కొత్త పార్టీ లిస్ట్ లో ఈటెల, రేవంత్.. ఈటెల్లాంటి మాటల అర్దం అదేనా
04-04-202104-04-2021 11:47:19 IST
Updated On 05-04-2021 10:11:14 ISTUpdated On 05-04-20212021-04-04T06:17:19.812Z04-04-2021 2021-04-04T06:14:06.696Z - 2021-04-05T04:41:14.734Z - 05-04-2021

మొన్నా మధ్య ఓ వార్త వచ్చింది. మినిస్టర్ కేటీఆర్.. ఈటెలను తీసుకుని ప్రగతి భవన్ కి వెళ్లారు అని విన్నాం. సో.. అంతా కూల్ అయింది అనుకున్నాం. ఎన్నాళ్లుగా కేసీఆర్ కి, ఈటెలకి మధ్య ఉన్న విభేదాలు తగ్గిపోయాయి. దోస్తీ దోస్తీ అనుకున్నారు అనుకున్నాం. కానీ... నిన్నటి నుంచి మళ్లీ అదేం లేదు.. అంతా డిష్యుం డిష్యుమే. పాత కచ్చీ అలాగే ఉంది అంటున్నారు. దోస్తీ లేదు గీస్తీ లేదు.. ఎవరి దారి వారిదే అనే టాక్ కూడా బానే వినిపిస్తోంది. చట్టాలు ప్రజల కోసం చేయాలి.. పథకాలు ప్రజల కోసం ప్రవేశ పెట్టాలి. ఎలక్షన్ ని టార్గెట్ చేస్తూ పథకాలు ప్రవేశ పెట్టకూడదు. బీసీలకి అన్యాయం జరుగుతోంది.. రాజకీయాల కోసం కులాల ప్రాతి పదికన విలువ ఇస్తున్నారు. ఇలాంటి ఈటెల్లాంటి మాటలు మాట్లాడారు మినిస్టర్ ఈటెల రాజేందర్. ఇప్పుడు ఈ నాలుగు కామెంట్లు జనంలోకి సీరియస్ గా వెళ్తున్నాయి. కేసీఆర్ ఈ మధ్య కాలంలో ఈటెల కామెంట్ చేసినట్లే వ్యవహరిస్తున్నారని.. అందుకే సీఎం కేసీఆర్ ని టార్గెట్ చేస్తూ.. ఈటెల ఇలాంటి కౌంటర్లు వేశారు అనుకుంటున్నారు. ఇక పోతే.. తెలంగాణలో మరో కొత్త పార్టీ ఉండబోతుంది అనే టాక్ ఎప్పటి నుంచో నడుస్తుంది కదా. ఈటెల కూడా ఓ అడుగు ముందుకు వేసి నడుస్తున్నారని విన్నాం కదా. ఓ పక్క నుంచేమో.. కొండా విశ్వేశ్వరరెడ్డి అందరం కలిసి పార్టీ పెడుతున్నాం అంటున్నారు. అప్పట్లో కొండాకి, ఈటెలకి మంచి దోస్తీనే ఉండేది కదా టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు. ఇక పోతే.. కాంగ్రెస్ లో ఉన్న రేవంత్ రెడ్డి కూడా.. ఆ పార్టీలో ఉండి ఉపయోగం లేదు అనే లెక్కల్లో ఉన్నట్లు తెలుస్తోంది కదా. వీళ్లంతా టీఆర్ఎస్ వ్యతిరేక శక్తుల్లాగా మారి.. కేసీఆర్ ని వ్యతిరేకించే వారి లిస్ట్ లో చేరిపోయి.. కొత్త పార్టీ పెట్టి.. టీఆర్ఎస్ పై గెలిచి.. గవర్నమెంట్ ఫామ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు టాక్ ఉంది. మరి ఈటెల వెళ్తే.. హరీశ్ కూడా నేను కూడా వస్తున్నా అన్నా అంటారేమో.. అనే టాకూ ఉందాయే. ఏంటో ఈ పాలిటిక్స్ ఎటూ తేలడం లేదు.

షర్మిల ట్రయల్స్.. పార్టీ పెట్టకుండానే ఎన్నికల్లో పోటీకి రెడీ
40 minutes ago

వెంట వెంటనే ఎన్నికలు.. మంచికేనట
14 hours ago

లొంగిపోయిన కూన రవికుమార్
10 hours ago

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
12 hours ago

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
15 hours ago

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
17 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
19 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
20 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
21 hours ago

భద్రలోక్పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
a day ago
ఇంకా