పదవులు లేకపోయినా గులాబీ గూటిలోనే.. అంత ఓపికుందా..! ఎవరానేత..
11-01-202111-01-2021 19:38:30 IST
2021-01-11T14:08:30.951Z11-01-2021 2021-01-11T08:11:12.184Z - - 20-01-2021

రాజకీయాల్లో పదవి ఉంటేనే మనగలం.. పదవి ఉంటేనే ప్రజాసేవ చేయగలం.. ఈ పార్టీలో పదవి లేకుంటే పక్కపార్టీలో చేరి పదవి తెచ్చుకుంటాం.. మేం ఏదిచేసినా ప్రజల కష్టాలు తీర్చటానికే.. ఇప్పుడున్న రాజకీయ నేతల వ్యవహార శైలి ఇది. రాత్రికి రాత్రే కండువాలు కప్పుకొనే నేతలు నేటి రాజకీయాల్లో ఎక్కువయ్యారు. ఇదే సమయంలో పార్టీ నియమనిబంధనలు పాటిస్తూ.. పదవిలేకపోయినా పార్టీ క్యాడర్‌ను, తనను నమ్ముకున్న వ్యక్తులను కాపాడుకొనే నేతలు ఉన్నారు. వారిలో ఒకరు ఖమ్మం జిల్లా రాజకీయాల్లో కొద్దికాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తెరాస నేత పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. ప్రజల్లోకి వెళ్లి గెలిచే దమ్మున్నా.. పార్టీ టికెట్ ఇవ్వకపోయినా.. నామినేటెడ్ పదవులు ఇవ్వకపోయినా.. నిత్యం ప్రజల్లో ఉంటూ పార్టీని నమ్ముకున్న, తనను నమ్ముకున్న వారికి అండగా నిలుస్తున్నారు పొంగులేటి.
వైసీపీ నుంచి రాజకీయ అరంగ్రేటం చేసిన కొద్దిరోజుల్లోనే 2014లో ఎంపీగా గెలిచి ప్రజాదరణ పొందిన పొంగులేటి.. తెరాసలో చేరి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్నుసైతం దక్కించుకోలేక పోయారు. గెలిచేసత్తా ఉన్నా, ప్రజల ఆదరణ ఉన్నా రాజకీయ సమీకరణలతో పొంగులేటికి టికెట్ ఇచ్చేందుకు తెరాస అధిష్టానం మొగ్గుచూపలేదు. అయినా పార్టీని వీడకుండా ప్రజల్లో ఉంటూ ప్రజానేతగా ముందుకెళ్తున్నారు. తన వర్గీయులంతా బీజేపీలో చేరుదామని ఒత్తిడి తెచ్చినా వారిని సముదాయిస్తూ ముందకెళ్తున్నారు. ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెరాస గూటిలోనే ఉంటానని.. తాను ఏపార్టీ వైపు వెళ్లనని పొంగులేటి స్పష్టం చేశారు. పొంగులేటి నిబద్దత చూసిన జిల్లా ప్రజలు రాజకీయాల్లో ఇలాంటివారు కూడా ఉంటారా అంటూ ఆశ్చర్యపోతుండటం గమనార్హం.
పొంగులేటికి ఇప్పటికే బీజేపీలోకి రావాలని ఒత్తిడులు వచ్చాయి. ఇటీవల ఆయన కాషాయం కండువాకప్పుకుంటున్నారని ప్రచారం సాగింది. అయితే ఒకానొకదశలో ఆయన అనుచరుల ఒత్తిడిని తట్టుకోలేక కాషాయం కండువా కప్పుకొనేందుకు సిద్ధమైయ్యారనే వార్తలు వచ్చాయి. చివరి నిమిషంలో టీఆర్ ఎస్‌లోనే ఉంటానని పొంగులేటి ఖరాఖండీగా చెప్పేయడంతో ఆయన వర్గీయులుసైతం చిన్నబుచ్చుకున్నారట. అసలు ఎందుకు ఆయన పదవులు ఇవ్వని పార్టీలో ఉంటున్నారు.. తనను అణచివేయాలని చూసే నేతలున్న పార్టీలో కొనసాగుతున్నారని ఆయన వర్గీయులు, ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు.
శ్రీనివాస్‌రెడ్డి బడా కాంట్రాక్టర్. రాష్ట్ర ప్రభుత్వం తరపున వందల కోట్ల కాంట్రాక్టులు ఆయన చేస్తుండటంతోనే పార్టీ మారితే బిల్లులు ఆగిపోతాయనే భయంతోనే చచ్చినట్లు పదవులు లేకపోయినా తెరాసలోనే ఉంటున్నారన్న వాదన జిల్లా వ్యాప్తంగా బలంగా వినిపిస్తుంది. అయితే ఆ వార్తలను శ్రీనివాస్‌రెడ్డి ఖండించారు. అలాంటిదేమీ లేదని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లపై తనకు నమ్మకం ఉందని. రానున్న కాలంలో తనకు తెరాసలోనే మంచిరోజులు వస్తాయంటూ నమ్మకంతో చెబుతున్నారు. ఇదిచూసిన ప్రజలు.. ఇప్పుడున్న రాజకీయాలకు శ్రీనివాస్‌రెడ్డి తగిన వ్యక్తేనా అని చర్చించుకోవటం గమనార్హం. మొత్తానికి శ్రీనివాస్‌రెడ్డి నిబద్దతను కేసీఆర్, కేటీఆర్‌లు గుర్తించకపోతారా..? మా నేతకు మంచిరోజులు రాకపోతాయా అంటూ ఆయన వర్గీయులు వేచిచూస్తున్నారట. రాబోయేకాలంలో పార్టీ టికెట్ ఇవ్వకపోయినా శ్రీనివాస్‌రెడ్డి ఇదే ఓపికతో ఉంటారా..? అందరి రాజకీయ నేతలవలే తాను మారిపోతారా అని వేచిచూడాల్సిందే.

జనవరి 27న శశికళ విడుదల.. పార్టీలోకి రానివ్వమన్న పళనిస్వామి
41 minutes ago

కేటీఆర్ పరిస్థితి.. రాహుల్ గాంధీలా అవుతుందా
3 hours ago

జగన్ సర్కార్ మరో డెసిషన్.. ఎందుకు తీసుకుంటారో ఏమో
an hour ago

సవాళ్లు, ప్రమాణాలు.. ఏందీ రచ్చ.. జనాల్ని ప్రశాంతంగా ఉండనివ్వరా
4 hours ago

నానీ పని అయిపాయే.. ఇక వంశీ వచ్చే
4 hours ago

ఎదురు దెబ్బలు.. మొట్టికాయలు.. ఇక మీరు మారరా.. జనాలు మారాల్సిందేనా?
5 hours ago

షాతో జగన్ భేటీ.. ఈసారి రాష్ట్రానికి ఏం తెస్తారో?!
6 hours ago

ఈ ఎమ్మెల్యేకి కొత్త తలనొప్పులు తెస్తున్న నోటితీట
6 hours ago

మితిమీరిన బూతులు.. కొడాలి నానీ రాజకీయాలకు అవసరమా?
6 hours ago

సంగారెడ్డిలో తోప్ సింగ్ కావాలని ఈ మాజీ ఎమ్మెల్యే ఆరాటం.. గ్రౌండ్ వర్క్ స్టార్ట్
6 hours ago
ఇంకా