newssting
Radio
BITING NEWS :
ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రోత్సవాలు. నాల్గవరోజు అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తోన్న దుర్గమ్మ. * పెచ్చులూడుతోన్న బెజవాడ కనకదుర్గా ఫ్లై ఓవర్. సోమవారం రాత్రి ఏపీఎస్పీ బెటాలియన్ కానిస్టేబుల్ రాంబాబుపై పడిన ఫ్లై ఓవర్ పెచ్చులు. తీవ్రగాయాలు కావడంతో రాంబాబును ఆస్పత్రికి తరలించిన సిబ్బంది. భారీ వర్షాల కారణంగానే ఇలా జరిగి ఉంటుందంటున్న అధికారులు. * తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,486 కేసులు, ఏడుగురు మృతి. యాక్టివ్ గా ఉన్న 20,686 కేసులు. * తెలంగాణ ప్రయాణికులకు సర్కార్ శుభవార్త. దసరా సందర్భంగా ఈ నెల 24 వరకూ రాష్ట్రంలో వివిధ జిల్లాలకు 3000 స్పెషల్ బస్సులు. ఎంజీబీఎస్, జేబీఎస్, కూకట్‌పల్లి, ఎస్సార్ నగర్, అమీర్‌పేట, ఈసీఐఎల్, ఉప్పల్ క్రాస్ రోడ్డు, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల నుంచి నడవనున్న స్పెషల్ బస్సులు. * మహబూబాబాద్ వీడియో జర్నలిస్ట్ కొడుకు కిడ్నాప్. రూ.45 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న కిడ్నాపర్లు. పోలీసులకు ఫిర్యాదు చేసిన జర్నలిస్ట్. * ఏపీకి భారీ వర్షసూచన. నేడు కృష్ణా, గుంటూరు, తూ.గో., ప.గో జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం.

ఓటమి భయంతోనే అసెంబ్లీ బేటీకి హరీష్ డుమ్మా.. భట్టి ఎద్దేవా

14-10-202014-10-2020 13:08:57 IST
2020-10-14T07:38:57.304Z14-10-2020 2020-10-14T07:38:55.298Z - - 21-10-2020

ఓటమి భయంతోనే అసెంబ్లీ బేటీకి హరీష్ డుమ్మా.. భట్టి ఎద్దేవా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాష్ట్రం మొత్తంగా భారీవర్షాలతో అతలాకుతలం అవుతుంటే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇంత హడావుడిగా పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. అధికార ప‌క్షం త‌మ‌కు న‌చ్చిన బిల్లుల‌ను ఆమోదం చేసుకోవడానికే అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసినట్లుందని సీఏల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు తెలిపారు. 

ధ‌ర‌ణి పోర్ట‌ల్‌పై ఉన్న అనుమానాల‌ను నివృతి చేయ‌లేద‌ని, వెబ్‌సైట్‌లో చాలా త‌ప్పులున్న‌య‌ని భ‌ట్టి వ్యాఖ్యానించారు. ఒక‌రి  భూమిని మరోకరు ధరణి వెబ్ సైట్‌లో ఎంట్రీ చేసుకుంటే అసలైన పట్టాదారు తన  భూమిని ఏంట్రీ చేయించాలంటే  ధరణి వెబ్ సైట్ లోకి తీసుకోవ‌ట్లేద‌న్నారు. ధ‌ర‌ణి వెబ్‌సైట్‌లోని త‌ప్పుల‌ను స‌రిచేకుండా ప్ర‌భుత్వం మ‌ళ్లీ త‌ప్పులు చేస్తోంద‌ని దీంతో  రైతులు గంధరగోళానికి గుర‌వుతున్నార‌ని పేర్కొన్నారు. 

తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు హ‌డావిడిగా పెట్టార‌ని  శాస‌న‌స‌భ‌లో సాంప్ర‌దాయాల‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, ప్ర‌తిప‌క్షాలు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం కూడా చెప్ప‌లేక‌పోతున్న‌ర‌ని భట్టి విక్రమార్క మండిపడ్డారు. హ‌రీష్ రావుకు ఓట‌మి భ‌యం ప‌ట్టుకుంద‌ని అందుకే అసెంబ్లీకి రాకుండా దుబ్బాక‌లోనే మ‌కాం వేశార‌ని ఆరోపించారు.

అసెంబ్లీ స‌మావేశాలు కేవ‌లం బిల్లుల ఆమోదం కోస‌మే అన్న‌ట్లు ఉంద‌ని ములుగు ఎమ్మెల్యే సీత‌క్క అన్నారు. క‌విత ఎమ్మెల్సీగా ప్ర‌మాణ స్వీకారం చేసేందుకే రేపు మండ‌లి పెడుతున్నార‌ని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్క‌డా పెన్ష‌న్లు పంపిణీ చేయ‌కుండా ఒక్క దుబ్బాక‌లోనే ప్ర‌భుత్వం ఎలా అప్రూవ్ చేస్తుంద‌ని ప్ర‌శ్నించారు. అకాల వర్షాలతో రైతులు నష్టపోతే కనీసం వాళ్ళకు ధైర్యం నింపే పనికూడా ప్రభుత్వం చేయట్లేదని తెలిపారు. 

పదే పదే 50శాతం రిజర్వేషన్లు అని చెప్తున్న కేటీఆర్... మీ మొదటి ప్రభుత్వంలో ఒక్క మహిళా మంత్రి కూడా లేదని సీతక్క ఎద్దేవా చేశారు. అంతేకాకుండా రాష్ట్రం లో మహిళా కమీషన్ లేదని దాని గురించి మాట్లాడండ‌ని హిత‌వు ప‌లికారు. పర్యావరణ అనుమతులు మీకు నచ్చిన వారికి ఓకలా నచ్చిని వారికి మరోలా ఉండొద్దని పేర్కొన్నారు. మొక్కలు పెంపకం కోసం వచ్చే కంపా నిధులు ఏమవుతున్నాయని ఈ సంద‌ర్భంగా ప్ర‌శ్నించారు. 

తెలంగాణలో  ప‌రిపాల‌న చాలా విచిత్రంగా ఉంద‌ని ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి అన్నారు. రాత్రి క‌ల వ‌స్తే పొద్దున స‌భ పెడుతున్నారంటూ విమర్శించారు. స‌భ్యుల‌కు ఎజెండా తెలియ‌ద‌ని, చిన్న‌పిల్ల‌లు స్కూలుకు వ‌చ్చిన‌ట్లు స‌భ ఉంద‌న్నారు. క్లాస్‌లో పిల్ల‌లు పాఠాలు విన్న‌ట్లు అధికార‌ప‌క్షాం చెప్పేది మేం వినాల్సి వ‌స్తోందన్నారు.  

భారీ వ‌ర్షాలు ప‌డుతున్నా దానిపై చ‌ర్చించాల్సింది పోయి స‌భ‌ను వాయిదా వేయ‌డం ఏంట‌ని ,ఇంత హడావిడిగా జీహెచ్ఎంసీ బిల్లుతో ప‌నేంట‌ని ప్ర‌శ్నించారు. 70 వేల కోట్లు హైదరాబాద్ అభివృద్ధికి పెట్టామంటే న‌మ్మేలా ఉందా అని అడిగారు. ధ‌రణి పోర్ట‌ల్‌పై చాలా అనుమాలున్నాయ‌ని తెలిపారు. దుబ్బాక‌లో కాంగ్రెస్‌కు  సపోర్ట్ చేసే వారిని  పోలీసులు బెదిరిస్తున్నారని పేర్కొన్నారు.

తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి బీజేపీ, సీపీఐ, ,నిరుద్యోగ సంఘాల నేతలు యత్నించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కారొపరేషన్‌కు ఎన్నికలు దగ్గరపడుతుండటంతో  జీహెచ్‌ఎంసీ చట్టాన్ని సవరించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు మంగళవారం ఉదయం రాష్ట్ర అసెంబ్లీ సమావేశమైంది. అయితే, జీహెచ్‌ఎంసీ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ బీజేపీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు.  

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఇద్దరికి మించి పిల్లలు ఉన్నప్పటికీ పోటీ చేయవచ్చనే చట్టసవరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. రిజర్వేషన్లు చేయకుండా జీహెచ్ఎంసి ఎన్నికలకు వెళ్లకూడదని డిమాండ్ చేశారు. ఇక డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల కోసం సీపీఐ, ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు కూడా అసెంబ్లీ వద్ద నిరసనకు దిగారు. కాషాయ పార్టీ, సీపీఐ, నిరుద్యోగ సంఘాల నేతలు, కార్యకర్తలు ఒక్కసారిగా అసెంబ్లీ వైపు దూసుకెళ్లేందుకు యత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. వారిని అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

జీతం చాల‌ట్లేద‌ని ప్ర‌ధాని ప‌ద‌వికి రాజీనామా...?

జీతం చాల‌ట్లేద‌ని ప్ర‌ధాని ప‌ద‌వికి రాజీనామా...?

   30 minutes ago


ఇంటికి పదివేలు తాత్కాలికమే.. ఎంత సాయానికైనా సిద్ధం.. కేటీఆర్

ఇంటికి పదివేలు తాత్కాలికమే.. ఎంత సాయానికైనా సిద్ధం.. కేటీఆర్

   an hour ago


ఏపీలో స్కూల్స్ ఓపెన్.. ఏర్పాట్ల‌లో స‌ర్కార్

ఏపీలో స్కూల్స్ ఓపెన్.. ఏర్పాట్ల‌లో స‌ర్కార్

   12 hours ago


గతపాలకులదే పాపమంటే ప్రజలు ఊరుకుంటారా!

గతపాలకులదే పాపమంటే ప్రజలు ఊరుకుంటారా!

   13 hours ago


కమ్మేస్తోంది.. కుమ్మేస్తోంది.. మళ్లీ వర్షంతో వణుకుతున్న హైదరాబాద్

కమ్మేస్తోంది.. కుమ్మేస్తోంది.. మళ్లీ వర్షంతో వణుకుతున్న హైదరాబాద్

   16 hours ago


విడ‌ద‌ల ర‌జ‌నీకి మంత్రి ప‌ద‌వి ఫిక్సా..?

విడ‌ద‌ల ర‌జ‌నీకి మంత్రి ప‌ద‌వి ఫిక్సా..?

   16 hours ago


అన్ని పరీక్షలు వాయిదా..!

అన్ని పరీక్షలు వాయిదా..!

   17 hours ago


తెలంగాణా సీఎం రిలీఫ్ ఫండ్ కి టాలీవుడ్ స్టార్స్ విరాళాలు

తెలంగాణా సీఎం రిలీఫ్ ఫండ్ కి టాలీవుడ్ స్టార్స్ విరాళాలు

   17 hours ago


లక్షాధిపతులను బిక్షాధిపతులను ఏకం చేసిన వరద

లక్షాధిపతులను బిక్షాధిపతులను ఏకం చేసిన వరద

   18 hours ago


కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతుల విషయంలో ఉల్లంఘనలు జరిగాయి: ఎన్జీటీ

కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతుల విషయంలో ఉల్లంఘనలు జరిగాయి: ఎన్జీటీ

   18 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle