newssting
Radio
BITING NEWS :
కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై సస్పెన్స్‌కు తెరపడింది. బీఎస్‌ యడియూరప్ప సోమవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సాయంత్రం గవర్నర్‌ను కలిసి రాజీనామాను సమర్పించనున్నారు. రాజీనామాపై ఆయన స్పందిస్తూ.. ‘‘ రాజకీయ జీవితంలో ఎన్నో అగ్నిపరీక్షలు ఎదుర్కొన్నా. కర్ణాటక అభివృద్ధి కోసం చాలా చేశా. 75 ఏళ్లు దాటినా నాకు రెండేళ్ల పాటు అవకాశం ఇచ్చారు. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తా’’ అని అన్నారు. * ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా సోమవారం 2,128 కోవిడ్‌ టీకా కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ అందిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల కోవిడ్‌ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. * చరిత్రలోనే మొట్టమొదటిసారి మన తెలుగు సంపద అయిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన రామప్ప ఆలయానికి ఐక్యరాజ్య సమితి విద్య, విజ్ఞాన (పరిశోధన), సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా కోసం 2015లోనే ప్రయత్నాలు మొదలయ్యాయి. * టోక్యో ఒలింపిక్స్‌లో జపాన్‌కి చెందిన మోమిజీ నిషియా సంచలనం సృష్టంచింది. ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన రెండో అతి పిన్న వయస్కురాలిగా రికార్డు క్రియాట్‌ చేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన స్కేట్‌బోర్డింగ్ లో నిషియా స్వర్ణ పతకం సాధించింది. * ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ పూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చోర్‌ బజార్‌’’. ‘దళం, జార్జ్‌ రెడ్డి’ చిత్రాల ఫేమ్‌ జీవన్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

ఈనెల 14న ముహుర్తం ఖరారు

11-06-202111-06-2021 19:11:35 IST
2021-06-11T13:41:35.155Z11-06-2021 2021-06-11T13:41:26.301Z - - 27-07-2021

ఈనెల 14న ముహుర్తం ఖరారు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భూకబ్జా ఆరోపణలతో ఈటెల రాజేందర్ మంత్రి పదవిపై వేటు వేయటం, తర్వాత ఆయన టిఆర్ఎస్ పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం, బిజిపి పార్టీ లో చేరేందుకు సిద్దపడటం చక చకా జరిగిపోయాయి. ఈ నెల 14న బిజిపి పార్టీలోకి చేరేందుకు ఈటెల ముహుర్తం ఫిక్స్ చేసుకున్నారు. తనతో పాటు మరికొందరు నేతల్ని కూడా బీజేపీలో చేర్చాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. పార్టీలో చేరేందుకు ఢిల్లీకి వెళ్లనున్న ఈటల.. అందుకోసం ఎప్పటి మాదిరి కాకుండా రోటీన్ కు భిన్నంగా ప్లాన్ చేసుకుంటున్నారు.

బీజేపీలో చేరే వేళ.. తనతో పాటు తన ముఖ్యమైన తన అనుచరులను కూడా ఢిల్లీకి తీసుకెళ్లాలన్న ఆలోచనలో ఈటెల ఉన్నారు. దీనికోసం ఆయన  ప్రత్యేక ఛార్టెడ్ ఫ్లైట్ ను బుక్ చేసినట్లుగా తెలుస్తోంది. తాను బిజెపి లో చేరే విషయం కాస్త ప్రాముఖ్యత కలిగించే విధంగా ఉండాలని, అందుకే కాస్త మందీ మార్భలంతో వెళితే న్యూస్ కవరేజీలోనూ కాస్త ఇంపార్టెన్స్ లభిస్తుందని ఈటెల భావిస్తున్నారు. అయితే ఈటెల రాజేందర్ బిజెపి పార్టీలోకి చేసే విషయాన్ని పెద్దగా పట్టించుకోవలసిన పని లేదని టిఆర్ఎస్ భావిస్తోంది.


Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle