newssting
Radio
BITING NEWS :
ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రోత్సవాలు. నాల్గవరోజు అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తోన్న దుర్గమ్మ. * పెచ్చులూడుతోన్న బెజవాడ కనకదుర్గా ఫ్లై ఓవర్. సోమవారం రాత్రి ఏపీఎస్పీ బెటాలియన్ కానిస్టేబుల్ రాంబాబుపై పడిన ఫ్లై ఓవర్ పెచ్చులు. తీవ్రగాయాలు కావడంతో రాంబాబును ఆస్పత్రికి తరలించిన సిబ్బంది. భారీ వర్షాల కారణంగానే ఇలా జరిగి ఉంటుందంటున్న అధికారులు. * తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,486 కేసులు, ఏడుగురు మృతి. యాక్టివ్ గా ఉన్న 20,686 కేసులు. * తెలంగాణ ప్రయాణికులకు సర్కార్ శుభవార్త. దసరా సందర్భంగా ఈ నెల 24 వరకూ రాష్ట్రంలో వివిధ జిల్లాలకు 3000 స్పెషల్ బస్సులు. ఎంజీబీఎస్, జేబీఎస్, కూకట్‌పల్లి, ఎస్సార్ నగర్, అమీర్‌పేట, ఈసీఐఎల్, ఉప్పల్ క్రాస్ రోడ్డు, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల నుంచి నడవనున్న స్పెషల్ బస్సులు. * మహబూబాబాద్ వీడియో జర్నలిస్ట్ కొడుకు కిడ్నాప్. రూ.45 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న కిడ్నాపర్లు. పోలీసులకు ఫిర్యాదు చేసిన జర్నలిస్ట్. * ఏపీకి భారీ వర్షసూచన. నేడు కృష్ణా, గుంటూరు, తూ.గో., ప.గో జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం.

ఇంటింటికీ నీళ్లిచ్చిన టీఆరెస్‌కే ఓటడిగే హక్కు.. మంత్రి హరీశ్ రావు

13-10-202013-10-2020 08:17:09 IST
2020-10-13T02:47:09.768Z13-10-2020 2020-10-13T02:46:42.845Z - - 21-10-2020

ఇంటింటికీ నీళ్లిచ్చిన టీఆరెస్‌కే ఓటడిగే హక్కు.. మంత్రి హరీశ్ రావు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దుబ్బాక నియోజకవర్గానికి, ప్రజలకు ఏం ఒరగబెట్టారని కాంగ్రెస్ తదితర ప్రతిపక్షాలు ఉపఎన్నికలో ఓట్లు అడుగుతారని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్‌లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ... కాళేశ్వరం నీళ్లు, 24 గంటల కరెంట్‌, ఇంటింటిక నీళ్లు ఇస్తామంటే వాటిని కూడా కాంగ్రెస్‌ నేతలు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. 2018 హుజుర్‌నగర్‌ ఎన్నికల్లో, ఇవాళ నిజామాబాద్‌ ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్‌ గెలిచిందని, రేపు దుబ్బాకలో కూడా టీఆర్‌ఎస్‌ మాత్రమే గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీని ఆ పార్టీ నేతలే వీడి ఇతర పార్టీలో చేరుతున్నారని ఎద్దేవ చేశారు.

ఫార్మాసిటీ వస్తే వందల మందికి ఉద్యోగాలు వస్తాయని యువత చూస్తుంటే దానిని అడ్డుకుంటామని కాంగ్రెస్‌ నేత భట్టి విక్రమార్క అంటున్నారని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు పేర్కొన్నారు. మనిక్కం ఠాగూర్‌, నాగేశ్వర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారని, ఇప్పుడు దుబ్బాకలో మీటింగ్‌ పెట్టి ప్రజలకు ఏం చేప్తారని విమర్శించారు. ఇంటింటికి దుబ్బాకలో నీళ్లు ఇచ్చింది తమ పార్టీయే అని, ఓటు అడిగే హక్కు కూడా టీఆర్‌ఎస్‌కే ఉందని ఆయన అన్నారు. 

దుబ్బాకలోనే కాదు. తెలంగాణ వ్యాప్తంగా 24 గంటల కరెంటు ఇస్తున్నది టీఆర్‌ఎస్‌ మాత్రమేనని... కరెంటు ఇవ్వని కాంగ్రెస్‌ వైపా..  బావుల దగ్గర కరెంటు మీటర్లు పెడతా అంటున్న బీజేపీ వైపు ఉందామా అని హరీశ్ రావు ప్రశ్నించారు. 20 వేల మంది బీడీ కార్మికులకు పెన్షన్‌ ఇస్తుంది ఎవరో.. ఎకరానికి 10 వేలు ఇచ్చింది ఎవరో ఆలోచింది దుబ్బాక ప్రజలు ఎటువైపు ఉంటారో తేల్చుకోవాలని మంత్రి వ్యాఖ్యానించారు.

దుబ్బాక ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాష్ట్ర కాంగ్రెస్ కీలక నాయకులంతా దుబ్బాక నియోజకవర్గంలోనే తిష్ట వేశారు. బీజేపీ నుంచి కూడా మాజీ మంత్రి పెద్దిరెడ్డి జిల్లాలో ప్రచారం చేస్తుండగా కేంద్ర, రాష్ట్ర నాయకులు రఘునందన్‌కు మద్దతుగా ప్రచారం చేసేందుకు దుబ్బాక దారి పడుతున్నారు. ఈ నేపథ్యంలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి మంత్రి హరీశ్‌రావు మాత్రం తనదైన శైలిలో వ్యూహ రచన చేస్తున్నారు. స్థానిక ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఉమ్మడి మెదక్‌ జిల్లా నాయకులను కలుపుకొని ప్రచారం పరుగులు పెట్టిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి టికెట్‌ ఆశించిన మనోహర్‌రావు, వెంకటనర్సింహారెడ్డి, చిందం రాజుకుమార్‌లను టీఆర్‌ఎస్‌లో చేర్పించుకుని కాంగ్రెస్‌ క్యాడర్‌ను దెబ్బతీస్తున్నారు. 

మరోవైపు యువజన సంఘాలతో సమావేశాలు, సమీక్షలు, బైక్‌ ర్యాలీలు నిర్వహించి టీఆర్‌ఎస్‌ వైపు ఆకర్షింపచేస్తున్నారు. అదే విధంగా తాగునీటి ఇబ్బందులు పడ్డ దుబ్బాక ప్రాంతానికి మిషన్‌ భగీరథ ద్వారా తాగునీరు ఇవ్వడం, బీడీ కార్మికుల పెన్షన్‌లు, చేనేత కార్మికులకు చేయూత, రైతుబంధు, రైతుబీమా, ఆసరా పెన్షన్‌లు, కల్యాణలక్ష్మీ ఇచ్చిన పథకాల గురించి పూసగుచ్చినట్లు ప్రజలకు చెబుతున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ప్రజల ఇబ్బందులు, బీజేపీ అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను చెబుతూ కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చురకలు అంటిస్తున్నారు. 

ఇలా టీఆర్‌ఎస్‌కు ఓటేయాలని, మరో వైపు కాంగ్రెస్, బీజేపీ లను చిత్తుగా ఓడించాలని హరీశ్ రావు దూకుడుగా ప్రచారం చేయడం గమనార్హం.

 

జీతం చాల‌ట్లేద‌ని ప్ర‌ధాని ప‌ద‌వికి రాజీనామా...?

జీతం చాల‌ట్లేద‌ని ప్ర‌ధాని ప‌ద‌వికి రాజీనామా...?

   32 minutes ago


ఇంటికి పదివేలు తాత్కాలికమే.. ఎంత సాయానికైనా సిద్ధం.. కేటీఆర్

ఇంటికి పదివేలు తాత్కాలికమే.. ఎంత సాయానికైనా సిద్ధం.. కేటీఆర్

   an hour ago


ఏపీలో స్కూల్స్ ఓపెన్.. ఏర్పాట్ల‌లో స‌ర్కార్

ఏపీలో స్కూల్స్ ఓపెన్.. ఏర్పాట్ల‌లో స‌ర్కార్

   12 hours ago


గతపాలకులదే పాపమంటే ప్రజలు ఊరుకుంటారా!

గతపాలకులదే పాపమంటే ప్రజలు ఊరుకుంటారా!

   13 hours ago


కమ్మేస్తోంది.. కుమ్మేస్తోంది.. మళ్లీ వర్షంతో వణుకుతున్న హైదరాబాద్

కమ్మేస్తోంది.. కుమ్మేస్తోంది.. మళ్లీ వర్షంతో వణుకుతున్న హైదరాబాద్

   16 hours ago


విడ‌ద‌ల ర‌జ‌నీకి మంత్రి ప‌ద‌వి ఫిక్సా..?

విడ‌ద‌ల ర‌జ‌నీకి మంత్రి ప‌ద‌వి ఫిక్సా..?

   16 hours ago


అన్ని పరీక్షలు వాయిదా..!

అన్ని పరీక్షలు వాయిదా..!

   17 hours ago


తెలంగాణా సీఎం రిలీఫ్ ఫండ్ కి టాలీవుడ్ స్టార్స్ విరాళాలు

తెలంగాణా సీఎం రిలీఫ్ ఫండ్ కి టాలీవుడ్ స్టార్స్ విరాళాలు

   17 hours ago


లక్షాధిపతులను బిక్షాధిపతులను ఏకం చేసిన వరద

లక్షాధిపతులను బిక్షాధిపతులను ఏకం చేసిన వరద

   18 hours ago


కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతుల విషయంలో ఉల్లంఘనలు జరిగాయి: ఎన్జీటీ

కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతుల విషయంలో ఉల్లంఘనలు జరిగాయి: ఎన్జీటీ

   18 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle