newssting
Radio
BITING NEWS :
భారత ప్రభుత్వం ప్రత్యర్థుల ఫోన్లపై నిఘా పెట్టడానికి ఇజ్రాయెల్‌కు చెందిన పెగసస్‌ స్‌పైవేర్‌ను ఉపయోగిస్తోందంటూ వెలువడ్డ వార్తలపై పాకిస్తాన్‌ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌తోపాటు పలువురు విదేశీ ప్రముఖులు పేర్లు ఈ జాబితాలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని గుర్తుచేసింది. ఈ వ్యవహారంలో ఐక్యరాజ్య సమితి వెంటనే జోక్యం చేసుకోవాలని, సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరింది. * ప్రతిపక్ష నేతల ఫోన్లను హ్యాకింగ్‌ చేస్తున్నారంటూ కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ కొనసాగిస్తున్న ఆరోపణల పరంపరంపై బీజేపీ అధికార ప్రతినిధి రాజ్యవర్దన్‌ రాథోడ్‌ ఘాటుగా స్పందించారు. ఫోన్‌ నిజంగా హ్యాకింగ్‌ అయ్యిందని రాహుల్‌ గాంధీ భావిస్తే దర్యాప్తు కోసం అదే ఫోన్‌ను సమర్పించే దమ్ముందా? అని సవాలు విసిరారు. * కోవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా పని చేసిందని రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పేర్కొన్నారు. యుద్ద ప్రాతిపదికన ఆస్పత్రుల్లో పడకలు, మందులు, ఆక్సిజన్‌ నిల్వలు ఇతర మౌలిక సదుపాయాలను పెంపొందించిందని చెప్పారు. రాష్ట్ర గవర్నర్‌గా రెండేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. * రాష్ట్రంలో వరద ముంపునకు గురైన వారిని ఆదుకోవాలని ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసై టీ (ఐఆర్‌సీఎస్‌) ప్రతి నిధులను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కోరారు. రాజ్‌భవన్‌ అధికారులు కూడా ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని రెడ్‌క్రాస్‌ సొసైటీ ద్వారా బాధితులకు సాయం అందేలా కృషి చేయాలని ఆమె ఆదేశించారు. * కంగ్రాట్స్, నారప్ప చిత్రాన్ని ఇప్పుడే చూశా. నటన పరంగా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్టుంది. సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా వెంకటేష్ కనబడలేదు, నారప్పే కనిపించాడు. మొత్తానికి ఈ చిత్రంలో కొత్త వెంకటేష్ను చూపించావు. పాత్రను ఎంతగానో అర్థం చేసుకొన్నావ్‌, అందుకే అంతగా ఆ రోల్‌లో లీనమై నటించావు. నీలో ఉండే నటుడు ఎప్పుడూ ఒక తపన తో, తాపత్రయం తో ఉంటాడు. అలాంటి వాటికి ఈ చిత్రం మంచి ఉదాహరణ అని మెగాస్టార్‌ తెలిపారు.

బీజేపీ లో ఈటెల చేరిక.. పార్టీలో హుషారు..

14-06-202114-06-2021 09:17:17 IST
Updated On 14-06-2021 12:48:21 ISTUpdated On 14-06-20212021-06-14T03:47:17.615Z14-06-2021 2021-06-14T03:47:08.532Z - 2021-06-14T07:18:21.867Z - 14-06-2021

బీజేపీ లో ఈటెల చేరిక.. పార్టీలో హుషారు..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేసిన బహిష్కృత మంత్రి ఈటల రాజేందర్ సోమవారం ఉదయం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా సమక్షంలో కమలం కండువా కప్పుకోనున్నారు. ఆయనతో పాటు మరికొందరు సీనియర్ నేతలు కూడా బీజేపీలో చేరబోతున్నారని వార్తలు వస్తున్నాయి. సోమవారం ఉదయం డిల్లీ కి పయనమయ్యారు ఈటెల రాజేందర్ తో పాటు మాజీ ఎంఎల్ఏ ఏనుగు రవీంద్రరెడ్డి, మాజీ ఎంపి రమేష్ రాథోడ్, జిల్లా పరిషత్ మాజీ ఛైర్ పర్సన్ తుల ఉమతో పాటు మరికొందరు కూడా బీజేపీలో చేరబోతున్నారట. ఆర్టీసీ యూనియన్ లీడర్ అశ్వత్ధాతమరెడ్డి కూడా బీజేపీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఒకేసారి ఇంత మంది నేతలు బీజేపీలో చేరడంతో రాష్ట్ర బిజేపీ పార్టీలో హుషారు వచ్చిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వీరంతా అధికార టిఆరెస్ పార్టీతో తెగతెంపులు చేసుకుని, సిఎం కేసీఆర్ ని తీవ్రంగా వ్యతిరేకించడం బిజెపికి కలిసివచ్చే అంశమని, హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉపఎన్నిక లో ఈ అంశం బిజెపికి మరింత లాభం చేకూరుస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే హుజూరాబాద్ ఎన్నికలో ఈటెల రాజేందర్ గెలుపు అంత సాధ్యం కాకపోవచ్చని చివరి నిమిషంలో ఈటెల కి ధీటుగా బలమైన టిఆరెస్ అభ్యర్థిని రంగంలోకి దింపి గెలిపించుకోవడం కెసిఆర్ వ్యూహంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా ఈటెల వర్సెస్ కేసీఆర్ మధ్య జరుగుతున్న ఈ వార్ లో అంతిమ విజయం ఎవరిదో అన్న ఆసక్తి మాత్రం తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకులలో కనిపిస్తుంది.

ఏలూరులో 50 డివిజన్లలో 47 డివిజన్లు గెలిచి కార్పొరేషన్‌ సొంతం చేసుకున్న వైసీపీ

ఏలూరులో 50 డివిజన్లలో 47 డివిజన్లు గెలిచి కార్పొరేషన్‌ సొంతం చేసుకున్న వైసీపీ

   3 hours ago


కర్ణాటక తరువాత ముఖ్యమంత్రి ఎవరు..?

కర్ణాటక తరువాత ముఖ్యమంత్రి ఎవరు..?

   10 hours ago


మాజీ టీడీపీ నేతలపై దృష్టి సారించిన రేవంత్ రెడ్డి

మాజీ టీడీపీ నేతలపై దృష్టి సారించిన రేవంత్ రెడ్డి

   10 hours ago


ఏపీ లో మళ్ళీ పదవుల పండుగ

ఏపీ లో మళ్ళీ పదవుల పండుగ

   10 hours ago


టీఆర్‌ఎస్‌ ఎంపీ మాలోత్ కవితకు ఆరు నెలల జైలు శిక్ష

టీఆర్‌ఎస్‌ ఎంపీ మాలోత్ కవితకు ఆరు నెలల జైలు శిక్ష

   a day ago


వైఎస్ వివేకానంద హత్య కేసులో మరో ట్విస్ట్.. అరెస్ట్ చేయొద్దంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్

వైఎస్ వివేకానంద హత్య కేసులో మరో ట్విస్ట్.. అరెస్ట్ చేయొద్దంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్

   24-07-2021


మంత్రి కేటిఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

మంత్రి కేటిఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

   24-07-2021


కోట్లాది మంది దళిత బిడ్డలకు అండగా నేనుంటా..

కోట్లాది మంది దళిత బిడ్డలకు అండగా నేనుంటా..

   24-07-2021


ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ గా ఈటల ప్రధాన అనుచరుడు

ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ గా ఈటల ప్రధాన అనుచరుడు

   24-07-2021


AP Inter Second Year Results 2021: ఏపీ ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ

AP Inter Second Year Results 2021: ఏపీ ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ

   23-07-2021


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle