newssting
Radio
BITING NEWS :
కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై సస్పెన్స్‌కు తెరపడింది. బీఎస్‌ యడియూరప్ప సోమవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సాయంత్రం గవర్నర్‌ను కలిసి రాజీనామాను సమర్పించనున్నారు. రాజీనామాపై ఆయన స్పందిస్తూ.. ‘‘ రాజకీయ జీవితంలో ఎన్నో అగ్నిపరీక్షలు ఎదుర్కొన్నా. కర్ణాటక అభివృద్ధి కోసం చాలా చేశా. 75 ఏళ్లు దాటినా నాకు రెండేళ్ల పాటు అవకాశం ఇచ్చారు. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తా’’ అని అన్నారు. * ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా సోమవారం 2,128 కోవిడ్‌ టీకా కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ అందిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల కోవిడ్‌ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. * చరిత్రలోనే మొట్టమొదటిసారి మన తెలుగు సంపద అయిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన రామప్ప ఆలయానికి ఐక్యరాజ్య సమితి విద్య, విజ్ఞాన (పరిశోధన), సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా కోసం 2015లోనే ప్రయత్నాలు మొదలయ్యాయి. * టోక్యో ఒలింపిక్స్‌లో జపాన్‌కి చెందిన మోమిజీ నిషియా సంచలనం సృష్టంచింది. ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన రెండో అతి పిన్న వయస్కురాలిగా రికార్డు క్రియాట్‌ చేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన స్కేట్‌బోర్డింగ్ లో నిషియా స్వర్ణ పతకం సాధించింది. * ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ పూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చోర్‌ బజార్‌’’. ‘దళం, జార్జ్‌ రెడ్డి’ చిత్రాల ఫేమ్‌ జీవన్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

ఎంపీ నామా మధుకాన్ సంస్థలో ఈడీ సోదాలు

12-06-202112-06-2021 08:29:56 IST
2021-06-12T02:59:56.605Z12-06-2021 2021-06-12T02:59:51.840Z - - 27-07-2021

ఎంపీ నామా మధుకాన్ సంస్థలో ఈడీ సోదాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ప్రముఖ నేతలు ఒక్కరొక్కరుగా ఎదో వివాదంలో చిక్కుకుంటున్నారు. ఈటెల రాజేందర్ అసైన్డ్ భూముల వ్యవహారం తో మంత్రి పదవి కోల్పోయి ఏకంగా పార్టీనే వీడి బిజెపిలోకి వెళ్ళారు. తాజాగా  లోక్‌సభాపక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్‌రావు నివాసం, కంపెనీల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సోదాలు చేసింది. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని రోడ్‌ నం.19లో ఉన్న నామా నాగేశ్వర్‌రావు ఇల్లు, రోడ్‌ నం.36లో ఉన్న మధుకాన్‌ కంపెనీ, రాంచీ ఎక్స్‌ప్రెస్‌ వే లిమిటెడ్‌ డైరెక్టర్ల ఇళ్లు కలిపి ఆరు చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది. 

ఈ సందర్భంగా కొన్ని కీలకమైన పత్రాలు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. జార్ఖండ్‌లో మధుకాన్‌ కంపెనీ చేపట్టిన నేషనల్‌ హైవే ప్రాజెక్టు కోసం తీసుకున్న బ్యాంకు రుణాలను పక్కదారి పట్టించారన్న ఆరోపణలపై ఈడీ ఈ తనిఖీలు చేపట్టింది. ఈ అంశంపై 2019లోనే సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, 2020లో చార్జిషీటు దాఖలు చేసింది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను విదేశాలకు మళ్లించారని అందులో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈడీ దర్యాప్తు చేపట్టింది. తాజాగా తనిఖీలు నిర్వహించింది. మధుకాన్‌ సంస్థ అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో.. నిజాలేమిటో తేల్చాలని సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీస్‌ (ఎస్‌ఎఫ్‌ఐఓ) న్యూఢిల్లీని జార్ఖండ్‌ హైకోర్టు ఆదేశించింది. ఎస్‌ఎఫ్‌ఐఓ దర్యాప్తు చేసి.. మధుకాన్‌ తీసుకున్న రుణంలోంచి రూ.264.01 కోట్లు పక్కదారి పట్టినట్టు నివేదిక ఇచ్చింది. ఈ వ్యవహారంతో ఏక కాలంతో హైదరాబాద్ లోని ఆయన ఇంటిపై, మధుకాన్ గ్రూపు కంపెనీలలో ఏక ఈడి కాలంలో సోదాలు నిర్వహింకీలక పత్రాలు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.


Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle