newssting
Radio
BITING NEWS :
* ఏపీ లో వివాదంగా మారిన గీతం వర్సిటీ కట్టడాల కూల్చివేత, అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జీవీఎంసీ, గీతం వర్సిటీ యాజమాన్యం మధ్య ల్యాండ్ వార్ * హైదరాబాద్: నేపాల్ గ్యాంగ్ ను అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు, నాచారం లో జరిగిన చోరీ కేసులో నేపాల్ ముఠా అరెస్ట్ * జూరాల ప్రాజెక్ట్ వరద ఉదృతి, 6 గేట్లు ఎత్తివేత ఇన్ ఫ్లో 92,800 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 94,721 క్యూసెక్కులు * ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు సిపిఐ నేత రామకృష్ణ లేఖ అమరావతి రైతులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపడం తగదు

దుబ్బాకలో కారు కంగారు.. రంగంలోకి ట్రబుల్ షూటర్ హరీష్!

30-09-202030-09-2020 12:18:00 IST
Updated On 30-09-2020 12:43:57 ISTUpdated On 30-09-20202020-09-30T06:48:00.018Z30-09-2020 2020-09-30T06:47:57.156Z - 2020-09-30T07:13:57.642Z - 30-09-2020

దుబ్బాకలో కారు కంగారు.. రంగంలోకి ట్రబుల్ షూటర్ హరీష్!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక ఉప ఎన్నికకు షెడ్యూల్ ను కేంద్ర ఎన్నిక‌ల సంఘం విడుద‌ల చేసింది. దుబ్బాక ఉప ఎన్నికకు అక్టోబ‌ర్ 9న నోటిఫికేష‌న్ విడుద‌ల కానుంది. నామినేష‌న్ల దాఖలుకు చివ‌రితేదీ అక్టోబ‌ర్ 16. నామినేష‌న్ల‌ను 17న ప‌రిశీలించనున్నారు. నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు చివ‌రి తేదీ అక్టోబ‌ర్ 19. న‌వంబ‌ర్ 3న దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గానికి పోలింగ్ నిర్వ‌హించ‌నున్నారు. 10న కౌంటింగ్ జ‌ర‌గ‌నుంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామ‌లింగారెడ్డి అకాల మ‌ర‌ణంతో దుబ్బాక ఉప ఎన్నిక అనివార్య‌మైంది. ఎన్నికల బరిలోకి దిగేందుకు ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ సిద్ధమయ్యాయి.

సోలిపేట రామలింగారెడ్డి ఆకస్మిక మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇదే స్థానం నుంచి రామలింగారెడ్డి భార్యను బరిలోకి దించాలని టిఆర్ఎస్ భావిస్తుండగా, ఆమె కుమారుడు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ నుంచి రఘునందన్ రావు అభ్యర్థిత్వం ఖరారు చేసింది. కాంగ్రెస్ లో అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. 

బీజేపీ అభ్యర్థి ఆ ప్రాంతంలో దూసుకుపోతూ ఉండడంతో కారులో కలకలం మొదలైంది. రఘునందన్ రావు దుబ్బాక రాజకీయాల్లో ఎప్పటి నుండో ఉన్నారు. అన్నీ ఉన్నా అదృష్టం లేదు అన్నట్లు రఘునందన్ రావుకు విజయం దూరమవుతూ వస్తోంది. రఘునందన్ రావుకు ప్రజల్లో మంచి పేరు ఉన్నప్పటికీ ఓట్ల రూపంలో మలచుకోలేకపోతూ ఉన్నారు. ఈ ఉప ఎన్నికల్లో రఘునందన్ రావుపై ప్రజల్లో ఉన్న సెంటిమెంటు బీజేపీకి కలసి వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉండడంతో టీఆర్ఎస్ పార్టీలో అప్పుడే టెన్షన్ మొదలైంది. 

టీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశిస్తున్న మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాస్ రెడ్డి వ్యవహారం కూడా పార్టీని కలవరపరుస్తోందనే కథనాలు ప్రముఖ మీడియా సంస్థల్లో వచ్చాయి. టిక్కెట్ ఇవ్వని పక్షంలో పార్టీ అభ్యర్థికి సహకరిస్తారా లేదా అనే అనుమానాలు టిఆర్ఎస్ నేతల్లో ఉన్నాయట.

దీంతో అక్కడి పరిస్థితిని చక్కబెట్టడం కోసం ట్రబుల్ షూటర్ గా ఉన్న హరీష్ రావు ను టీఆర్ఎస్ రంగంలోకి దించింది. సిద్దిపేట జిల్లాలో బలమైన నాయకుడైన హరీష్ రావు దుబ్బాకలో తనదైన మార్కు రాజకీయాన్ని మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతమున్న పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవాలని హరీష్ రావు ఆశిస్తూ ఉన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెలవకపోతే, బిజెపికి ఎక్కడ లేని మైలేజీ రావడం పక్కా అని భావిస్తూ ఉన్నారు. హరీష్ రావు ఎలాగైనా టీఆర్ఎస్ అభ్యర్థిని గెలింపించే తలంపుతో దుబ్బాకలో ప్రయత్నాలు మొదలుపెట్టారు. 

మంట‌లు రేపుతున్న మహారాష్ట్ర సీఎం

మంట‌లు రేపుతున్న మహారాష్ట్ర సీఎం

   2 hours ago


ఏపీ పట్ల ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్న తెలంగాణ

ఏపీ పట్ల ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్న తెలంగాణ

   3 hours ago


పోలవరం పూర్తి ఖర్చు భరిస్తామన్నారు. మాట తప్పితే ఎలా? కేంద్రం పై జగన్ ఫైర్

పోలవరం పూర్తి ఖర్చు భరిస్తామన్నారు. మాట తప్పితే ఎలా? కేంద్రం పై జగన్ ఫైర్

   3 hours ago


టీఆర్‌ఎస్‌ను ఒక్కసారి ఓడించండి.. కేసీఆర్‌కు హామీలన్నీ గుర్తొస్తాయి... ఉత్తమ్

టీఆర్‌ఎస్‌ను ఒక్కసారి ఓడించండి.. కేసీఆర్‌కు హామీలన్నీ గుర్తొస్తాయి... ఉత్తమ్

   18 hours ago


వెలవెలబోతున్న కోవిడ్ ఆసుపత్రులు.. 80 శాతం పడకలు ఖాళీ

వెలవెలబోతున్న కోవిడ్ ఆసుపత్రులు.. 80 శాతం పడకలు ఖాళీ

   18 hours ago


దుబ్బాక‌లోనే అస‌లు ద‌స‌రా

దుబ్బాక‌లోనే అస‌లు ద‌స‌రా

   a day ago


నిమ్మ‌గ‌డ్డ‌పై మీడియా జ‌బ‌ర్ద‌స్తీ

నిమ్మ‌గ‌డ్డ‌పై మీడియా జ‌బ‌ర్ద‌స్తీ

   a day ago


సికింద్రాబాద్ లో పేలుడు.. కొద్దిసేపు టెన్షన్

సికింద్రాబాద్ లో పేలుడు.. కొద్దిసేపు టెన్షన్

   a day ago


సీఎం జగన్‌ సామాజిక న్యాయ సంరక్షకుడు.. పీఎంకే అధినేత రామదాస్ ప్రశంస

సీఎం జగన్‌ సామాజిక న్యాయ సంరక్షకుడు.. పీఎంకే అధినేత రామదాస్ ప్రశంస

   25-10-2020


ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులు తెలంగాణ సరిహద్దుల వరకే.. పేర్ని నాని

ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులు తెలంగాణ సరిహద్దుల వరకే.. పేర్ని నాని

   25-10-2020


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle