newssting
Radio
BITING NEWS :
విజయవాడలో కన్నకూతురిని అమ్మకానికి పెట్టిన తాగుబోతు తండ్రి. విషయం తెలిసి తండ్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చిన చైల్డ్ లైన్ అధికారులు. అనంతరం చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు. * తెలుగు రాష్ట్రాల్లో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 11 మంది దుర్మరణం. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఇన్నోవా - బోర్ వెల్ లారీ ఢీ. ప్రమాదంలో ఆరుగురు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు. ప్రమాద సమయంలో ఇన్నోవాలో 11 మంది ప్రయాణికులు. మృతులంతా హైదరాబాద్ లోని తాడ్ బన్ కు చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * కర్నూల్ జిల్లా గూడూరు వద్ద బైక్ ను ఢీ కొట్టిన ట్రాక్టర్. ముగ్గురు దుర్మరణం, మృతులంతా బ్రాహ్మణదొడ్డికి చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * ఖమ్మం జిల్లా కామేపల్లి వద్ద టిప్పర్ - స్కూటీ ఢీ, ఇద్దరు మృతి. * మూడోరోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు. రాష్ట్రంలో ఇసుక సమస్యపై అసెంబ్లీలో టీడీపీ వాయిదా తీర్మానం.

వెలవెలబోతున్న కోవిడ్ ఆసుపత్రులు.. 80 శాతం పడకలు ఖాళీ

25-10-202025-10-2020 17:49:09 IST
Updated On 25-10-2020 17:52:36 ISTUpdated On 25-10-20202020-10-25T12:19:09.657Z25-10-2020 2020-10-25T12:19:07.703Z - 2020-10-25T12:22:36.764Z - 25-10-2020

వెలవెలబోతున్న కోవిడ్ ఆసుపత్రులు.. 80 శాతం పడకలు ఖాళీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా ఉధృతి బాగా తగ్గుముఖం పట్టినందున తెలంగాణలో కొవిడ్‌ చికిత్సకు అనుమతుల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునే ప్రైవేటు ఆస్పత్రులకు ఇకపై అనుమతి ఇవ్వకూడదని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. జిల్లాల నుంచి ఇప్పటికే పలు ప్రైవేటు ఆస్పత్రులు అనుమతుల కోసం దరఖాస్తు చేసు కున్నాయి. వాటిని ప్రభుత్వం పెండింగులో ఉంచింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా ఉధృతి తగ్గడం, ఉన్న ఆస్పత్రుల్లోనే బెడ్లు ఖాళీగా ఉంటుండడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

ఇప్పటికే అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు కొన్ని ప్రైవేటు ఆస్పతులకు కూడా ప్రభుత్వం కొవిడ్‌ చికిత్సకు అనుమతులు ఇచ్చింది. రాష్ట్రంలో క్రమంగా పరిస్థితులు మెరుగుపడి.. పాజిటివ్‌ కేసులు బాగా తక్కువగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఆస్పత్రులకు వచ్చి చికిత్స తీసుకునే వారి సంఖ్య కూడా బాగా తగ్గిపోయింది. దీంతో.. ఇక కొవిడ్‌ చికిత్సకు అదనపు ఆస్పత్రుల అవసరం ఉండదని వైద్య ఆరోగ్య శాఖ భావిస్తోంది. 

ఆసుపత్రి కంటే ఇల్లే పదిలం.. ముఖం చాటేస్తున్న రోగులు

ఆస్పత్రులు కిటకిట. బెడ్డు కావాలంటే రెకమండేషన్లు.. లక్షల్లో డిపాజిట్లు.. అడ్వాన్స్‌ బుకింగులు. బెడ్డు దొరకడమే మహాద్భాగ్యం. ఇదీ.. నిన్నటి వరకు రాష్ట్రంలో కొవిడ్‌కు చికిత్స అందించే ప్రైవేటు ఆస్పత్రుల్లోని స్థితి. దీంతో.. కొవిడ్‌ చికిత్సకు అనుమతుల కోసం ప్రైవేటు ఆస్పత్రులు పోటీపడ్డాయి. కానీ.. నేడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కొవిడ్‌ ఆస్పత్రులన్నీ వెలవెలబోతున్నాయి. బెడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ప్రైవేటే కాదు.. ప్రభుత్వాసుపత్రుల్లోనూ ఇదే పరిస్థితి. దీనికి రాష్ట్రంలో కరోనా ఉధృతి తగ్గడం ఓ కారణమైతే.. వైరస్‌ సోకిన వారు కూడా ఆస్పత్రి కంటే ఇల్లే పదిలం అనుకోవడం మరో కారణం. ఈ స్థితిలో.. కొవిడ్‌ చికిత్సకు కొత్తగా ప్రైవేటు ఆస్పత్రులకు అనుమతులు ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించింది.

రాష్ట్రంలో పాజిటివ్‌లు తగ్గుతుండడంతో ప్రైవేటు ఆస్పత్రులు క్రమంగా పడకల సంఖ్యను కూడా తగ్గించేస్తున్నాయి. కొన్ని ఆస్పత్రులు కొవిడ్‌ చికిత్స నుంచే వైదొలగుతున్నాయి. వైరస్‌ ఉధృతి అధికంగా ఉన్న రోజుల్లో ప్రైవేటు ఆస్పత్రులు భారీగా కొవిడ్‌ చికిత్సకు అనుమతులు పొందాయి. సెప్టెంబరు 1 నాటికి రాష్ట్రంలో మొత్తం 184  ప్రైవేటు ఆస్పత్రులు కొవిడ్‌ చికిత్స అందిస్తుండగా, అక్టోబరు 1 నాటికి ఆ సంఖ్య 231కి చేరింది. కానీ.. అక్టోబరు 1 నుంచి రాష్ట్రంలో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టింది. ప్రైవేటు ఆస్పత్రులన్నీ క్రమంగా ఖాళీ అయిపోయాయి. దీంతో..  20 రోజుల వ్యవధిలో మూడు ప్రైవేటు ఆస్పత్రులు కొవిడ్‌ చికిత్స నుంచి వైదొలగగా.. ఆస్పత్రులన్నీ కలిపి మొత్తం 529 కరోనా బెడ్లను తొలగించాయి. 

ప్రస్తుతం ప్రైవేటులో దాదాపు 80 శాతం బెడ్లు, సర్కారు ఆస్పత్రుల్లో 83 శాతం పడకలు ఖాళీగా ఉన్నాయి. అక్టోబరు 23 నాటికి రాష్ట్రంలోని 228 ప్రైవేటు కొవిడ్‌ ఆస్పత్రుల్లో మొత్తం 8,945 కరోనా బెడ్లు ఉండగా, అందులో 7,199 ఖాళీగా ఉన్నాయి. 61ప్రభుత్వ ఆస్పత్రుల్లో మొత్తం 8,561 పడకలుంటే.. అందులో 7129 బెడ్లు ఖాళీగానే ఉన్నాయి. కరోనా చికిత్సకు ప్రత్యేక వ్యవస్థలతో పాటు నిపుణులైన వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది కూడా ఉండాలి. వారికిచ్చే వేతనాలు కూడా భారీగానే ఉంటున్నాయి. రోగుల రాక తగ్గిపోయి.. ఆదాయం లేకపోతుండడంతో నిర్వహణ కూడా భారమవుతోందని ఓ ప్రైవేటు ఆస్పత్రి నిర్వాహకుడు తెలిపారు. అందుకే కొవిడ్‌ చికిత్స నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు.

అందుకే తెలంగాణ ప్రజా ఆరోగ్య సంచాలకుడు జి. శ్రీనివాసరావు  అదనంగా ప్రైవేట్ ఆసుపత్రులకు కోవిడ్ చికిత్సకు అనుమతులు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ రోగుల సంఖ్య బాగా తగ్గుతోంది. అధిక శాతం పడకలు ఖాళీగా ఉంటున్నాయి. ఇప్పటికే కొవిడ్‌ చికిత్స అందించే ప్రైవేటు ఆస్పత్రులు ఉన్నాయి. అందుకే అదనంగా అనుమతులు ఇవ్వడం లేదని చెప్పారు.

 

పోలవరంలో అవినీతి జరిగిందన్నారు.. నిరూపించకుండా ఏడాదిన్నరగా గాడిదలు కాస్తున్నారా?

పోలవరంలో అవినీతి జరిగిందన్నారు.. నిరూపించకుండా ఏడాదిన్నరగా గాడిదలు కాస్తున్నారా?

   8 hours ago


పోలవరం ఎత్తుపై అసెంబ్లీ సాక్షిగా మంత్రి అనిల్ ఏమ‌న్నారంటే..?

పోలవరం ఎత్తుపై అసెంబ్లీ సాక్షిగా మంత్రి అనిల్ ఏమ‌న్నారంటే..?

   8 hours ago


ఉచిత ఇళ్లపై వైసీపీ ప్రభుత్వం చెప్పిన లాజిక్ వింటే మైండ్ గాన్ అంతే!

ఉచిత ఇళ్లపై వైసీపీ ప్రభుత్వం చెప్పిన లాజిక్ వింటే మైండ్ గాన్ అంతే!

   9 hours ago


పోలవరం ఆపం.. 100 అడుగుల వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం..!

పోలవరం ఆపం.. 100 అడుగుల వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం..!

   10 hours ago


అసెంబ్లీలో 'జయము.. జయము చంద్రన్న' వీడియో టెలీకాస్ట్.. ఒక్కొక్కరి ముఖాల్లో నవ్వులే నవ్వులు

అసెంబ్లీలో 'జయము.. జయము చంద్రన్న' వీడియో టెలీకాస్ట్.. ఒక్కొక్కరి ముఖాల్లో నవ్వులే నవ్వులు

   10 hours ago


ఏపీ అసెంబ్లీకి చుట్టుకున్న కరోనా భయం

ఏపీ అసెంబ్లీకి చుట్టుకున్న కరోనా భయం

   10 hours ago


పోలవరంపై అసెంబ్లీలో చర్చ.. టీడీపీ ఎమ్మెల్యేలను ఎందుకు సస్పెండ్ చేశారంటే

పోలవరంపై అసెంబ్లీలో చర్చ.. టీడీపీ ఎమ్మెల్యేలను ఎందుకు సస్పెండ్ చేశారంటే

   11 hours ago


ఏపీ సర్కార్ వద్దంటున్న ఎన్నికలు కర్ణాటకలో ప్రకటించేశారు!

ఏపీ సర్కార్ వద్దంటున్న ఎన్నికలు కర్ణాటకలో ప్రకటించేశారు!

   11 hours ago


వెంకన్న సాక్షిగా ప్రధాని హోదా వాగ్ధానం.. అదే బీజేపీ పాలిట శాపం?!

వెంకన్న సాక్షిగా ప్రధాని హోదా వాగ్ధానం.. అదే బీజేపీ పాలిట శాపం?!

   12 hours ago


ఓటైతే వేయలే గాని.. వైన్ షాప్ ముందు క్యూలు కట్టారు!

ఓటైతే వేయలే గాని.. వైన్ షాప్ ముందు క్యూలు కట్టారు!

   12 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle