పార్టీ స్థాపనకై షర్మిల అడుగులు.. అనవసరమని అంటున్న ధర్మపురి అరవింద్
21-02-202121-02-2021 08:37:20 IST
2021-02-21T03:07:20.227Z21-02-2021 2021-02-21T03:07:07.949Z - - 09-03-2021

తెలంగాణలో రాజకీయ పార్టీని మొదలుపెట్టడానికి దివంగత వైఎస్సార్ కుమార్తె వైఎస్ షర్మిల ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు రచిస్తూ ఉన్నారు. రాష్ట్రంలోని వైఎస్ఆర్ అభిమానులతో జిల్లాల వారిగా భేటీ అవుతూ వస్తుంది. గత వారం రోజుల క్రితం ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల వైఎస్ఆర్ అభిమానులతో భేటీ అయిన షర్మిల.. తాజాగా హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు చెందిన వైఎస్ఆర్ అభిమానులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ప్రారంభంలో షర్మిల జై తెలంగాణ అంటూ నినాదాలు చేయటం ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో వైఎస్ఆర్ పాలన కనిపించడం లేదని, ప్రజలు, రైతులు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని ఇప్పటికే షర్మిల కామెంట్లు చేసింది. అందుకే తాను పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నానని, వైఎస్ఆర్ పాలన తేవడమే తన లక్ష్యం అన్నారు. తెలంగాణలో వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు బలహీనమయ్యాక అధికమంది వైఎస్ ఆర్ అభిమానులు, వైఎస్ అండదండలతో ఎదిగిన నేతలు తెరాసలో చేరారు. పలువురు అధికార పార్టీలో కీలక పదవుల్లో ఉండగా.. మరికొందరు ఆదరణలేక అసంతృప్తితోనే తెరాసలో కొనసాగుతున్నారు. ఈ సమయంలో తెరాసను టార్గెట్ చేయడం ద్వారా ఆ పార్టీలోని అసంతృప్తిగా ఉన్న వైఎస్ ఆర్ అభిమానించే నేతలను తమవైపుకు తిప్పుకోవచ్చనేది షర్మిల వ్యూహాంగా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వచ్చే ఎన్నికల్లోపు తెలంగాణలో షర్మిల తన పార్టీని బలోపేతం చేయాలని భావిస్తూ ఉన్నారు. రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన వైఎస్ అభిమానులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన వారి నుంచి అభిప్రాయ సేకరణ నిమిత్తం ఫీడ్ బ్యాక్ పత్రాలు ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఇక షర్మిల పార్టీపై విమర్శలు కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టడం అనవసరమని పలువురు రాజకీయ నాయకులు విమర్శిస్తూ ఉన్నారు. నిజామాబాద్ ఎంపీ, బీజేపీ యువనేత ధర్మపురి అరవింద్ స్పందిస్తూ.. షర్మిల పార్టీ హలెలూయా పార్టీ అని వ్యంగ్యం ప్రదర్శించారు. తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు పేరుతో షర్మిల సమయం వృథా చేసుకుంటున్నారని.. తెలంగాణకు కావాల్సింది రాజన్న రాజ్యం కాదని, రామరాజ్యం అని అరవింద్ చెప్పుకొచ్చారు.

నోటికొచ్చినట్లు మాట్లాడితే తాటతీస్తాం.. బీజేపీపై మండిపడ్డ కేటీఆర్
7 hours ago

కేతిరెడ్డిపై ఫైర్ అయిన పరిటాల శ్రీరామ్..!
9 hours ago

కాంగ్రెస్ వామపక్షాల మధ్య పొత్తా, శత్రుత్వమా.. డైలమ్మాలో కార్యకర్తలు
10 hours ago

వైసీపీ రౌడీయిజానికి బ్రేకులేస్తాం
10 hours ago

ఇదేం అన్యాయం.. హర్ట్ అయిన విడదల రజనీ ఫ్యాన్స్
11 hours ago

రాంజీ మృతి పట్ల తెలుగుదేశం పార్టీ నాయకుల దిగ్భ్రాంతి
11 hours ago

హైదరాబాద్ పేరును మార్చేస్తామని అంటున్న బీజేపీ నేత
11 hours ago

పవన్ కి విశాఖలో అడుగు పెట్టే ధైర్యం లేదా
2 hours ago

ఎంపీ గోరంట్ల మాధవ్ కు మహిళ నుండి ఊహించని ప్రశ్న
9 hours ago

డాక్టర్ చిరంజీవి కొల్లూరి కన్నుమూత..!
13 hours ago
ఇంకా