గంగుల, షర్మిల మధ్య పాత వైరం ఏమైనా ఉందా
17-02-202117-02-2021 14:49:46 IST
Updated On 17-02-2021 10:25:11 ISTUpdated On 17-02-20212021-02-17T09:19:46.938Z17-02-2021 2021-02-17T04:41:40.570Z - 2021-02-17T04:55:11.563Z - 17-02-2021

ఏమో పొలిటికల్ గా ఎప్పుడు ఏం జరుగుతాయో ఎవరికి తెలుసు చెప్పండి. పాత వైరం ఉన్నా.. ఫ్రెండ్స్ అవుతారు. ఫ్రెండ్స్ గా ఉన్నా.. పాత వైరాలు గుర్తొస్తాయి. గొడవలు అయ్యి విడిపోతారు. ఇలాంటివి రాజకీయంలో చాలా చాలా కామన్. బయటి లైఫ్ లో కూడా కామనే.. కానీ.. రాజకీయంలో మాత్రం.. చాలా కనిపిస్తుంటయ్. అయితే.. ఇప్పుడు గంగుల వ్యాఖ్యలు రెగ్యులర్ గా ట్రెండింగ్ లోకి వస్తున్నయ్. షర్మిల పార్టీ అంటున్న టైంలో.. ఎవరూ మాట్లాడలేదు. పొలిటికల్ లీడర్లు పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు. చూద్దాం లే అన్నట్లు ఉండిపోయారు. ఒక్క సారి లోటస్ పాండ్ సమావేశాల తర్వాత అందరూ క్లారిటీకి వచ్చారు. మెల్లి మెల్లిగా మాట్లాడ్డం.. రెస్పాండ్ అవడం.. యాంటీగా కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు. వారిలో.. టీఆర్ఎస్ లీడర్ గంగుల కమలాకర్ ముందే ఉన్నారు. షర్మిల మీటింగ్ టైంలో.. గంగుల రెస్పాండ్ అయ్యారు. వలస పార్టీలకి తెలంగాణలో చోటు లేదు.. వచ్చిన పార్టీలు మళ్లీ దారి పట్టాల్సిందే అంటూ కామెంట్స్ చేశారు. తర్వాత వేరే లీడర్లు కూడా షర్మిల పార్టీ నిలవలేదు అన్నట్లు కామెంట్స్ చేశారు. ఇవన్నీ రెగ్యులరే. పెద్దగా మాట్లాడుకోవాల్సిందేం లేదు. కానీ.. గంగుల కమలాకర్ మాత్రం అలా కాదు. మాటి మాటికీ షర్మిల పార్టీపై కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. ఇన్ని సార్లు.. షర్మిల పార్టీపై రెస్పాండ్ అవడం.. అది కూడా యాంటీగా రెస్పాండ్ అవడం అనే లెక్కల్లోకి వెళ్తే.. గంగుల కమలాకర్ పేరే ఎక్కువ సార్లు వినిపిస్తుంది. అందులో ఎలాంటి డౌట్లూ లేవు. ఇప్పుడు మరోసారి చేసిన కామెంట్స్ కూడా ట్రెండింగ్ లోకి వచ్చాయి. షర్మిల తర్వాత జగన్ వస్తారు.. తర్వాత ఇంకో లీడర్ వస్తారు అంటూ.. ఏవేవో అనేశారు. చూస్తుంటే.. గంగుల కమలాకర్ కి.. వైఎస్ షర్మిలాకి పాత కక్షలు ఏమైనా ఉన్నా.. వ్యాపారాలు.. రాజకీయ వ్యవహారాల్లో గొడవలు ఏమైనా ఉన్నాయా.. లేదంటే జగన్ పై ఉన్న కోపాన్ని షర్మిలపై చూపిస్తున్నారా అనే డిస్కషన్ స్టార్ట్ అయింది. అసలు.. షర్మిలతో పార్టీ పెట్టిస్తున్నదే సీఎం కేసీఆర్ అనే టాక్ కూడా ఉంది కదా. అలాంటి మాటలకి చెక్ పెట్టడానికి.. గంగుల లాంటి వారు.. యాంటీగా మాట్లాడుతూ కవర్ చేస్తున్నారా అనే యాంగిల్స్ లో.. ఎన్నో అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్ లో తిరుగుతున్నయ్.

మున్సిపల్ పోరుపై బాబు ఫోకస్
5 minutes ago

రాజకీయాలనుంచి తప్పుకుంటున్నా.. చిన్నమ్మ
an hour ago

నేను వైసీపీలో చేరను-గంటా క్లారిటీ
an hour ago

విశాఖ ఉక్కు అయిపోయింది.. విశాఖ పోర్టు వంతు వచ్చింది
3 hours ago

ఆహా.. ఇది అద్భుతమైన ఓపెనింగ్ ఎంపీ సార్
2 hours ago

విశాఖ వైసీపీలో విభేదాలు మరోసారి కనపడ్డాయిగా..!
15 hours ago

క్రమ శిక్షణ చర్యలు తప్పవంటూ అచ్చెన్నాయుడు వార్నింగ్
17 hours ago

గంటా ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విజయసాయి
21 hours ago

అధిష్టానంతో అటో ఇటో తేల్చుకుంటాం.. కాంగ్రెస్ అసమ్మతి నేతలు సిద్ధం
a day ago

జగన్ కి పాలన రాదు అనే మాటకి నిదర్శనాలు ఇవేనా
19 hours ago
ఇంకా