నేడే ముహుర్తం.. కాంగ్రెస్ నుండి మరో మాజీ మంత్రి బీజేపీలోకి
14-01-202114-01-2021 08:59:28 IST
2021-01-14T03:29:28.979Z14-01-2021 2021-01-14T03:29:08.816Z - - 20-01-2021

బీజేపీ ఇప్పుడు హాట్ కేక్ అయింది తెలంగాణలో.. సీనియార్టీ ఉండి కేడర్ ఉండి.. పార్టీలో గుర్తింపు లేకుంటే చాలు.. అంతా డిసప్పాయింట్ అయిపోతారనేది కామనే. కానీ.. పార్టీ మారలేక పార్టీలో ఉండలేక ఇబ్బంది పడుతుంటారు. అలాంటి లీడర్లందరికీ హాట్ కేక్ లా కనిపిస్తోన్న పార్టీ బీజేపీ. ఇప్పుడు బీజేపీ స్పీడ్ ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం కదా. బండి స్పీడు గురించి దేశం మొత్తం చర్చించుకుంటోంది. నేషనల్ పాలిటిక్స్ లో కూడా ఎవరో బండి సంజయ్ అంటా.. తెలంగాణలో బీజేపీ బండి స్పీడ్ పెంచారట అనుకుంటున్నారు. సో.. బండి బండెక్కితే ఏ గోలా ఉండదు. తన బండిలో ఏంచక్కా లాగించుకెళ్తారు అని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు తెలంగాణ పొలిటికల్ లీడర్లు.
టీఆర్ఎస్ లీడర్లే నాతో టచ్ లో ఉన్నారు అంటూ బాంబులు పేలుస్తున్నారు కదా బండి సంజయ్. ఇక కాంగ్రెస్ నుంచి మాత్రం ఎందుకు టచ్ లో ఉండరు చెప్పండి. కాంగ్రెస్ సీనియర్ లీడర్ ఆగమ చంద్ర శేఖర్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. పేరున్న లీడర్ కాకపోయినా.. ఐదుసార్లు ఎమ్మెల్యేగా చేశారు. మినిస్టర్ గా కూడా పని చేశారు. కానీ గుర్తింపు రాలేదు అంటున్నారు. నిజమే.. ఆయన పెద్దగా జనానికి తెలీక పోవడం చూస్తే కూడా.. నిజమే మీకు గుర్తింపు రాలేదు అనే మాటని యాక్సెప్ట్ చేస్తున్నాం అంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. మరి ఏంటి ప్రాబ్లమ్ అంటే.. పార్టీలో క్రమ శిక్షణ లేదు అంటున్నారు ఆగమ చంద్రశేఖర్. పార్టీ పదవులతో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశానన్నారు ఆగమ చంద్రశేఖర్.
అయితే.. ఆయన ఏ పార్టీలో చేరుతున్నారు అనే విషయంపై మాత్రం పబ్లిక్ గా ఏ మాటా అనలేదు. కానీ.. ఆయన సన్నిహిత వర్గాల నుంచి తెలుస్తున్నది ఏంటంటే.. తను బీజేపీలో చేరుతున్నారు అని. అది కూడా ఎప్పుడో కాదు.. ఇవ్వాళే బీజేపీలో చేరుతున్నారు అనే టాక్ ఉంది. ఆయన కేడర్ సమక్షంలో బీజేపీలో చేరడానికి అంతా రెడీ చేసుకున్నారట. చూస్తుంటే వలసలు బానే ఉన్నట్లుంది. కాంగ్రెస్ పార్టీ పగ్గాలు తీసుకునే లీడర్ ని త్వరగా ఎంపిక చేయకుంటే.. ఇంకెంత మంది లీడర్లు ఆగమ చంద్రశేఖర్ దారిన పడి వెళ్తారో చూడాలి.

అమిత్ షాతో ముగిసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ
3 hours ago

తిరుమలలో నిన్న పందులు.. నేడు దొంగలు.. ఏంది సార్ ఇది
3 hours ago

ఢిల్లీ చేరుకున్న వైఎస్ జగన్.. ఎలాంటి రాజకీయ కారణాలు లేవంటున్న సజ్జల
5 hours ago

దేవినేని ఉమ విడుదల..!
7 hours ago

ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం.. ఎవరెవరు ఉన్నారంటే..!
8 hours ago

'దీదీ'ని ఓడించకపోతే రాజకీయాల్లోంచే తప్పుకుంటా.. సువేందు
8 hours ago

ఏ పార్టీలో అయినా చేరండి.. కానీ రాజీనామా చేయండి.. రజనీ మక్కల్ మన్రం
10 hours ago

బలమేంటో తెలీదా.. లేదంటే బలమే లేదా
12 hours ago

మతం పేరు వర్కవుట్ అవుతుందా.. తెలుగోళ్లు పట్టించుకుంటారా
13 hours ago

ఉన్నదే ముచ్చటగా ముగ్గురు నలుగురు.. మళ్లీ అందులో గ్రూపులా
15 hours ago
ఇంకా