newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

ఈటల రాజేందర్ మరో సారి అలాంటి వ్యాఖ్యలే..!

20-04-202120-04-2021 16:28:31 IST
Updated On 20-04-2021 10:02:29 ISTUpdated On 20-04-20212021-04-20T10:58:31.220Z20-04-2021 2021-04-20T04:10:05.690Z - 2021-04-20T04:32:29.078Z - 20-04-2021

ఈటల రాజేందర్ మరో సారి అలాంటి వ్యాఖ్యలే..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కొన్ని నెలల కిందట తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే..! అయితే ఈ మధ్య కాలంలో ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకపోయినా..‌ సోమవారం వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో జరిగిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలపై, నాయకులపై ప్రజలకు రాను రాను నమ్మకం పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు ప్రజలకు అపారమైన విశ్వాసం ఉండేదని, ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మీకు తెలుసునని అన్నారు. 

టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలకు నోట్లో నాలికగా ఉంటుంది. కానీ భారతీయ జనతా పార్టీ ఉంది.. అది సోషల్‌ మీడియాలో మసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. గతంలో రాజకీయాలు, నాయకులు అంటే సమాజంలో ఒక గొప్ప గౌరవం, విలువలు, విశ్వాసం ఉండేవని.. కానీ రానురాను నాయకుల మీద, రాజకీయాల మీద ఎట్లాంటి భావన వస్తుందో మీకు చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. 

ఇది మంచి సంప్రదాయమైతే కాదు. తాత్కాలికమైన విజయాల కోసం, తాత్కాలికమైనటువంటి ప్రయోజనాల కోసం సంప్రదాయాలను, మర్యాదలను, గౌరవాలను ఫణంగా పెట్టే పరిస్థితి రావద్దని కడియం శ్రీహరి గారి లాంటి వాళ్లు ఎక్కువగా కోరుకుంటారు. నాలాంటి వాళ్లు కూడా ఇవ్వాల అదే కోరుకుంటున్నారని ఈటల చెప్పుకొచ్చారు. రాజకీయ నాయకులెప్పుడు కూడా సమాజ శ్రేయస్సు కోసం పని జేసే వాళ్లు తప్ప, ఇబ్బంది పెట్టడం కోసమో, సొంత ప్రయోజనాల కోసమో ఆశించేవాళ్లు కాదని అన్నారు.

కానీ అట్లా చిత్రీకరించేటటువంటి పరిస్థితి వచ్చిందని.. మానవ సంబంధాల్లోనే కాకుండా, రాజకీయ నాయకులు.. ప్రజల మధ్య ఉండే సంబంధాల్లో చోటుచేసుకుంటున్న బాధాకరమైన సన్నివేశాల్ని ఇవ్వాళ మనం చూస్తున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలోని ఆనేక రంగాల్లో ఏ రాష్ట్రం కూడా పోటీపడని విధంగా, అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ ఫలితాలు కనిపిస్తున్నాయని ఈటల తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్‌ నాయకత్వంలోని టీఆర్‌ఎస్‌ చరిత్రకెక్కాయని అన్నారు. 

హన్మకొండ భీమారంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో సోమవారం గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ ఎన్నికల సమీక్షా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్, సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

కొత్త పార్టీ లిస్ట్ లో ఈటెల, రేవంత్.. ఈటెల్లాంటి మాట‌ల అర్దం అదేనా

తెలంగాణ అధికారుల కోసం 32 ఖరీదైన కార్లను కొనుగోలు చేసిన కేసీఆర్

తెలంగాణ అధికారుల కోసం 32 ఖరీదైన కార్లను కొనుగోలు చేసిన కేసీఆర్

   4 hours ago


ఎల్. రమణ మాటలకి అర్ధాలే వేరయా..

ఎల్. రమణ మాటలకి అర్ధాలే వేరయా..

   5 hours ago


సోనూసూద్ సేవలు.. ఎపి రాజకీయాలలో దుమారం..

సోనూసూద్ సేవలు.. ఎపి రాజకీయాలలో దుమారం..

   8 hours ago


బీజేపీ లో ఈటెల చేరిక.. పార్టీలో హుషారు..

బీజేపీ లో ఈటెల చేరిక.. పార్టీలో హుషారు..

   8 hours ago


పల్లెలు, పట్టణాల అభివృద్ధి పై సిఎం కెసిఆర్ దిశానిర్దేశం

పల్లెలు, పట్టణాల అభివృద్ధి పై సిఎం కెసిఆర్ దిశానిర్దేశం

   9 hours ago


థర్డ్ వేవ్ ని ఎదుర్కోవడానికి ఢిల్లీ కొత్త ఏర్పాట్లు

థర్డ్ వేవ్ ని ఎదుర్కోవడానికి ఢిల్లీ కొత్త ఏర్పాట్లు

   9 hours ago


కక్షసాధింపు ఏమాత్రం కాదు..

కక్షసాధింపు ఏమాత్రం కాదు..

   9 hours ago


తెలంగాణ రైతులకు కేసీఆర్ గుడ్ న్యూస్.. రేపట్నుంచి బ్యాంకు ఖాతాల్లోకి ‘రైతుబంధు’ డబ్బు

తెలంగాణ రైతులకు కేసీఆర్ గుడ్ న్యూస్.. రేపట్నుంచి బ్యాంకు ఖాతాల్లోకి ‘రైతుబంధు’ డబ్బు

   9 hours ago


నన్ను పార్టీ నుండి బహిష్కరించారా..? జగన్ కి రఘురామ లేఖ

నన్ను పార్టీ నుండి బహిష్కరించారా..? జగన్ కి రఘురామ లేఖ

   13-06-2021


జగన్ ని పక్కన పెడుతున్న ప్రశాంత్ కిషోర్.. కారణం బీజేపీనేనా?

జగన్ ని పక్కన పెడుతున్న ప్రశాంత్ కిషోర్.. కారణం బీజేపీనేనా?

   13-06-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle