newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

23-04-202123-04-2021 11:10:50 IST
Updated On 23-04-2021 10:02:55 ISTUpdated On 23-04-20212021-04-23T05:40:50.093Z23-04-2021 2021-04-23T03:49:37.037Z - 2021-04-23T04:32:55.081Z - 23-04-2021

గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏం అయిత‌ది ర భ‌య్. ఛాయ్ తాగాలె. బీర్ తాగాలె. ట్రాఫిక్ ల గిర్ర గిర్ర తిర‌గాలె. రెస్ట‌రెంట్ల‌ల్ల తినాలె. టిఫిన్ సెంట‌ర్ల‌ల్ల వాలి పోవాలె. సాయంత్రం అయిందంటె చాలు.. సెంట‌ర్లు కిక్కిరిసి పోవాలె. ఇదీ హైద‌రాబాదీ లైఫ్ స్టైల్. 

స‌రే.. బ‌త‌కాలి. కొలువు చేసుకుంటేనే బ‌తుకు అనుకుంటే త‌ప్పేం లేదు. త‌ప్పేదీ లేదు. కానీ.. అంతేనా. కొలువు చేయాలి అంటే బ‌త‌కాలి క‌దా. సీఎం కేసీఆర్ చెప్పిన‌ట్లు.. బ‌తికుంటే బ‌లుసాకు తిని అయినా బ‌త‌కొచ్చు.. ఇట్టా స్పైసీ స్పైసీ ఫుడ్ కోసం బ‌య‌టికి రాకుంటే మంచిది క‌దా. పొద్దున్నే.. టిఫిన్ ఇళ్ల‌ల్లో రూముల్లో చేసుకుంటే ఏం కొంప‌లు అంటుకు పోతున్నయ్. క‌రోనా కాచుకుని కూర్చున్న‌ప్పుడు రాకూడ‌దు క‌దా. అయినా విన‌రు. ఇక ఫుడ్ ఆర్డ‌ర్లు.. షాపింగులు.. అబ్బో.. ఎంత ట్రాఫిక్ ఉన్నా స‌రే. అంద‌రూ పోతుంటే మ‌న‌కేంటి అనుకుంటారు కానీ.. మ‌నం మాత్రం ఇంట్లో ఉందాం అనుకోరు. అది హైద‌రాబాదీల స్టైల్. ఏదో బ‌య‌టికి రాక‌పోతే.. ఊపిరాడ‌దు అన్న‌ట్లే చేస్తుంటారు.

ఓ ప‌క్క సిటీ హాస్పిట‌ల్స్ లో క‌రోనా చావులు రోజు రోజుకీ పెరుగుతున్న‌య్. గ‌చ్చిబౌలి టిమ్స్ లో ఆక్సిజ‌న్ అంద‌క ఇబ్బందులు ప‌డుతున్నారు జ‌నాలు. బెడ్లు దొర‌క్క టెన్ష‌న్ ప‌డుతున్నారు. రోజుకి 20 మంది చ‌నిపోతున్నారంటే ప‌రిస్థితి ఎలా ఉందో ఆలోచించండి. బుధ వారం 18 మంది చ‌నిపోతే.. గురు వారం 20 మంది చనిపోయారు. ఇవ్వాళ పాతిక మంది కావ‌చ్చు. చ‌నిపోయిన వారిని తీసుకెళ్లే శ‌వ పేటిక‌లు కూడా దొర‌క డం లేద‌ట‌. ప‌రిస్థితి ఎంత దారుణంగా  ఉందో ఆలోచించుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. లైట్ లే.. అనుకుంటే అంతే. వ్యాక్సిన్ తీసుకున్నాం క‌దా అనుకుంటే అంతే. శ్మ‌శాన వాటిక‌లు కూడా సరిపోని ప‌రిస్థితి రావ‌డానికి ఎంతో టైం ప‌ట్ట‌దు. ఇప్ప‌టికే హైద‌రాబాద్ ఖాళీ అవుతోంది. క‌రోనా పేషెంట్లు ఇలాగే చ‌నిపోతే.. ముందు ముందు రోజుల్లో ఎలా ఉంటుందో ఏమో.. ఊహించ‌డం క‌ష్టంగానే  ఉంటుంది. 

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

ఎన్నిక‌లు అంటే చాలు.. మినిస్ట‌ర్ కేటీఆర్.. హైద‌రాబాద్ మొత్తం నాదే అంటారు. మినిస్ట‌ర్లు అంద‌రినీ రంగంలోకి దింపి.. క్రెడిట్ మాత్రం త‌నే కొట్టేస్తారు. రాబోయే కాలానికి కాబోయే సీఎంని నేను అనుకుంటూ.. మూవ్ అవుతుంటారు. అగ్రెసివ్ పాలిటిక్స్ చేస్తారు. ప్లానింగ్ ప్రకారం ముందుకెళ్తారు. స‌రే సార్ కేటీఆర్ గారూ..  ఆ ఆరోగ్య శాఖ మంత్రేనా.. మీ క‌నుస‌న్న‌ల్లో ఉండే హైద‌రాబాద్ ని మీరు కూడా ప‌ట్టించుకుంటారా. ఎలాగూ.. సీఎం కేసీఆర్ ఎవ్వారం అంద‌రికీ తెలిసిందే క‌దా. ఆయ‌న మంచిగా ఉంటేనే ప‌ట్టించుకోరు.. ఇప్పుడు ఆరోగ్య ప‌రిస్థితి బాలేదు కాబ‌ట్టి.. అస్స‌లే ప‌ట్టించుకోరు అనుకుంటున్నారు జ‌నాలు.

గుడ్ న్యూస్.. ఏపీ అంబులెన్స్ లకు అనుమతి ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం

గుడ్ న్యూస్.. ఏపీ అంబులెన్స్ లకు అనుమతి ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం

   19 minutes ago


రఘురామ అరెస్టుపై టీడీపీ నేతల రియాక్షన్ ఇదే

రఘురామ అరెస్టుపై టీడీపీ నేతల రియాక్షన్ ఇదే

   42 minutes ago


రఘురామ అరెస్టుపై స్పందించిన సీఐడీ

రఘురామ అరెస్టుపై స్పందించిన సీఐడీ

   an hour ago


జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   15 hours ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   17 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   a day ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   a day ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   21 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   a day ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   20 hours ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle