newssting
Radio
BITING NEWS :
విజయవాడలో కన్నకూతురిని అమ్మకానికి పెట్టిన తాగుబోతు తండ్రి. విషయం తెలిసి తండ్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చిన చైల్డ్ లైన్ అధికారులు. అనంతరం చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు. * తెలుగు రాష్ట్రాల్లో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 11 మంది దుర్మరణం. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఇన్నోవా - బోర్ వెల్ లారీ ఢీ. ప్రమాదంలో ఆరుగురు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు. ప్రమాద సమయంలో ఇన్నోవాలో 11 మంది ప్రయాణికులు. మృతులంతా హైదరాబాద్ లోని తాడ్ బన్ కు చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * కర్నూల్ జిల్లా గూడూరు వద్ద బైక్ ను ఢీ కొట్టిన ట్రాక్టర్. ముగ్గురు దుర్మరణం, మృతులంతా బ్రాహ్మణదొడ్డికి చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * ఖమ్మం జిల్లా కామేపల్లి వద్ద టిప్పర్ - స్కూటీ ఢీ, ఇద్దరు మృతి. * మూడోరోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు. రాష్ట్రంలో ఇసుక సమస్యపై అసెంబ్లీలో టీడీపీ వాయిదా తీర్మానం.

ఇవాళే ధ‌ర‌ణి స్టార్ట్.. రిజిస్ట్రేష‌న్ ఈజీ

29-10-202029-10-2020 08:00:58 IST
Updated On 29-10-2020 08:06:21 ISTUpdated On 29-10-20202020-10-29T02:30:58.926Z29-10-2020 2020-10-29T02:30:55.202Z - 2020-10-29T02:36:21.661Z - 29-10-2020

ఇవాళే ధ‌ర‌ణి స్టార్ట్.. రిజిస్ట్రేష‌న్ ఈజీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రెవెన్యూ శాఖ‌లో కొత్త చ‌ట్టం స్టార్ట్ ఇవాళ్టి నుంచే. సీఎం కేసీఆర్ ప్లాన్ చేసిన ధ‌ర‌ణి పోర్ట‌ల్ కి టైమ్ వ‌చ్చింది. ఇన్నాళ్లూ ఆర్వోఆర్ 1971 ను ఫాలో అవుతున్నాం. ఇన్నాళ్లూ ఎలాంటి అప్డేటూ లేదు. చిన్న చిన్న మార్పులు కూడా చేయ‌క‌పోవ‌డంతో.. జ‌నం చాలా ఇబ్బందులు ప‌డ్డారు. ఏం చేయాల‌న్నా ఎమ్మార్వో ఆఫీసుల చుట్టూ తిర‌గాలి.. అన్నీ ఎమ్మార్వో, ఆర్ ఐ.. వీ ఆర్వో చేతుల్లోనే ఉండేది. సో.. వాళ్ల ముగ్గురి ప‌ర్మిష‌న్ లేకుండా ఏదీ జ‌రిగేది కాదు.. వీఆర్ఓ ద‌గ్గ‌ర్నుంచి మొద‌లెడితే.. అంద‌రికీ తలా కాస్త ఇస్తేనే కానీ.. ప‌న‌య్యేది కాదు.

అందుకే.. వీఆర్వో వ్య‌వ‌స్థ‌ని కూడా ర‌ద్దు చేసింది టీఎస్ స‌ర్కార్. ఇక‌పై ఆర్ ఐ లు గ‌ట్రా కూడా నామ్ కే వాస్తే అన్న‌ట్లే ఉండ‌బోతుంది. 1971 నుంచి ఆర్వోఆర్ చ‌ట్టంలో ఎలాంటి మార్పులూ చేయ‌క‌పోయినా.. ఒకేసారి స‌మూలంగా  మార్చేసింది తెలంగాణ గ‌వ‌ర్న‌మెంట్. పాత చ‌ట్టాలు.. పాత ప‌ద్ద‌తులు ఈ రోజుల్లో వ‌ర్క‌వుట్ కావు అని స‌మూల మార్పుల‌కి శ్రీకారం చుట్టింది.

ఇన్నాళ్లూ ఒక లెక్క ఇక నుంచి ఒక లెక్క‌.. ధ‌ర‌ణి మొత్తం ఆన్ లైన్ పోర్ట‌లే. చేతి రాత‌లతో ప‌నిలేదు. ఫైళ్లు గ‌ట్రా తీయాల్సిన అక్కెర లేదు. జ‌స్ట్ రికార్డుల్లోకి ఎక్కిస్తారు. అఫ్ కోర్స్.. ప‌క్కా ప్రూఫ్స్ తోనే వెళ్లాలి. క‌లెక్ట‌ర్లు.. ఎమ్మార్వోల చేతిల్లోనే ఉంటుంది రెవెన్యూ కీ మొత్తం. గంట‌ల్లోనే రిజిస్ట్రేష‌న్లు అయిపోత‌య్. ఓన‌ర్ పేరు మీద అప్డేట్ అవుత‌య్. మాన్యువ‌ల్ గా జ‌రిగే ముటేష‌న్లు.. రిజ‌స్ట్రేష‌న్లు అన్నీటికి చెల్లి చిటీ పాడిన‌ట్లే ఇక. మొత్తం ధ‌ర‌ణి ఫాలో కావాల్సిందే. కంప్లీట్ డీటెయిల్స్ ధ‌ర‌ణిలోనే దొరుకుత‌య్.

ఏదైనా పొలం కొనేట‌ప్పుడు కూడా భ‌య‌ప‌డాల్సిన ప‌న్లేదు. ఆన్ లైన్ లో ధ‌ర‌ణి పోర్టల్ ఓపెన్ చేయ‌డం.. ప‌ట్టా ఎవ‌రి పేరు మీద ఉందో చూపించ‌డం.. అమ్ముకోవ‌డం. రిజ‌స్ట్రేష‌న్ కూడా ఆన్ లైనే. ముటేష‌న్లు, రిజిస్ట్రేష‌న్ల‌కి రోజులకి రోజులు తిరిగి.. ప‌ట్టా పుస్త‌కాల కోసం నెల‌ల‌కి నెల‌లు వెయిట్ చేసే రోజులు పోయాయ్. ఆ పాత రోజుల ప్లేస్ లో ఇప్పుడు ధ‌ర‌ణి వ‌చ్చింది. ఆ పాత రోజులు పాత క‌ష్టాల‌కి చ‌ర‌మ‌గీతం పాడిన సీఎం కేసీఆర్.. ధ‌ర‌ణి పోర్ట‌ల్ ని ట్రాక్ పైకి తీసుకొచ్చారు.

పోలవరంలో అవినీతి జరిగిందన్నారు.. నిరూపించకుండా ఏడాదిన్నరగా గాడిదలు కాస్తున్నారా?

పోలవరంలో అవినీతి జరిగిందన్నారు.. నిరూపించకుండా ఏడాదిన్నరగా గాడిదలు కాస్తున్నారా?

   8 hours ago


పోలవరం ఎత్తుపై అసెంబ్లీ సాక్షిగా మంత్రి అనిల్ ఏమ‌న్నారంటే..?

పోలవరం ఎత్తుపై అసెంబ్లీ సాక్షిగా మంత్రి అనిల్ ఏమ‌న్నారంటే..?

   8 hours ago


ఉచిత ఇళ్లపై వైసీపీ ప్రభుత్వం చెప్పిన లాజిక్ వింటే మైండ్ గాన్ అంతే!

ఉచిత ఇళ్లపై వైసీపీ ప్రభుత్వం చెప్పిన లాజిక్ వింటే మైండ్ గాన్ అంతే!

   9 hours ago


పోలవరం ఆపం.. 100 అడుగుల వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం..!

పోలవరం ఆపం.. 100 అడుగుల వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం..!

   9 hours ago


అసెంబ్లీలో 'జయము.. జయము చంద్రన్న' వీడియో టెలీకాస్ట్.. ఒక్కొక్కరి ముఖాల్లో నవ్వులే నవ్వులు

అసెంబ్లీలో 'జయము.. జయము చంద్రన్న' వీడియో టెలీకాస్ట్.. ఒక్కొక్కరి ముఖాల్లో నవ్వులే నవ్వులు

   10 hours ago


ఏపీ అసెంబ్లీకి చుట్టుకున్న కరోనా భయం

ఏపీ అసెంబ్లీకి చుట్టుకున్న కరోనా భయం

   10 hours ago


పోలవరంపై అసెంబ్లీలో చర్చ.. టీడీపీ ఎమ్మెల్యేలను ఎందుకు సస్పెండ్ చేశారంటే

పోలవరంపై అసెంబ్లీలో చర్చ.. టీడీపీ ఎమ్మెల్యేలను ఎందుకు సస్పెండ్ చేశారంటే

   11 hours ago


ఏపీ సర్కార్ వద్దంటున్న ఎన్నికలు కర్ణాటకలో ప్రకటించేశారు!

ఏపీ సర్కార్ వద్దంటున్న ఎన్నికలు కర్ణాటకలో ప్రకటించేశారు!

   11 hours ago


వెంకన్న సాక్షిగా ప్రధాని హోదా వాగ్ధానం.. అదే బీజేపీ పాలిట శాపం?!

వెంకన్న సాక్షిగా ప్రధాని హోదా వాగ్ధానం.. అదే బీజేపీ పాలిట శాపం?!

   12 hours ago


ఓటైతే వేయలే గాని.. వైన్ షాప్ ముందు క్యూలు కట్టారు!

ఓటైతే వేయలే గాని.. వైన్ షాప్ ముందు క్యూలు కట్టారు!

   12 hours ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle