newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

21-04-202121-04-2021 11:59:17 IST
Updated On 21-04-2021 10:19:34 ISTUpdated On 21-04-20212021-04-21T06:29:17.478Z21-04-2021 2021-04-21T04:16:37.377Z - 2021-04-21T04:49:34.580Z - 21-04-2021

కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇదే ఇప్పుడు వినిపిస్తోన్న మాట‌. తెలంగాణ‌లో కాంగ్రెస్ ఎక్క‌డ ఉంది చెప్పండి అంటే.. ఏమో ఎక్క‌డుందో ఎవ‌రికి తెలుసు. కొంత‌మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్న‌ట్లుంది క‌దా అంటారు. నిజ‌మే.. అలా వేళ్ల మీద లెక్కేసేంత మందే ఉన్నారు. కాస్త సీనియ‌ర్ లీడ‌ర్లు.. జ‌నానికి నోన్ లీడ‌ర్లు ఉండ‌డంతో కాంగ్రెస్ కాస్త బ‌తికే ఉంది అన్నట్లు అనిపిస్తుందే త‌ప్ప‌.. ఎన్నిక‌లు వాటి ఎవ్వారాలు.. త‌ర్వాత వ‌చ్చే రిజ‌ల్టుల ఎవ్వారాలు చూస్తే మాత్రం కాంగ్రెస్ ఎక్క‌డ ఉంద‌బ్బా అంటారు.

కానీ.. కాంగ్రెస్ అంటే కాంగ్రెస్సే.. హీరో నుంచి జీరో దాకా వెళ్లినా.. మ‌ళ్లీ జీరో నుంచి హీరో దాకా రాగ‌ల కెపాసిటీ ఉంది కాంగ్రెస్ కి. కాస్త టైం ప‌డుతుంది అంతే త‌ప్ప‌.. ఏదో ఒక‌టి చేసి నెట్టుకొస్తుంది. అందుకే.. ఇన్ని ద‌శాబ్ధాలుగా నేష‌న‌ల్ పార్టీగా టాప్ లిస్ట్ లో ఉంది. ఇప్పుడు బీజేపీ దెబ్బ‌కి బోల్తా కొట్టినా కానీ.. దేశ వ్యాప్తంగా చూస్తే బ‌లంగానే ఉంది. అయితే.. తెలంగాణ‌లో కూడా అలాంటి సిచ్చువేష‌న్ లోనే ఉండి పోయింది కాంగ్రెస్. లీడ‌ర్లు అయితే కొంత‌మంది ఉన్నారు కానీ.. కేడ‌ర్ లేని ప‌రిస్థితి. అయినా స‌రే.. ప‌ట్టు వ‌దిలే ప్ర‌సక్తే లేదు అంటున్నారు కాంగ్రెస్ లీడ‌ర్లు. తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణ మినీ పుర పోరులో విజ‌యం మాదే అంటున్నారు. విజయాలు ద‌క్క‌క పోయినా..  మేమున్నాం అని నిరూపించుకునే విష‌యంలో ఏ మాత్రం కాంప్ర‌మైజ్ అయ్యే ప్ర‌స‌క్తే లేదు అంటున్నారు. ఐదు చోట్ల జ‌ర‌గ‌నున్న మున్సిప‌ల్ పోరులో త‌గ్గేదే లేదు అంటున్నారు. టీఆర్ఎస్ కాకుండా మిగ‌తా పార్టీల‌ను క‌లుపుకుని వెళ్లే ప్లాన్స్ లో ఉన్నారు. ఎత్తులు పై ఎత్తులు కుద‌రడం లేదు కాబ‌ట్టి.. పొత్తులే క‌రెక్ట్ అనుకుంటున్నారు.

టీడీపీ, క‌మ్యూనిస్ట్ పార్టీల‌తో పొత్తులు పెట్టుకుని.. పుర పోరులో ప‌వ‌ర్ చూపించాల‌ని చూస్తోంది కాంగ్రెస్. అయితే.. ఈ పొత్తుల ఎవ్వారంలో కూడా సింపుల్ గా వెళ్ల‌నున్నారు. ఎక్క‌డ ఎలా వీలైతే అలా పొత్తులు నడిపించాలి అని ఫిక్స్ అయ్యార‌ట‌. డిమాండ్లు గ‌ట్రా ఏం లేకుండా.. స్థానికంగా ఉన్న ప‌రిస్థితుల‌ను అంచ‌నా వేసుకుని.. అక్క‌డి సిచ్చువేష‌న్స్ కి త‌గ్గ‌ట్లు వెళ్తార‌ట‌. ఇవ్వాళ‌ దీనిపై ఓ క్లారిటీ రానున్న‌ట్లు తెలుస్తోంది.

ఇది చదవండి: కేసీఆర్ త‌ర్వాత రేవంత్ రెడ్డే


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle