డ్రగ్స్ ఎమ్మెల్యేలకు నోటీసులు.. సెలబ్రిటీలకు కూడా
05-04-202105-04-2021 11:07:01 IST
Updated On 05-04-2021 12:01:16 ISTUpdated On 05-04-20212021-04-05T05:37:01.194Z05-04-2021 2021-04-05T05:36:28.324Z - 2021-04-05T06:31:16.021Z - 05-04-2021

కాస్త టైం గ్యాప్ అంతే వదిలే ప్రసక్తే లేదు అంటున్నారు. నలుగురు డ్రగ్స్ ఎమ్మెల్యేలు ఉన్నట్లుగా రెండు మూడు రోజులుగా ఫుల్లుగా వార్తలు వస్తున్నాయి కదా. అయితే.. ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు.. మరో ప్రజా ప్రతినిధి ఉన్నారట. మరి ఆ ప్రజా ప్రతినిధి ఎమ్మెల్యేనా ఎంపీనా.. మరేదైనా పదవిలో ఉన్నారా అని తేలడం లేదు. అయితే.. ముగ్గురు మాత్రం ఎమ్మెల్యేలు అనే విషయంలో అందరికీ క్లారిటీ ఉంది. మరో ప్రజాప్రతినిధి కూడా ఉన్నారు. సో.. వీరందరికీ త్వరలోనే నోటీసులు రాబోతున్నాయి. కర్ణాటక డ్రగ్స్ కేస్ ని ఢీల్ చేస్తున్న పోలీసులు ఇదే మాట చెబుతున్నారు. నలుగురు లీడర్లు అంటే.. ఎమ్మెల్యేలు అంటే మామూలు విషయమా చెప్పండి. ఎంత ఫోర్స్ ఉంటుందో తెలిసిందే కదా. అయినా సరే.. కేసు తీగ లాగిన తర్వాత కదిలిన డొంకలో ఎవరొచ్చినా కొట్టుకుపోవాల్సిందే చేసేదేం ఉండదు. ఈ ఎమ్మెల్యేలను కాపాడాలి అంటే.. ఓ పబ్ పార్టీని కాపాడాలి. అందులో ఎంత మంది డ్రగ్స్ తీసుకున్న వారు ఉన్నారో ఎవరికి తెలుసు చెప్పండి. వీళ్ల కోసం వారందరినీ వదిలేయలేరు కదా. డ్రగ్ రాకెట్ లో ముగ్గురు తెలంగాణ ఎమ్మెల్యేలు ఓ కన్నడ సినీ స్టార్ ఇచ్చిన పబ్ పార్టీకి ఈ ఎమ్మెల్యేలు మరో ప్రజాప్రతినిధి హాజరయ్యారట. ఆ పార్టీలో డ్రగ్స్ ఫుల్లుగా వాడేశారట. సో.. వారందరికీ నోటీసులు పంపుతారన్నమాట. అయితే.. లోపల డ్రగ్స్ తీసుకునే సీసీ ఫుటేజీ లేకున్నా.. బయట డోర్ దగ్గర సీసీ కెమెరాలో సార్లు మొత్తం ఉన్నారట. సో.. లోపలికి వెళ్లారు. లోపల డ్రగ్స్ తీసుకున్నారు. వెళ్లిన వారు అందరూ తీసుకున్నారా.. ఈ ఎమ్మెల్యేల్లో సుద్దపూసలు ఉన్నారా అనే విషయం తెలియాలి అంటే.. నోటీసులు ఇవ్వాలి. పిలవాలి.. రక్త పరీక్షలు చేసి.. డ్రగ్స్ తీసుకున్నారా లేదా అని తేల్చాలి. సో.. ప్లాన్ రెడీ అవుతోంది. నోటీసులు ఆల్రడీ టైప్ అయ్యాయి అట కూడా. అయితే కన్నడ సినీ స్టార్ అంటే ఈ ఎమ్మెల్యేలు అంతా ఇక్కడి సినీ సెలబ్రిటీలతోనే కదా కలిసి వెళ్లేది. వీరితో పాటు.. మామూలు స్టార్ డమ్ ఉన్న యాక్టర్లు కూడా ఉన్నారట. వారికి కూడా కలిపి నోటీసులు అందించేందుకు అంతా సిద్దం అయింది.

షర్మిల ట్రయల్స్.. పార్టీ పెట్టకుండానే ఎన్నికల్లో పోటీకి రెడీ
an hour ago

వెంట వెంటనే ఎన్నికలు.. మంచికేనట
14 hours ago

లొంగిపోయిన కూన రవికుమార్
10 hours ago

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
12 hours ago

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
15 hours ago

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
17 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
19 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
20 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
21 hours ago

భద్రలోక్పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
a day ago
ఇంకా