newssting
Radio
BITING NEWS :
ఓ ఆసుపత్రిలో మహిళా రోగిపై ఉద్యోగి అత్యాచారం. గురుగ్రామ్ నగరంలో వెలుగుచూసిన దారుణం. ప్రైవేటు ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో 21 ఏళ్ల యువతి క్షయ వ్యాధితో చికిత్స కోసం చేరగా వెంటిలేటరుపై చికిత్స పొందుతూ స్పృహ లేని స్థితిలో ఉన్నపుడు ఆసుపత్రి ఉద్యోగి ఒకరు తనపై అత్యాచారం చేశాడని తన చేత్తో రాసిన నోట్ ద్వారా తండ్రికి తెలిపిన బాధితురాలు * నలుగురు ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభ్యులపై కేసులు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు. ఢిల్లీలో పారిశుద్ధ్య పనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించిన నలుగురు ఆప్ ఎమ్మెల్యేలపై పోలీసులు కేసులు. పారిశుద్ధ్య పనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆప్ నాయకుడు దుర్గేష్ పాథక్ 1500మంది ప్రజలతో పౌరకేంద్రం ముందు నిరసన కార్యక్రమం చేపట్టగా..అనుమతి లేకుండా నిరసన చేపట్టారని కేసులు నమోదు * 317వ రోజుకు చేరుకున్న అమరావతి రైతు నిరసనలు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు, మహిళలు చేపట్టిన నిరసనలు. అమరావతి గ్రామాల్లోని శిబిరాల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు. కరోనా సూచనలు పాటిస్తూ సాగుతున్న అమరావతి ఉద్యమం * ఉత్తర తమిళనాడుకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని, మిగిలినచోట్ల పొడి వాతావరణం కొనసాగుతుందని తెలిపిన వాతావరణ శాఖ. కాగా ఈశాన్య గాలులు ప్రారంభం కావడంతో అనేకచోట్ల, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో కురుస్తున్న మంచు. పగటిపూట మాత్రం కొనసాగుతున్న ఎండ * గ్రేటర్‌ ఎన్నికలకు పడిన మరో ముందడుగు. వార్డుల వారీగా రిటర్నింగ్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులను నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ. గ్రేటర్‌లో 150 వార్డులకు తహసీల్దార్‌, ఎంపీడీఓ తదితర కేడర్‌ అధికారులను రిటర్నింగ్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్లుగా జీహెచ్‌ఎంసీ సూచించిన వారిని నియమిస్తున్నట్లుగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆమోదం * బేగంపేట మెట్రో స్టేషన్‌ పై నుంచి పడి యువకుడు మృతి. ఈ నెల 26న జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. చార్టెడ్‌ అకౌంటెన్సీ కోర్స్‌ చేస్తున్న కర్నూల్‌ జిల్లా మంత్రాలయం రామచంద్రనగర్‌కు చెందిన జీ మంజునాథ్‌ (23) ఈ నెల 14న నగరానికి రాగా ఆత్మహత్య చేసుకున్నట్లుగా సీసీ కెమెరాలలో రికార్డు * గురువారం నుంచి అందుబాటులోకి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ధరణి ఫోర్టల్‌ సేవలు. మేడ్చల్‌ జిల్లా మూడుచింతలపల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభం. ధరణి సేవలు మొదలైతే తాసిల్దార్‌ కార్యాలయాల్లో రోజుకు16 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసే వెసులుబాటు * చెన్నై నగరాన్ని అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు. గత రాత్రి నుంచి మహానగరంలో ఎడతెరపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలు. తిరువాన్మియూర్, మైలాపూర్, రాయపెట్ట, అడయార్‌లలో వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు పలు కాలనీలు నీట మునిగగా వర్షపు నీటిని తొలగించడానికి అధికారులు అన్ని చర్యలు చేపట్టారు * మంచిర్యాల జిల్లాలోని హజీపూర్ మండలం నర్సింగ పూర్ శివారులో పెద్ద పులి సంచారం . ఎల్లంపల్లి ప్రాజెక్టు దిగువన పులి సంచారాన్ని గుర్తించిన గ్రామస్థులు. విషయం తెలిసిన అటవీ శాఖ అధికారులు అక్కడకు చేరుకుని అడుగుల ద్వారా పులి సంచారాన్ని నిర్ధారించారు. దీంతో సమీప అటవీ ప్రాంతాలకు ప్రజలు వెళ్ళొద్దని అధికారులు సూచనలు జారీ.

ఏం చేశారని మీకు ఓటేయాలి.. కాంగ్రెస్, బీజేపీపై హరీష్ రావు ధ్వజం

17-10-202017-10-2020 13:43:36 IST
2020-10-17T08:13:36.234Z17-10-2020 2020-10-17T08:13:32.872Z - - 29-10-2020

ఏం చేశారని మీకు ఓటేయాలి.. కాంగ్రెస్, బీజేపీపై హరీష్ రావు ధ్వజం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నిన్నమొన్నటి వరకు దుబ్బాక నియోజకవర్గం ముఖం కూడా చూడని వారు నేడు ఎలా ఓట్లు వేయాలని అడుగుతున్నారని తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి టి. హరీష్ రావు ఎద్దేవా చేశారు. దుబ్బాక నియోజకవర్గం పరిధిలోని పెద్ద చీకోడు, రామక్కపేట గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాతతో కలసి శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 

ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. దుబ్బాక ఉప ఎన్నికల కోసం కాంగ్రెస్‌ నాయకులు సూట్‌కేసులు సర్దుకొని వచ్చారని, అయితే ఇక్కడ క్యాడర్‌ లేకపోవడంతో దారి చూపించే నాథుడే కరువయ్యారని విమర్శించారు. గతంలో మంత్రిగా పనిచేసిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎప్పుడైనా దుబ్బాకకు వచ్చారా అని ప్రశ్నించారు. 

ఏనాడూ రాని నాయకులు ఇప్పుడు ఓట్ల కోసం వస్తే ప్రజలు ఎలా నమ్ముతారని నిలదీశారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేస్తుండటంతో తాము ప్రజలకు చేరువయ్యామని పేర్కొన్నారు. ఇక్కడ అభివృద్ధిని చూసి ఏం చేయాలో అర్థంకాని కాంగ్రెస్‌ నేతలు మాయ మాటలతో ప్రజలను నమ్మించాలని చూస్తున్నారన్నారు. ఆపదలో, సంపదలో అందుబాటులో ఉండే నాయకుడికి ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 

రాష్ట్రం ఏర్పాటు తర్వాత రైతుల ఆత్మహత్యలు తగ్గాయని ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. రైతుల్లో ఆర్థికంగా బలోపేతం అవుతామనే ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు. 

తెలంగాణకు కేంద్రం నిధులా.. ఎక్కడ, ఎప్పుడు?

రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందని చెబుతున్న బీజేపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆసరా పెన్షన్లలో వారు ఇచ్చే వాటా ఎంత అని ప్రశ్నించారు. ఒక వేళ ఈ పథకాలకు కేంద్రమే నిధులు ఇస్తే.. బీజేపీ పాలిత 17 రాష్ట్రాలలో ఇక్కడి పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. 

గ్లోబల్‌ ప్రచారంలో బీజేపీకి నోబెల్‌ బహుమతి ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు. ఎవరు ఎన్ని చెప్పినా దుబ్బాక ఉప ఎన్నికల్లో లక్ష మెజార్టీతో టీఆర్‌ఎస్‌ గెలుస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రచార సభలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు. 

దుబ్బాక టౌన్‌ దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రధానమైన నామినేషన్ల ఘట్టం శుక్రవారంతో ముగిసింది. 9వ తేదీ నుంచి నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమైన విషయం విదితమే. మొత్తం 46 మంది అభ్యర్థులు 103 సెట్ల నామినేషన్‌ పత్రాలు దాఖలు చేశారు. చివరి రోజైన శుక్రవారం 34 మంది అభ్యర్థులు 48 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle