newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలంగాణ కోర్టుల్లోనూ, పోలీసు స్టేషన్స్ లోనూ కరోనా కలకలం

06-04-202106-04-2021 10:17:09 IST
Updated On 06-04-2021 12:13:08 ISTUpdated On 06-04-20212021-04-06T04:47:09.237Z06-04-2021 2021-04-06T04:29:53.935Z - 2021-04-06T06:43:08.043Z - 06-04-2021

తెలంగాణ కోర్టుల్లోనూ, పోలీసు స్టేషన్స్ లోనూ కరోనా కలకలం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సంగతి తెలిసిందే..! తెలంగాణలో కూడా కరోనా కేసులు పెరిగిపోతూ ఉన్నాయి. తెలంగాణలోని కోర్టుల్లో, పోలీసు స్టేషన్స్ లో కరోనా కలకలం మొదలైంది. నాంపల్లి క్రిమినల్‌ కోర్టులు, సిటీ సివిల్‌ కోర్టు, సిటీ స్మాల్‌కాజెస్‌ కోర్టులతోపాటు రంగారెడ్డి జిల్లా కోర్టుల పరిధిలో పలువురు న్యాయమూర్తులు కరోనా బారినపడ్డారు. కోర్టు సిబ్బంది, న్యాయవాదులకు కరోనా సోకింది. విచారణలకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని నాంపల్లి మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి తుకారాంజీ రాసిన లేఖపై హైకోర్టు స్పందించింది. భౌతిక విచారణ నిలిపివేయాలని హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ వెంకటేశ్వర్‌రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.

జూన్‌లో కరోనా కేసులు తీవ్రంగా ఉన్నప్పటి ఆదేశాలను ఇప్పుడు అమలు చేయాలన్నారు. దీంతో జంట నగరాలు, రంగారెడ్డి జిల్లా పరిధిలోని కోర్టుల్లో కేసులను భౌతికంగా విచారించరు. ముఖ్యమైన, తుది వాదనల సమయంలో ఉన్న 20 కేసులను మాత్రమే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారించే అవకాశముంది. ఆయా కేసుల్లో కక్షిదారులు హాజరుకాకపోయినా ప్రతికూలమైన ఆదేశాలు జారీ చేయరాదంటూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలుచేస్తారు.

కరోనా పోలీసు స్టేషన్లను కూడా వదలడం లేదు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో సీఐ, ఎస్సై సహా 9 మంది కానిస్టేబుళ్లు కరోనా బారినపడడం కలకలం రేపుతోంది. ఈ పోలీస్ స్టేషన్‌లో గతంలో 50 మంది పోలీసు అధికారులు, సిబ్బంది కరోనా బారినపడి కోలుకున్నారు. ఇప్పుడు మళ్లీ అదే పోలీస్ స్టేషన్‌లో  9 మంది కానిస్టేబుళ్లు, సీఐ, ఓ మహిళా ఎస్సై కరోనా బారినపడ్డారు. 

COVID-19 Updates: కరోనా ఉగ్ర రూపం.. ఒక్కరోజులోనే లక్ష కేసుల సరికొత్త రికార్డు..!

నిజామాబాద్‌లోని నిష్కల్ న్యూరో మల్టీ స్పెషాలిటీ  ఆసుపత్రి సిబ్బందికి కరోనా వైరస్ సోకినప్పటికీ రోగులకు సేవలు అందించడం కలకలం రేపుతోంది. దీంతో ఆసుపత్రిని అధికారులు మూసివేశారు.  సిబ్బందిలో 30 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, వారిలో 10 మందికి వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. ఆసుపత్రిలోని 10 మంది సిబ్బందికి వైరస్ సోకినప్పటికీ ఐసోలేషన్‌లోకి వెళ్లకుండా  రోగులకు సేవలు అందిస్తున్న విషయంపై జిల్లా అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఆసుపత్రికి చేరుకున్న డీఎం అండ్ హెచ్ఓ సుదర్శనం ఆసుపత్రిని మూసివేసి విచారణ చేపట్టారు.

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   12 minutes ago


వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   14 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   10 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   12 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   14 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   17 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   18 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   20 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   21 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   21 hours ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle