newssting
Radio
BITING NEWS :
శరన్నవరాత్రోత్సవాల్లో మూడో రోజు ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మవారు గాయత్రీదేవి అలంకరణలో దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ. * నేడు, రేపు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన. ఏపీ తీరానికి దక్షిణంగా పశ్చిమ వాయువ్య మధ్య బంగాళాఖాతంలో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం. రెండ్రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ అధికారులు. భారీ వర్షాలకు బెంబేలెత్తిపోతున్న హైదరాబాద్ వాసులు. భారీ వర్షాలపై మైకుల్లో నగరవాసులను అలర్ట్ చేస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బంది. * దుర్గమ్మకు విజయవాడ ఎన్‌ఆర్ఐ తాతినేని శ్రీనివాస్ అనే భక్తుడి కానుక. రూ.45 లక్షల విలువైన ఏడువారాల వజ్రాల నగలు దుర్గగుడి ఈవో సురేశ్ బాబుకు అందజేత. * భారీ వర్షాలకు కుంగిన పురానాపూల్ బ్రిడ్జి. వరద నీటి ఉద్ధృతి పెరగడంతో పిల్లర్ కుంగుబాటు. వాహనాల రాకపోకలు నిలిపివేత. మరమ్మతులు పూర్తయిన అనంతరం వాహనాల రాకపోకల పునరుద్ధరణ. * అసోం, మిజోరం గ్రామాల ప్రజల మధ్య ఘర్షణ. సరిహద్దుల వద్ద పరిస్థితి ఉద్రిక్తం. అసోం ప్రజలపై మిజోరం వాసుల దాడి. గుడిసెలు, స్టాల్స్‌కు నిప్పు పెట్టిన అసోం వాసులు. ప్రధాని, హోంశాఖకు సమాచారం అందించిన అసోం ముఖ్యమంత్రి. * కడప జిల్లా రాజాంలో గంజాయి ముఠా గుట్టురట్టు. 8 మంది అరెస్ట్, 53 కేజీల గంజాయి, బైక్ స్వాధీనం.

నేడే దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి ప్రారంభం.. ప్రత్యేకతలివే..

25-09-202025-09-2020 15:49:14 IST
Updated On 25-09-2020 16:06:43 ISTUpdated On 25-09-20202020-09-25T10:19:14.351Z25-09-2020 2020-09-25T10:19:00.692Z - 2020-09-25T10:36:43.945Z - 25-09-2020

నేడే దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి ప్రారంభం.. ప్రత్యేకతలివే..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భాగ్యనగరానికి మణిహారంగా నిలవనున్న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి సమయం ఆసన్నమైంది. శుక్రవారం సాయంత్రం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ మునిసిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ ఈ తీగల వంతెనను ప్రారంభించనున్నారు. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ప్రారంభంతో వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. జూబ్లిహిల్స్ రోడ్ నంబర్ 45 ను కలుపుతూ కొనసాగే ఈ కేబుల్ బ్రిడ్జికి పెద్దమ్మతల్లి ఎక్స్ ప్రెస్ వే గా పేరుపెట్టారు. 

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జికి కొన్ని చెప్పుకోదగిన ప్రత్యేకతలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రూ.184 కోట్ల వ్యయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ బ్రిడ్జిని నిర్మించింది. దేశంలోనే అతిపెద్ద తీగల వంతెనగా దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి కీర్తి గడించనుంది. 754.38 మీటర్ల పొడవైన ఈ బ్రిడ్జి ఎంతో అద్భుతమైనదిగా 21వ శతాబ్దపు ఇంజనీర్లు పేర్కొంటున్నారు. ఈ బ్రిడ్జి ప్రారంభంతో మాదాపూర్, జూబ్లీహిల్స్ ల మధ్య దూరం ఊహించనంతగా తగ్గుతుంది. అలాగే ఇరు ప్రాంతాల మీదుగా రాకపోకలు సాగించే వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు గట్టెక్కనున్నాయి. 

ఇప్పటి వరకూ మన దేశంలో అత్యంత పొడవైన బ్రిడ్జ్ గుజరాత్ లోని భరూచ్ నర్మద నదిపై నిర్మించిన మెయిన్ స్పాన్. దీని పొడవు 144 మీటర్లు (472 feet). ఇప్పుడు మెయిన్ స్పాన్ రికార్డును దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి బద్దలుకొట్టింది. అంతేకాదు.. ప్రపంచంలోని అతిపొడవైన బ్రిడ్జిల్లో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మూడవ స్థానంలో నిలిచింది. జపాన్ లో ఇంతకన్నా పొడవైనవే ఉన్నాయి కదా అని అనుకోవచ్చు.. కానీ వాటి నిర్మాణంలో ఉక్కును వాడారు. ప్రీ కాస్ట్ కాంక్రీట్ బ్రిడ్జిల్లో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మూడవ స్థానంలో ఉండటం..నిజంగా భాగ్యనగరవాసులు గర్వించదగ్గ విషయమనే చెప్పాలి. 

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణానికి అవసరమైన కేబుల్స్ కొనుగోలు, వాటి సామర్థ్య పరీక్షలు ఆస్ట్రియా, జర్మనీ దేశాల్లో జరిగాయని, అందుకుగాను యూకే, కొరియా డిజైనర్ల సహకారం తీసుకున్నట్లు ఇంజినీర్లు వెల్లడించారు. ఈ ఏడాది ఆగస్టుకే బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తవ్వగా.. ప్రత్యేక విద్యుత్ థీమ్ ల కోసం మరికొంత సమయం పట్టిందని తెలిపారు. అలాగే పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించకుండా దుర్గం చెరువులో ఎలాంటి పిల్లర్లు వేయకుండానే రెండు చివర్లలో రెండు పిల్లర్లతో బ్రిడ్జిని నిర్మించడం దీని స్పెషల్. 

అలాగే సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే ఈ బ్రిడ్జిపై వాహనరాకపోకలకు అనుమతి ఉంటుంది. శని, ఆదివారాల్లో బ్రిడ్జిని సందర్శించేందుకు కేవలం పాదచారులను మాత్రమే అనుమతించనున్నారు. మిగతా వాహనాలపై నిషేధం ఉంటుంది. అలాగే బ్రిడ్జిపై గరిష్ఠ వాహన వేగ పరిమితి కేవలం 35 కిలోమీటర్ల వరకే ఉండాలని అధికారులు తెలిపారు. ఈ తీగల వంతెనను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. 

 

 

హ‌రీశ్ వ‌ర్సెస్ ర‌ఘునంద‌న్..దుబ్బాక‌లో దుమ్ముదుమారం

హ‌రీశ్ వ‌ర్సెస్ ర‌ఘునంద‌న్..దుబ్బాక‌లో దుమ్ముదుమారం

   10 hours ago


వ‌ల్ల‌భ‌నేని వంశీ దారెటు..? అనుచ‌రుల కొత్త స‌ల‌హా!

వ‌ల్ల‌భ‌నేని వంశీ దారెటు..? అనుచ‌రుల కొత్త స‌ల‌హా!

   13 hours ago


అమరావతిని తప్పించిన ఎక్స్‌ప్రెస్ వే.. కేంద్రం ఆమోదముద్ర

అమరావతిని తప్పించిన ఎక్స్‌ప్రెస్ వే.. కేంద్రం ఆమోదముద్ర

   16 hours ago


టీడీపీ కొత్త టీమ్

టీడీపీ కొత్త టీమ్

   17 hours ago


తల దూర్చకంటూ బీజేపీ ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇచ్చిన జేపీ నడ్డా

తల దూర్చకంటూ బీజేపీ ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇచ్చిన జేపీ నడ్డా

   17 hours ago


కరోనా కేసుల రికవరీలో దేశంలోనే నంబర్‌వన్‌ ఏపీ..

కరోనా కేసుల రికవరీలో దేశంలోనే నంబర్‌వన్‌ ఏపీ..

   18 hours ago


మీలో మాస్క్ మహారాజు ఎవరు.. తెలంగాణ సర్కార్ కొత్త ప్రచారం

మీలో మాస్క్ మహారాజు ఎవరు.. తెలంగాణ సర్కార్ కొత్త ప్రచారం

   19 hours ago


బీసీ నేతలు చేయలేని మేలు ఏపీ సీఎం చేశారు.. ఆర్‌. కృష్ణయ్య

బీసీ నేతలు చేయలేని మేలు ఏపీ సీఎం చేశారు.. ఆర్‌. కృష్ణయ్య

   19 hours ago


పాకిస్థాన్ ప్ర‌ధానికి మూడిన‌ట్లే ఉంది

పాకిస్థాన్ ప్ర‌ధానికి మూడిన‌ట్లే ఉంది

   20 hours ago


ఆంధ్రప్రదేశ్ కు పొంచి ఉన్న వరుణ భీభత్సం

ఆంధ్రప్రదేశ్ కు పొంచి ఉన్న వరుణ భీభత్సం

   21 hours ago


ఇంకా

Shivakrishna D


Senior Video Editor, Shivakrishna Devasani has been working with major media houses for the last decade and half. He has been chosen as a special editor for senior journalist Satish Babu's signature program- 'Journalist Diary'. He specialises with feature programmes on current affairs and politics. Over the years, he has trained many budding video editors with many of them working now in electronic media.
 skd@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle