newssting
Radio
BITING NEWS :
బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి దశలో 55.69 శాతం పోలింగ్‌ నమోదైనట్టు తెలిపిన ఎన్నికల కమిషన్‌. కరోనా వైరస్‌ భయాలు ఉన్నప్పటికీ పోలింగ్‌ మాత్రం ఇంతకు ముందుకన్నా ఎక్కువే నమోదైనట్టు తెలుస్తోంది. తొలి దశలో 16 జిల్లాల్లో విస్తరించిన 71 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగగా సంబంధిత నియోజకవర్గాల్లో గతంలోకంటే ఈసారి పోలింగ్ శాతం అధికంగా నమోదు * తమ పార్టీ తరఫున బరిలో నిలిచిన రాంజీ గౌతమ్‌ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న ఏడుగురు ఎమ్మెల్యేలను బీఎస్పీ అధినేత్రి మాయావతి గురువారం పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. కీలకమైన రాజ్యసభ ఎన్నికల సమయంలో ఎస్పీ తీర్థం పుచ్చుకోవడానికి వీరు ప్రయత్నిస్తున్నట్టు తెలియగానే ఆమె ఈ నిర్ణయం తీసుకొన్నారు * కార్మిక నాయకుడు, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ముఖ్య సహచరుడు ఎస్‌.బీ మోహన్‌రెడ్డి(78) గురువారం తెల్లవారుజామున మరణించారు. ఆరునెలల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న మోహన్‌ రెడ్డి ఆరోగ్యం విషమించగా ఆంధ్రమహిళా సభ దవాఖానలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందారు * జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలోని వైకే పొరా ప్రాంతంలో గురువారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులు జరిపి ముగ్గురు స్థానిక బీజేపీ నేతల ప్రాణాలు తీశారు. పాకిస్థాన్‌ ఇంటెలిజన్స్‌ ఏజెన్సీ మద్దతున్న రెసిస్టంట్‌ ఫ్రంట్‌ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి బాధ్యతవహిస్తూ ప్రకటన చేసిందని పోలీసులు చెప్పారు * తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గోకవరం మండలం తంటికొండ వెంకటేశ్వర ఆలయం ఘాట్‌ రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున పెళ్లి బృందానికి చెందిన మినీ వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు * డోసుల కొరత కారణంగా.. స్పుత్నిక్‌-వి టీకా మూడో దశ ట్రయల్స్‌ను రష్యా తాత్కాలికంగా నిలిపివేసింది. నవంబరు 10వ తేదీ నుంచి ట్రయల్స్‌ను పునరుద్ధరించనున్నారు. గమలేయా రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, రష్యన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌-వి టీకాను రష్యా ఆగస్టు నెలలో నమోదు చేసింది * మద్యం ధరలను క్రమబద్ధీకరిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీ చేసింది. సవరించిన ధరలు ప్రీమియం, మీడియం బ్రాండ్లకు వర్తించేలా ఉత్తర్వులిచ్చింది. ఇవి శుక్రవారం నుంచి అమల్లోకి వస్తాయని ఆదేశాల్లో పేర్కొంది * మిలాద్‌ ఉన్‌ నబీ ఉత్సవాలు, ర్యాలీ సందర్భంగా పాతబస్తీలో పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

తెలంగాణలో మరో పరువు హత్య..!

25-09-202025-09-2020 11:15:23 IST
Updated On 25-09-2020 12:43:17 ISTUpdated On 25-09-20202020-09-25T05:45:23.265Z25-09-2020 2020-09-25T05:45:19.597Z - 2020-09-25T07:13:17.943Z - 25-09-2020

తెలంగాణలో మరో పరువు హత్య..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కాలం మారినా కొందరిలో ఇంకా మార్పు రావడం లేదు..! కులం-మతం అంటూ ప్రేమ వివాహం చేసుకున్న పాపానికి ప్రాణాలను తీస్తున్నారు. ఇప్పటికే ప్రణయ్ హత్య దేశ వ్యాప్తంగా సంచలనమైంది. తాజాగా మరో పరువు హత్య తెలంగాణలో చోటుచేసుకుంది. చందానగర్‌కు చెందిన హేమంత్ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేని అమ్మాయి తండ్రి హత్య చేయించినట్లు తెలుస్తోంది. 

హేమంత్ చందానగర్‌లో నివాసం ఉండే వాడు. తమ ప్రాంతానికి చెందిన అవంతి అనే అమ్మాయితో కొద్దికాలం ప్రేమలో ఉన్నాడు. ఆ తర్వాత అతడు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం అమ్మాయి తరపున వారికి అసలు ఇష్టం లేదు. అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత గచ్చిబౌలిలోని టీఎన్‌జీవో కాలనీలో కాపురం పెట్టారు. కానీ వారి పెళ్లిని అమ్మాయి తండ్రి అసలు జీర్ణించుకోలేకపోయాడు.. ఇలాంటి సమయంలో ఓ కఠిన నిర్ణయాన్ని తీసుకున్నాడు. కిరాయి మనుషులతో హేమంత్‌ను నిన్న మధ్యాహ్నం కిడ్నాప్ చేయించి, సంగారెడ్డిలో హత్య చేయించాడు. యువతి తండ్రి ఇచ్చిన సమాచారంతోనే సంగారెడ్డి జిల్లా కిష్టాయగూడెం శివారులోని చెట్ల పొదల్లో హేమంత్‌ మృతదేహాన్ని కనుగొన్నారు.

నిన్న సాయంత్రం హేమంత్‌తో పాటు అతడి భార్యను గుర్తు తెలియని వ్యక్తులు కారులో తీసుకెళ్లారు. ఈ క్రమంలో హేమంత్ భార్య కారులోంచి దూకేసి తప్పించుకుంది. అనంతరం హేమంత్‌ను మాత్రమే వారు తీసుకెళ్లి హత్య చేశారు. ఈ రోజు ఉదయం సంగారెడ్డిలో హేమంత్‌ విగతజీవిగా కనపడ్డాడు.  పెళ్లి జరిగినప్పటి నుంచి హేమంత్‌పై యువతి తండ్రి ఆగ్రహంతో ఊగిపోతున్నాడని హేమంత్ కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే హేమంత్‌ను ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పారు. హేమంత్ అపహరణపై గత రాత్రి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో అతడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. తమ కుమారుడిని యువతి తండ్రే హత్య చేయించాడని కుటుంబ సభ్యులు అంటున్నారు.

గురువారం మధ్యాహ్నం వారిద్దరినీ కిడ్నాప్‌ చేయగా.. ఆ యువతి మాత్రం కారులో నుంచి తప్పించుకుని 100కి సమాచారం ఇచ్చింది. తన ఫిర్యాదుపై గచ్చిబౌలి పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే ఈ హత్య జరిగేది కాదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. హేమంత్‌ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ హత్యకు సంబంధించి యువతి తల్లిదండ్రులతో పాటు తొమ్మిదిమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 


Shivakrishna D


Senior Video Editor, Shivakrishna Devasani has been working with major media houses for the last decade and half. He has been chosen as a special editor for senior journalist Satish Babu's signature program- 'Journalist Diary'. He specialises with feature programmes on current affairs and politics. Over the years, he has trained many budding video editors with many of them working now in electronic media.
 skd@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle