newssting
Radio
BITING NEWS :
* ఏపీ లో వివాదంగా మారిన గీతం వర్సిటీ కట్టడాల కూల్చివేత, అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జీవీఎంసీ, గీతం వర్సిటీ యాజమాన్యం మధ్య ల్యాండ్ వార్ * హైదరాబాద్: నేపాల్ గ్యాంగ్ ను అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు, నాచారం లో జరిగిన చోరీ కేసులో నేపాల్ ముఠా అరెస్ట్ * జూరాల ప్రాజెక్ట్ వరద ఉదృతి, 6 గేట్లు ఎత్తివేత ఇన్ ఫ్లో 92,800 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 94,721 క్యూసెక్కులు * ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు సిపిఐ నేత రామకృష్ణ లేఖ అమరావతి రైతులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపడం తగదు

దీపిక కిడ్నాప్ కథ సుఖాంతం.. ట్విస్ట్ ఏమిటంటే..!

30-09-202030-09-2020 12:27:53 IST
Updated On 30-09-2020 12:39:16 ISTUpdated On 30-09-20202020-09-30T06:57:53.969Z30-09-2020 2020-09-30T06:56:05.719Z - 2020-09-30T07:09:16.989Z - 30-09-2020

దీపిక కిడ్నాప్ కథ సుఖాంతం.. ట్విస్ట్ ఏమిటంటే..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ లో షాపింగ్ కు అంటూ వెళ్లిన ఓ మహిళ కిడ్నాప్ కు గురైన సంగతి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అయిన సంగతి తెలిసిందే. దీపిక అనే మహిళను ఆమె భర్త అఖిల్ కిడ్నాప్ చేశాడంటూ ఆమె కుటుంబ సభ్యులు చెప్పారు. వికారాబాద్‌ పట్టణంలో తల్లి చూస్తుండగానే కూతురిని కిడ్నాప్‌ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర కాలనీకి చెందిన తల్లీకూతురు షాపింగ్‌ కోసం బయటకు వచ్చారు. ఎంఆర్‌పీ చౌరస్తా సమీపంలో సాయంత్రం 6 గంటలకు అందరూ చూస్తుండగానే, తల్లి ఎదుటే కూతురిని కిడ్నాప్‌ చేశారు. కిడ్నాప్‌కు గురైన యువతి తల్లిని పోలీసులు ప్రశ్నించగా తమ కూతురికి నాలుగేళ్ల కిందట హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడితో ప్రేమ వివాహం జరిగిందని, అనంతరం అమ్మాయి ని తమ వద్దే ఉంచుకుంటున్నామని తెలిపింది.  

దాదాపు 48 గంటల ఉత్కంఠకు తెరపడింది. భర్తతో కలిసి ఉండేందుకే యువతి అతడితో వెళ్లినట్టు పోలీసులు తేల్చారు. వారిద్దరినీ విలేకరుల ఎదుట ప్రవేశపెట్టిన పోలీసులు కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఖలీల్ అలియాస్ అఖిల్‌ను ప్రేమించిన దీపిక నాలుగేళ్ల క్రితం కుటుంబ సభ్యులకు తెలియకుండా వివాహం చేసుకుంది.

ఈ పెళ్లి ఇష్టంలేని దీపిక తల్లిదండ్రులు కుమార్తెను ఇంటికి తీసుకొచ్చి ఆమెతో విడాకులకు దరఖాస్తు చేయించారు. ఈ కేసు విచారణలో ఉండగా 27న సాయంత్రం దీపిక కిడ్నాప్ అయింది. ఆమె కోసం గాలించినప్పటికీ ఫలితం లేకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆరు బృందాలతో గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో తననెవరూ కిడ్నాప్ చేయలేదని, కావాలనే భర్తతో కలిసి కారులో వెళ్లినట్టు దీపిక తెలిపింది. అంతకు ముందే పోలీసులకు ఫోన్‌ చేసిన దీపిక.. తనను ఎవరు కిడ్నాప్‌ చేయలేదని.. తాను ఇష్టపూరితంగానే భర్త అఖిల్‌తో కలిసి వెళ్లినట్లు పోలీసులకు తెలిపింది.

మంట‌లు రేపుతున్న మహారాష్ట్ర సీఎం

మంట‌లు రేపుతున్న మహారాష్ట్ర సీఎం

   2 hours ago


ఏపీ పట్ల ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్న తెలంగాణ

ఏపీ పట్ల ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్న తెలంగాణ

   3 hours ago


పోలవరం పూర్తి ఖర్చు భరిస్తామన్నారు. మాట తప్పితే ఎలా? కేంద్రం పై జగన్ ఫైర్

పోలవరం పూర్తి ఖర్చు భరిస్తామన్నారు. మాట తప్పితే ఎలా? కేంద్రం పై జగన్ ఫైర్

   4 hours ago


టీఆర్‌ఎస్‌ను ఒక్కసారి ఓడించండి.. కేసీఆర్‌కు హామీలన్నీ గుర్తొస్తాయి... ఉత్తమ్

టీఆర్‌ఎస్‌ను ఒక్కసారి ఓడించండి.. కేసీఆర్‌కు హామీలన్నీ గుర్తొస్తాయి... ఉత్తమ్

   19 hours ago


వెలవెలబోతున్న కోవిడ్ ఆసుపత్రులు.. 80 శాతం పడకలు ఖాళీ

వెలవెలబోతున్న కోవిడ్ ఆసుపత్రులు.. 80 శాతం పడకలు ఖాళీ

   19 hours ago


దుబ్బాక‌లోనే అస‌లు ద‌స‌రా

దుబ్బాక‌లోనే అస‌లు ద‌స‌రా

   a day ago


నిమ్మ‌గ‌డ్డ‌పై మీడియా జ‌బ‌ర్ద‌స్తీ

నిమ్మ‌గ‌డ్డ‌పై మీడియా జ‌బ‌ర్ద‌స్తీ

   a day ago


సికింద్రాబాద్ లో పేలుడు.. కొద్దిసేపు టెన్షన్

సికింద్రాబాద్ లో పేలుడు.. కొద్దిసేపు టెన్షన్

   25-10-2020


సీఎం జగన్‌ సామాజిక న్యాయ సంరక్షకుడు.. పీఎంకే అధినేత రామదాస్ ప్రశంస

సీఎం జగన్‌ సామాజిక న్యాయ సంరక్షకుడు.. పీఎంకే అధినేత రామదాస్ ప్రశంస

   25-10-2020


ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులు తెలంగాణ సరిహద్దుల వరకే.. పేర్ని నాని

ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులు తెలంగాణ సరిహద్దుల వరకే.. పేర్ని నాని

   25-10-2020


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle