newssting
Radio
BITING NEWS :
కర్ణాటకలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ. ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపిన ఐఎండీ * కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కరోనాకు చికిత్స పొందుతూ కన్నుమూశారు. గురుగావ్‌లోని మేదాంత ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈరోజు ఉదయం 3.30 గంటలకు అహ్మద్ పటేల్ మృతి చెందారని ఆయన కుమారుడు ఫైసల్ పటేల్ ట్విటర్‌ ద్వారా తెలియజేశారు. విషయం తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ అహ్మద్ పటేల్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. అహ్మద్ పటేల్ సమాజానికి ఏళ్ల తరబడి సేవలు అందించారని ప్రధాని ట్వీట్ ద్వారా కొనియాడారు. అహ్మద్​ పటేల్​ మరణంపై కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘‘అత్యంత విశ్వాసపాత్రుడు, మంచి స్నేహితుడు. ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. గొప్ప కామ్రేడ్‌ను నేను కోల్పోయాను’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు * తమిళనాడు రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో నేడు తమిళనాడు వ్యాప్తంగా ప్రభుత్వం సెలవు ప్రకటించగా సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి * ఆఫ్ఘనిస్థాన్ దేశంలోని బమియాన్ నగరంలో రెండు వేర్వేరు చోట్ల జరిగిన పేలుళ్లలో 17 మంది మరణించగా, మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. బమియాన్ ప్రావిన్సులోని బమియాన్ నగరంలోని స్థానిక మార్కెట్ లో పేలుళ్లు జరిగాయి * దేశరాజధాని ఢిల్లీలో కరోనా కల్లోలం ఆగడం లేదు. గడచిన 24 గంటల్లో ఢిల్లీలో కొత్తగా 6,224 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదేసమయంలో 109 మంది మృతి చెందారు. కరోనా కారణంగా ఢిల్లీలో వరుసగా ఐదవ రోజు కూడా100కు పైగా మరణాలు సంభవించాయి * రష్యా వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌-వి ఒక్కో డోసు ధర రూ.740 (రెండు డోసులకు రూ.1480) కంటే తక్కువే ఉంటుందని రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ఫండ్‌ (ఆర్‌డీఐఎఫ్‌) అధిపతి కిరిల్‌ దిమిత్రీవ్‌ ప్రకటన * తెలుగు రాష్ట్రాలకు ‘నివర్’ తుఫాన్ ముప్పు పొంచి ఉంది. తుఫాను ప్రభావం ఇరు రాష్ట్రాలపై ఎక్కువగా ఉండనుంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుఫాన్ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు మూడ్రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ఇప్పటికే ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు జిల్లాకు చేరుకున్నారు. అధికారులు, సిబ్బందికి సెలవుల రద్దు చేశారు. తీర ప్రాంతాల్లో కలెక్టర్‌ పర్యటించారు. కృష్ణపట్నం పోర్టులో రెండవ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు * హైదరాబాద్ ఎల్బీనగర్ ఫ్లైఓవర్‌ పైనుంచి దూకి యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ప్రమాదంలో రాంపల్లి ప్రవీణ్‌కుమార్‌కు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు * రాష్ట్రంలో బుధ, గురు వారాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. బుధవారం ఒకట్రెండు చోట్ల భారీ వర్షం కురుస్తుందని అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలోని అల్పపీడనం బుధవారం సాయంత్రం తీరం దాటి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉన్న ట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు * ప్రతి ఓటరుకు ఓటరు స్లిప్పును అందజేయాలని, ఈ కార్యక్రమం బుధవారం సాయంత్రానికల్లా పూర్తి కావాలని రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఈసీ) ఆదేశించింది. 2009, 2016 ఎన్నికల్లో ఓటింగ్‌ 50 శాతం కూడా దాటకపోవడాన్ని గుర్తు చేసింది.

హ‌రీశ్ వ‌ర్సెస్ ర‌ఘునంద‌న్..దుబ్బాక‌లో దుమ్ముదుమారం

19-10-202019-10-2020 20:16:01 IST
Updated On 20-10-2020 09:47:33 ISTUpdated On 20-10-20202020-10-19T14:46:01.371Z19-10-2020 2020-10-19T14:45:53.181Z - 2020-10-20T04:17:33.628Z - 20-10-2020

హ‌రీశ్ వ‌ర్సెస్ ర‌ఘునంద‌న్..దుబ్బాక‌లో దుమ్ముదుమారం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏ ఉప ఎన్నిక అయినా స‌రే.. అక్క‌డ హ‌రీశ్ రావు ఉంటే ఆ లెక్క వేరే. టీఆర్ఎస్ పార్టీలో ట్ర‌బుల్ షూట‌ర్ గా పేరున్న లీడ‌ర్ మినిస్ట‌ర్ హ‌రీశ్ రావు. ఇక సిద్ధిపేట జిల్లాలో జ‌రిగే ఉప ఎన్నిక కావ‌డంతో హ‌రీశ్ రావు స‌వాల్ గా తీసుకున్నారు. అన్నీ తానై తిరుగుతున్నారు. సోలిపేట సుజాత నిల‌బ‌డ్డా.. గెలిచేదీ.. గెలిపించేదీ హరీశ్ రావే అన్న‌ట్లుంది ఎవ్వారం. నేనుంటే గెలుపు కాదు.. మెజార్టీ కోస‌మే ప్ర‌చారం అన్న‌ట్లు తిరుగుతున్నారు హ‌రీశ్ రావు. గెల‌వ‌డం ఎలాగూ క‌న్ఫామ్ కాబ‌ట్టి.. మెజార్టీ ఓట్లు ఎన్ని వ‌స్తాయా అనే దానిపై ఫోక‌స్ చేశారు అనే టాక్ న‌డుస్తోంది.

ఇక బీజేపీ కూడా ఇదే నియోజ‌క‌వ‌ర్గాన్ని సీరియ‌స్ గా తీసుకుంది. ఫైట్ లో నుంచుంది కూడా ర‌ఘు నంద‌న్ కావ‌డంతో ఫైట్ కాస్త ట‌ఫ్ గానే ఉంది. ర‌ఘు నంద‌న్ కూడా గెలుపు క‌న్ఫామ్ అన్న‌ట్లే ఉన్నారు. బీజేపీకి ప‌ట్టు ఉండడం.. ర‌ఘునంద‌న్ కి కాస్త పాపులారిటీ ఉండ‌డంత్ వ‌ర్క‌వుట్ అవుతుంది అనుకుంటోంది ఆ పార్టీ. 

సెంట్ర‌ల్ నుంచి బీజేపీ స‌ర్కార్ ఇస్తున్న ప‌థ‌కాల్ని ఇక్క‌డ తామిస్తున్న‌ట్లుగా మ‌సిపూసి మారేడు కాయ చేస్తున్నార‌ని బీజేపీ కామెంట్స్ చేస్తోంది. అంత సీన్ లేదు అంతా మేమే ఇస్తున్నాం అంటూ టీఆర్ఎస్ అటాక్ చేస్తోంది. నియోజ‌క వ‌ర్గంలో లీడ‌ర్లే లేక‌.. బ‌య‌టి నియోజ‌క‌వ‌ర్గాల నుంచి వ‌చ్చి ప్ర‌చారాలు చేస్తున్నార‌ని హ‌రీశ్ కామెంట్ చేయ‌గా.. అలా అంటే.. హ‌రీశ్ రావుకి కూడా నియోజ‌క‌వ‌ర్గంతో సంబంధం లేద‌నీ.. ఆయ‌న కూడా బ‌య‌టినుంచి వ‌చ్చిన వారే అంటూ కౌంట‌ర్ ఇచ్చారు ర‌ఘు నంద‌న్.

దుబ్బాక నియోజ‌కవ‌ర్గంలో నుంచోవ‌డం అంటే.. ఫైట్ చేసేది అక్క‌డి లీడ‌ర్ల‌తో కాదు.. హ‌రీశ్ రావుతో అనే విష‌యంలో మిగ‌తా లీడ‌ర్ల‌కి కూడా క్లారిటీ వ‌చ్చింది. మిగ‌తా వాళ్లు కూడా గెలుపు కోసం ఫైట్ చేస్తున్నా.. మెయిన్ గా మాత్రం.. హ‌రీశ్ రావు.. ర‌ఘు నంద‌న్ కి మ‌ధ్యే పోటీ న‌డుస్తోంది. స్క్రూటినీ కూడా అయిపోవ‌డం మొత్తం 23 మంది బ‌రిలో నుంచోడంతో ఓట్లు చీలే ఛాన్స్ కూడా బానే ఉంది.  చీలిన ఓట్లు చీలినా ఉన్న ఓటు బ్యాంకు జారిపోకుండా చూసుకుంటున్నారు లీడ‌ర్లు.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle