newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

16-04-202116-04-2021 17:14:49 IST
Updated On 16-04-2021 17:07:49 ISTUpdated On 16-04-20212021-04-16T11:44:49.189Z16-04-2021 2021-04-16T08:07:27.952Z - 2021-04-16T11:37:49.182Z - 16-04-2021

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రముఖ వైద్యుడు, నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు శుక్రవారం కన్నుమూశారు.అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1925లో కృష్ణా జిల్లా పెదముత్తేవిలో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన కాకర్ల సుబ్బారావు ప్రాధమిక విద్య చల్లపల్లిలో, కళాశాల విద్య మచిలీపట్నం హిందూ కాలేజీలో సాగింది. అనంతరం విశాఖలోని ఆంధ్రా మెడికల్ కాలేజీ నుంచి డాక్టర్‌ పట్టా పొందారు. 1951లో హౌస్‌ సర్జన్‌ చేసిన తర్వాత ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లి రేడియాలజీ బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు.

1954-56 మధ్య న్యూయార్క్‌, బాల్టిమోర్‌ నగరాల్లోని పలు ఆసుపత్రుల్లో పనిచేశారు. 1956లో స్వదేశానికి తిరిగి వచ్చిన ఆయన హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేరారు. ఆ తర్వాత అదే కాలేజీలో చీఫ్ రేడియాలజిస్టుగా పదోన్నతి పొందారు. మొత్తం 14 సంవత్సరాల పాటు వైద్య సేవలు అందించారు. ఆ తర్వాత హైదరాబాద్‌ నిమ్స్‌ ఆసుపత్రి డైరెక్టర్‌గా సేవలందించారు. రెండు సార్లు అమెరికా వెళ్లిన ఆయన దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పిలుపు మేరకు తిరిగి హైదరాబాద్ కు వచ్చేసారు. 

అమెరికాలో తాన సభలకు పునాది వేసింది ఈయనే అని చెబుతారు. అక్కడి తెలుగు వారందరిని ఒక్కతాటిపై తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. తెలుగు అసోసియోషన్‌కు వ్యవస్థాపక అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2000 సంవత్సరంలో కేంద్రం ఆయన్ను పద్మ శ్రీతో సత్కరించింది. రాజీవ్ చక్ర నేషనల్ అవార్డు, నేషనల్ యూనిటీ అవార్డు సహా లెక్కలేనన్ని పురస్కరాలను డాక్టర్ కాకర్ల అందుకున్నారు. 

1954 నుంచి 1956 వరకు అమెరికాలోని వివిధ నగరాల్లోని ఆసుపత్రులలో పనిచేశారని.. 1956లో భారత్‌కు తిరిగొచ్చి హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరి ప్రధాన రేడియాలజిస్ట్‌గా పదోన్నతి పొందారని ఆయన బంధువులు తెలిపారు. 1970లో తిరిగి అమెరికాకు వెళ్లిపోయారు. 1986 అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పిలుపుమేరకు  హైదరాబాదుకు వచ్చి, నిమ్స్ డైరెక్టర్‌గా సేవలు అందించారని చెప్పుకొచ్చారు. పదేళ్లపాటు ఎలాంటి వేతనం తీసుకోకుండానే సేవలు అందించారని అన్నారు.

పద్మశ్రీ డా.కాకర్ల సుబ్బారావు మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వైద్య రంగానికి కాకర్ల చేసిన సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు. నిమ్స్ డైరక్టర్ గా ఆయన చేసిన కృషి గొప్పదన్నారు. 

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   13 hours ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   16 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   21 hours ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   21 hours ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   20 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   a day ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   18 hours ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   a day ago


మిస్ట‌ర్ క్యూ పీఎం

మిస్ట‌ర్ క్యూ పీఎం

   13-05-2021


ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

   13-05-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle