైంది. గాలిలో తేమ శాతం పెరిగింది * బంగాళాఖాతంలో మరో అల్పపీడన ద్రోణి బయలుదేరింది. ఇది తుపాన్‌గా మారే అవకాశాలు ఉండడంతో దీనికి బురేవి అని నామకరణం చేయడానికి సిద్ధమయ్యారు. ఈ ప్రభావంతో ఆదివారం నుంచి సముద్ర తీరాల్లో వర్షాలు పడ నున్నాయి. ఒకటో తేదీ నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది * జాతీయ ప్రవేశ పరీక్షలు... నీట్‌, జేఈఈ మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌కు సిద్ధమయ్యే విద్యార్థులు తమ ప్రతిభా సామర్థ్యాలను పరీక్షించుకునేందుకు ‘కోటా’ ఆన్‌లైన్‌ ప్రాక్టీస్‌ టెస్ట్‌ సిరీస్‌ సిద్ధం చేసినట్లు ఐఐటీ, జేఈఈ ఫోరమ్‌ కన్వీనర్‌ లలిత్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు www.iitjeeforum.com వెబ్‌సైట్‌లో లాగిన్‌ కావొచ్చన్నారు * వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా భక్తులకు పదిరోజుల పాటు వైకుంఠ ద్వార ప్రవేశాన్ని కల్పించనున్నట్టు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. డిసెంబరు 25నుంచి పది రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంచాలని నిర్ణయించినట్టు వివరించారు.

పటాసులు అమ్మొద్దంటే ఆత్మహత్యలే.. క్రాకర్స్ అసోసియేషన్

13-11-202013-11-2020 08:01:49 IST
2020-11-13T02:31:49.802Z13-11-2020 2020-11-13T02:31:16.724Z - - 30-11-2020

పటాసులు అమ్మొద్దంటే ఆత్మహత్యలే.. క్రాకర్స్ అసోసియేషన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దీపావళి పండుగ సందర్భంగా పటాసులపై నిషేధం విధిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో బాణసంచా తయారీదారులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆరునెలలకు ముందే పటాసుల తయారీకి అనుమతులిచ్చి తీరా కోట్లు ఖర్చుపెట్టి టపాసులు తయారు చేస్తే చివరిక్షణంలో నిషేధం పెడితే తమ గతేంటి అని రాష్ట్ర క్రాకర్స్ అసోసియేషన్ నేతలు వాపోతున్నారు. హైకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో గురువారం బంజారా హిల్స్‌లో సమావేశమైన క్రాకర్స్ అసోసియేషన్ దీపావళికి పటాసుల అమ్మకాలకు అనుమతులివ్వకపోతే మూకుమ్మడిగా ఆత్మహత్యలే తమకు శరణ్యం అని అసోసియేషన్ సభ్యులు స్పష్టం చేశారు. 

హైకోర్టు తీర్పు మమ్మల్ని కలిచివేసిందని క్రాకర్స్ అసోసియేషన్ పేర్కొంది. ప్రతి దీపావళికి రూ.200 కోట్ల టర్నోవర్ జరుగుతుందని, బ్యాన్‌ చేసేది ఉంటే ఫైర్ అనుమతులు ఎలా ఇచ్చారని క్రాకర్స్‌ అసోసియేషన్ పేర్కొంది. బ్యాన్‌ విషయం ఆరు నెలల కిందే చెప్పి ఉంటే బాగుండేదని, రెండు రోజులు అనుమతి ఇవ్వకపోతే ఆత్మహత్యలే శరణ్యమని క్రాకర్స్‌ అసోసియేషన్ వాపోయింది. తెలంగాణ ప్రభుత్వం తమని ఆదుకోవాలని క్రాకర్స్‌ అసోసియేషన్ కోరింది. 

తెలంగాణలో బాణాసంచాను నిషేధించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. దీపావళికి క్రాకర్స్ పేల్చకుండా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో న్యాయవాది ఇంద్ర ప్రకాశ్ పిల్ దాఖలు చేశారు. కరోనా సమయంలో బాణాసంచా వల్ల ఇబ్బందులు తప్పవని పిటిషనర్‌ పేర్కొన్నారు. వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం.. ఇప్పటి వరకు తెరిచిన బాణాసంచా షాపులను మూసివేయాలని ఆదేశించింది. ఇప్పటికే రాజస్థాన్ హైకోర్టు బ్యాన్ చేసిందని, ఎవరూ బాణాసంచా అమ్మడం, కొనడం చేయొద్దని తన ఆదేశాల్లో పేర్కొంది. 

పండుగల కన్నా ప్రజల ప్రాణాలే తమకు ముఖ్యమని హైకోర్టు స్పష్టం చేసింది. బాణసంచా కాల్చకుండా, విక్రయించకుండా నిషేధం విధించాలని, రాష్ట్రవ్యాప్తంగా బాణసంచా విక్రయ దుకాణాలను వెంటనే మూసేయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా నేపథ్యంలో ప్రజల ప్రాణాలను కాపా డాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తేల్చి చెప్పింది. బాణసంచా కాల్చరాదంటూ ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని, తమ ఆదేశాల అమలుపై తీసుకున్న చర్యలను 19న వివరించాలని ఆదేశించింది.

బాణాసంచా విక్రయాల నిషేధంపై కార్మికుల ఆవేదన

బాణాసంచా హబ్‌గా పేరొందిన శివకాశిలో ఇప్పుడు దీపావళి జోష్‌ కనబడటం లేదు. కరోనా వైరస్‌ నేపథ్యంలో పలు రాష్ట్రాలు బాణాసంచా అమ్మకాలను నిషేధించడంతో శివకాశి కళ కోల్పోయింది. తమిళనాడులోని విరుద్‌నగర్‌ జిల్లాలోని చిన్న పట్టణం శివకాశిలో ప్రతి కుటుంబం ప్రత్యక్షంగా, పరోక్షంగా బాణాసంచా తయారీతో ముడిపడిఉంది. శివకాశిలో అడుగుపెట్టిన ప్రతిఒక్కరికీ బాణాసంచా అమ్మకాలకు సంబంధించి ప్రతి భవనంపైనా భారీ బ్యానర్లు కనిపిస్తాయి. పట్టణ ప్రజలకు భారీ డిస్కౌంట్‌పై బాణాసంచాను విక్రయిస్తుంటారు.

ఈ ఏడాది కరోనా వైరస్‌తో బాణాసంచా పరిశ్రమకు తీరని నష్టం వాటిల్లింది. బాణాసంచా ఫ్యాక్టరీల్లో పనిచేసే వారిలో 80 శాతం మంది మహిళలే. బాణాసంచా పరిశ్రమ దెబ్బతింటే విరుద్‌నగర్‌ జిల్లాలో 8 లక్షల మందికిపైగా కార్మికులు ఉపాధి కోల్పోతారు. ఈ ఏడాది కరోనా మహమ్మారితో 40 నుంచి 45 శాతం వరకూ బాణాసంచా ఉత్పత్తి పడిపోయింది. కరోనా వైరస్‌తో రెండు నెలల పాటు శివకాశిలో ఫ్యాక్టరీలను మూసివేశారు. కానీ బాణాసంచా అమ్మకాలపై పలు రాష్ట్రాలు నిషేధం విధించడంతో వీరి వ్యాపారాలు దారుణంగా దెబ్బతిన్నాయి.

ఈ బక్క కేసీఆర్‌ను కొట్టడానికి గింత మందా అబ్బాబ్బాబ్బా

ఈ బక్క కేసీఆర్‌ను కొట్టడానికి గింత మందా అబ్బాబ్బాబ్బా

   7 hours ago


అమిత్ షా చెప్పినట్లుగా అసదుద్దీన్ రాసివ్వగలడా

అమిత్ షా చెప్పినట్లుగా అసదుద్దీన్ రాసివ్వగలడా

   9 hours ago


ఏం జరుగుతోంది.. కేసీఆర్ సభలో హరీష్ మాయం!

ఏం జరుగుతోంది.. కేసీఆర్ సభలో హరీష్ మాయం!

   11 hours ago


కూసాలు కదులుతున్నాయ్.. ఓటుకు నోటుపై విజయసాయి సంచలన వ్యాఖ్యలు!

కూసాలు కదులుతున్నాయ్.. ఓటుకు నోటుపై విజయసాయి సంచలన వ్యాఖ్యలు!

   14 hours ago


డైరెక్ట్ గా భాగ్యలక్ష్మి ఆలయానికే..!

డైరెక్ట్ గా భాగ్యలక్ష్మి ఆలయానికే..!

   14 hours ago


పేర్ని నానిపై హత్యాయత్నం.. ఎందుకు దాడి చేశాడో తెలియదు

పేర్ని నానిపై హత్యాయత్నం.. ఎందుకు దాడి చేశాడో తెలియదు

   15 hours ago


తేనెతుట్టెని కెలికి నెత్తిన పెట్టుకున్న విజయసాయి!

తేనెతుట్టెని కెలికి నెత్తిన పెట్టుకున్న విజయసాయి!

   17 hours ago


మేమూ నచ్చకపోతే నోటాకు వెయ్యండి. ఓటు మాత్రం వేయండి.. కేటీఆర్

మేమూ నచ్చకపోతే నోటాకు వెయ్యండి. ఓటు మాత్రం వేయండి.. కేటీఆర్

   18 hours ago


బీహార్ను గుర్తుకు తెచ్చేలా ఎమ్మెల్యే వ్యవహారం.. అధికారిపై దుర్బాష ఫోన్ కాల్ !

బీహార్ను గుర్తుకు తెచ్చేలా ఎమ్మెల్యే వ్యవహారం.. అధికారిపై దుర్బాష ఫోన్ కాల్ !

   19 hours ago


ఆర్థిక పర్యాటక రంగాల్లో ఏపీ ప్రగతి అద్బుతం.. ఇండియా టుడే సర్వే

ఆర్థిక పర్యాటక రంగాల్లో ఏపీ ప్రగతి అద్బుతం.. ఇండియా టుడే సర్వే

   19 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle