newssting
Radio
BITING NEWS :
నేడు ఏపీలో సీఎం జగన్ ఏరియల్ సర్వే. నివర్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేస్తున్న సీఎం. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో సీఎం సర్వే. సర్వే అనంతరం తిరుపతిలో అధికారులతో సమీక్ష. * ఏపీలో రెండ్రోజులపాటు కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలుల ధాటికి 465 మూగజీవాలు మృత్యువాత. * తుఫాన్ కారణంలో ఏపీలో 2,14,420 హెక్టార్లలో పంటనష్టం. 11 జిల్లాల్లో లక్షా 89 వేల హెక్టార్లలో దెబ్బతిన్న వరి. 13 వేల హెక్టార్లలో మినుము, 5 వేల హెక్టార్లలో పత్తి పంటలకు నష్టం.

ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులు తెలంగాణ సరిహద్దుల వరకే.. పేర్ని నాని

25-10-202025-10-2020 10:07:43 IST
Updated On 25-10-2020 10:09:03 ISTUpdated On 25-10-20202020-10-25T04:37:43.262Z25-10-2020 2020-10-25T04:37:41.649Z - 2020-10-25T04:39:03.590Z - 25-10-2020

ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులు తెలంగాణ సరిహద్దుల వరకే.. పేర్ని నాని
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ–తెలంగాణ సరిహద్దుల వద్ద ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంచామని సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తెలిపారు. శనివారం ఆయన హైదరాబాద్‌లోని లేక్‌ వ్యూ అతిధి గృహంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. దసరాను పురస్కరించుకుని సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద ఆర్టీసీ సేవలందిస్తుందన్నారు. పంచలింగాల, గరికపాడు, వాడపల్లి, పైలాన్, జీలుగుమిల్లి, కల్లుగూడెం చెక్‌పోస్టుల వద్ద ఏపీ బస్సులు ఉంటాయన్నారు. జూన్ 18 నుంచి టీఎస్‌ఆర్టీసీ అధికారులతో చర్చలు జరుపుతూనే ఉన్నా ఇరు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాల కోసం వేగంగా ఒప్పందం కుదుర్చుకోవాలనుకున్న తమ ప్రయత్నానికి తెలంగాణ ఆర్టీసీ అధికారులు సహకరించనందునే పండుగ సీజన్‌లోనూ ఏపీనుంచి తెలంగాణకు బస్సులు నడపలేకపోతున్నామని నాని చెప్పారు.

జూన్‌ 18 నుంచి టీఎస్‌ఆర్టీసీ అధికారులతో చర్చలు జరుపుతూనే ఉన్నాం. 1.61 లక్షల కిలోమీటర్లకే పరిమితం అవుతూ వారి డిమాండ్లకు అనుకూలంగానే ప్రతిపాదనలు పంపాం. రూట్ల వారీగా కూడా స్పష్టత ఇచ్చాం. ఏపీఎస్‌ఆర్టీసీ లాభనష్టాలు చూడడం లేదు. ప్రజలు ఇబ్బంది పడకూడదనేదే మా అభిమతం.  

కేంద్రం గతేడాది మోటారు వాహన చట్టంలో 31 సెక్షన్లను సవరిస్తూ పార్లమెంట్‌లో తీర్మానం చేసింది. ఇందులో 20 సెక్షన్లను ఏ రాష్ట్రం కూడా మార్పు చేయలేని పరిస్థితి. అందువల్ల నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించాం. దీన్ని వాహనదారులు సామాజిక బాధ్యతగా భావించాలి. దీనిపై ప్రతిపక్షాలు.. ప్రధానంగా టీడీపీ రాద్ధాంతం చేస్తోంది. ప్రభుత్వంపై సోషల్‌ మీడియాలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తించే వారికి, సరైన క్రమశిక్షణ నేర్పించే ఉద్దేశంతోనే జరిమానాలు పెంచాము. రాష్ట్రంలో రహదారుల మరమ్మతుకు సీఎం వైఎస్‌ జగన్‌ రూ.2,500 కోట్లు మంజూరు చేశారు. 

ఏపీ సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద ఆర్టీసీ బస్సులు

ప్రయాణికులకు ఇబ్బందుల్లేకుండా ఏపీఎస్‌ ఆర్టీసీ తెలంగాణ సరిహద్దుల వరకు బస్సులు నడుపుతోంది. ఇందుకోసం 6 జిల్లాల రీజియన్లకు సంబంధించి సరిహద్దు చెక్‌ పోస్టుల వద్ద 38 బస్‌ సర్వీసులను అందుబాటులో ఉంచింది. కర్నూలు, గుంటూరు, కృష్ణా, ఒంగోలు, తూర్పుగోదావరి, విశాఖ రీజియన్లకు సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద ప్రత్యేకాధికారులను కూడా నియమించింది.  

 

ప్లాన్ ఏ పనిచేయకపోతే ప్లాన్ బి అమలు చేస్తాం.. ఏపీఆర్టీసీ

తెలంగాణకు బస్సు సర్వీసుల విషయంలో అనిశ్చితి తొలగకపోవడంతో ఏపీనుంచి బెంగళూరుకు 2 వేలకుపైగా ప్రత్యేక బస్సులను అక్టోబర్ 15 నుంచి నడపాలని ఏపీఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. అది ప్లాన్ ఏ. ఇక ప్లాన్ బి ప్రకారం రాష్ట్రం లోపలే బస్సు సర్వీసులను అధికం చేసి దసరా పండుగ సందర్భంగా లాభాలు ఆర్జించాలని ఆర్టీసీ నిర్ణయించుకుంది.

మొత్తం మీద తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు నడవకుండా తొలిసారి దసరా జరుగుతోంది. లాక్‌డౌన్‌తో 7 నెలల క్రితం నిలిచిపోయిన బస్సులు.. అంతర్రాష్ట్ర ఒప్పందం లేదన్న కారణంతో ఇప్పటివరకు ప్రారంభం కాలేదు. దీనిపై 2 నెలలుగా అభిప్రాయ భేదాలు నెలకొన్నా.. దసరా ముంగిట అవి సమసిపోయాయి. తెలంగాణ ఆర్టీసీ ప్రతిపాదించిన మేరకు బస్సు సర్వీసులు, తెలంగాణ పరిధిలో తమ బస్సులు తిరిగే కి.మీ. సంఖ్య తగ్గించుకునేందుకు ఏపీఎస్‌ ఆర్టీసీ సమ్మతించింది. అయితే, ఒప్పందానికి సంబంధించిన భేటీ నిర్వహించలేదు. దీంతో తొలిసారి దసరా వేళ ఆర్టీసీ బస్సులు సరిహద్దులు దాటలేదు.

గతేడాది దసరా సమయంలో తెలంగాణ ఆర్టీసీలో సమ్మె ప్రారంభం కావటంతో పండక్కి టీఎస్‌ఆర్టీసీ బస్సులు పెద్దగా నడవలేదు. అదే సమయంలో ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులు ముమ్మరంగా నడవడంతో పాటు అదనంగానూ తిరిగాయి. ఇక, ఈ దసరాకు రెండువైపులా బస్సులు సరిహద్దులు దాటలేదు. దీంతో తెలంగాణ పరిధిలో ఉండే ఏపీ ప్రయాణికులు, ఆంధ్రా ప్రాంతంలో ఉండే తెలంగాణవాసులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వచ్చింది. ఇక, రైళ్లు కూడా పరిమిత సంఖ్యలోనే నడుస్తుండటంతో ఎక్కువ మంది ప్రైవేటు బస్సులు, సొంత వాహనాల్లో ఊళ్లకు పయనమయ్యారు. 

 

కేసీఆర్ మాయాజాలం..జనానికి పూనకం

కేసీఆర్ మాయాజాలం..జనానికి పూనకం

   36 minutes ago


రేవంత్ సుడిగాలి ప్రచారం.. కష్టానికి ఫలితం ఢిల్లీ నుండి వస్తుందా?!

రేవంత్ సుడిగాలి ప్రచారం.. కష్టానికి ఫలితం ఢిల్లీ నుండి వస్తుందా?!

   14 hours ago


టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతుంది.. బండి సంజయ్

టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతుంది.. బండి సంజయ్

   15 hours ago


యూటర్న్ తీసుకున్న పవన్ కళ్యాణ్ పై తమిళ మీడియా సెటైర్లు

యూటర్న్ తీసుకున్న పవన్ కళ్యాణ్ పై తమిళ మీడియా సెటైర్లు

   15 hours ago


మోదీ పర్యటన.. రేవంత్ రెడ్డి అభ్యంతరం

మోదీ పర్యటన.. రేవంత్ రెడ్డి అభ్యంతరం

   19 hours ago


జనసేన వర్సెస్ ధర్మపురి అరవింద్.. ఈ గొడవ ఎక్కడి దాకా వెళుతుందో

జనసేన వర్సెస్ ధర్మపురి అరవింద్.. ఈ గొడవ ఎక్కడి దాకా వెళుతుందో

   19 hours ago


ప్ర‌కాశ్ రాజ్.. ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకో బిడ్డా- నాగ‌బాబు సీరియ‌స్

ప్ర‌కాశ్ రాజ్.. ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకో బిడ్డా- నాగ‌బాబు సీరియ‌స్

   19 hours ago


ఎన్నిక‌ల్లో అన్ని పార్టీల‌కూ ఆ ఒక‌టే భ‌యం.. ప‌రిష్కారం ఏంటి..?

ఎన్నిక‌ల్లో అన్ని పార్టీల‌కూ ఆ ఒక‌టే భ‌యం.. ప‌రిష్కారం ఏంటి..?

   20 hours ago


విజయసాయిపై ఉత్తరాంధ్ర వైసీపీ నేతల కడుపుమంట.. ఆడియో లీక్!

విజయసాయిపై ఉత్తరాంధ్ర వైసీపీ నేతల కడుపుమంట.. ఆడియో లీక్!

   20 hours ago


వివాదాస్పద వ్యాఖ్యలకు మూల్యం.. కేసుల నమోదు

వివాదాస్పద వ్యాఖ్యలకు మూల్యం.. కేసుల నమోదు

   20 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle