newssting
Radio
BITING NEWS :
కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై సస్పెన్స్‌కు తెరపడింది. బీఎస్‌ యడియూరప్ప సోమవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సాయంత్రం గవర్నర్‌ను కలిసి రాజీనామాను సమర్పించనున్నారు. రాజీనామాపై ఆయన స్పందిస్తూ.. ‘‘ రాజకీయ జీవితంలో ఎన్నో అగ్నిపరీక్షలు ఎదుర్కొన్నా. కర్ణాటక అభివృద్ధి కోసం చాలా చేశా. 75 ఏళ్లు దాటినా నాకు రెండేళ్ల పాటు అవకాశం ఇచ్చారు. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తా’’ అని అన్నారు. * ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా సోమవారం 2,128 కోవిడ్‌ టీకా కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ అందిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల కోవిడ్‌ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. * చరిత్రలోనే మొట్టమొదటిసారి మన తెలుగు సంపద అయిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన రామప్ప ఆలయానికి ఐక్యరాజ్య సమితి విద్య, విజ్ఞాన (పరిశోధన), సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా కోసం 2015లోనే ప్రయత్నాలు మొదలయ్యాయి. * టోక్యో ఒలింపిక్స్‌లో జపాన్‌కి చెందిన మోమిజీ నిషియా సంచలనం సృష్టంచింది. ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన రెండో అతి పిన్న వయస్కురాలిగా రికార్డు క్రియాట్‌ చేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన స్కేట్‌బోర్డింగ్ లో నిషియా స్వర్ణ పతకం సాధించింది. * ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ పూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చోర్‌ బజార్‌’’. ‘దళం, జార్జ్‌ రెడ్డి’ చిత్రాల ఫేమ్‌ జీవన్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

ఈటల పై మరోమారు కౌశిక్ రెడ్డి ఫైర్

12-06-202112-06-2021 20:27:14 IST
Updated On 12-06-2021 22:37:27 ISTUpdated On 12-06-20212021-06-12T14:57:14.276Z12-06-2021 2021-06-12T14:57:11.321Z - 2021-06-12T17:07:27.421Z - 12-06-2021

ఈటల పై మరోమారు కౌశిక్ రెడ్డి ఫైర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బిజెపి లో చేరుతున్న టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై కాంగ్రెస్‌ నేత కౌశిక్‌రెడ్డి మరోసారి విరుచుకు పడ్డారు. ఈటెల తన స్వార్థం కోసమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని, ఈటల రాజేందర్‌ హుజూరాబాద్‌ ప్రజల సంక్షేమం కోసం పాటుబడలేదని కాంగ్రెస్‌ నేత కౌశిక్‌రెడ్డి విమర్శించారు. అంతే కాదు 2018 ఎన్నికల్లో కేసీఆర్ తనకి డబ్బులు పంపించారని ఈటల అంటున్నారు. అసలు ఎన్నికలు ముగిసి రెండున్నర సంవత్సరాలు కాగా అప్పటి నుంచి ఈ విషయం ఎందుకు అడగలేదని కౌశిక్ నిలదీశారు. నిలదీశారు. 

ప్రస్తుతం ఈటెల బిజెపి తీర్థం పుచ్చుకుని ఉద్యమకారుని ముసుగులో ప్రజలను మోసం చేయడానికి సిద్ధమయ్యారని తీవ్రంగా ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన టిఆరెస్ పార్టీని కూడా విమర్శించారు. తానూ ఎప్పటికీ కాంగ్రెస్ లో కొనసాగుతానని హుజురాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయబోతుందని ఆయన జోస్యం చెప్పారు. మంత్రి కేటిఆర్ తో మాట్లాడినంత మాత్రాన తాను టిఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రచారం చేయడం భావ్యం కాదని ఆయన అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకే విజయం వరిస్తుందని, గత కొంతకాలంగా రాష్ట్రం లో రాజకీయంగా జరుగుతున్న పరిస్థితుల నేపధ్యంలో ప్రజలు ఈటల, టీఆర్‌ఎస్‌ను ఎప్పుడూ నమ్మొద్దని సూచించారు. దీనితో కౌశిక్ రెడ్డి వచ్చే హుజురాబాద్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరపుననే పోటీ చేయడానికి సిద్దపోయాడని తెలుస్తోంది.. మరి.. టిఆరెస్ తరపున సిఎం కేసీఆర్ ఎవరిని బరిలో నిలుపుతాడా అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.


Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle