newssting
Radio
BITING NEWS :
సింగపూర్‌లో జరిగిన అందాల పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతి బాన్న నందిత(21) మొదటి స్థానంలో నిలిచి కిరీటం గెల్చుకుంది. మిస్‌ యూనివర్స్‌ సింగపూర్‌-2021గా ఎన్నికయ్యింది నందిత. * పంజాబ్‌ కొత్త ప్రభత్వం సోమవారం కొలువుదీరింది. నూతన ముఖ్యమంత్రిగా దళిత సిక్కు నాయకుడు చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ ప్రమాణ స్వీకారం చేశారు. పంజాబ్‌లో తొలి దళిత సీఎంగా చన్నీ రికార్డు సృష్టించారు. * ఏపీలో 7212 ఎంపీటీసీ స్థానాలకు ఫలితాలు విడుదల కాగా.. వైఎస్సార్‌సీసీ 5998 స్థానాలతో నిలిచింది. కాగా, టీడీపీ 826 స్థానాలకు పరిమితమైంది. అదే విధంగా 512 జడ్పీటీసీ స్థానాల్లో ఫలితాల్ని ప్రకటించగా, వైఎస్సార్‌సీసీ 502 స్థానాలు గెలుచుకుంది. టీడీపీ-6, జనసేన-2, సీసీఎం-1,ఇతరులు-1 జడ్పీటీసీ స్థానాలకు పరిమితమయ్యాయి. * తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామరావు ట్విటర్‌ వేదికగా ఓటుకు కోట్లు కేసులో లై డిటెక్టర్‌ పరీక్షకు రేవంత్‌ సిద్ధమా? అని సవాల్‌ చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ ట్వీట్‌కు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పందించారు. * ఐటీ దాడులపై సోమవారం (సెప్టెంబర్‌ 20న) సోషల్‌ మీడియాలో సోనూసూద్‌ స్పందించాడు. ‘ప్రజలకు సేవ చేయాలని నాకు నేనుగా ప్రతిజ్ఙ చేశాను. నా ఫౌండేష‌న్‌లో ప్ర‌తి రూపాయి పేదలు, అవసరమైన వారికి ఉపయోగపడేందుకు ఎదురుచూస్తోంది. సంస్థ ముందుకు వెళ్లేలా ఉపయోగపడేందుకు మానవత దృక్పథంతో కొన్ని బ్రాండ్లను ఎంకరేజ్‌ చేశాను. * జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ చివరిరోజు ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్‌ నల్లబోతు షణ్ముగ శ్రీనివాస్‌ పురుషుల 200 మీటర్ల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించాడు. ఫైనల్‌ రేసును శ్రీనివాస్‌ 21.12 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచాడు.

హుజూరాబాద్ ఉప ఎన్నిక స్పీడందుకున్న సీఎం కేసీఆర్

26-07-202126-07-2021 08:06:32 IST
Updated On 26-07-2021 10:11:22 ISTUpdated On 26-07-20212021-07-26T02:36:32.318Z26-07-2021 2021-07-26T02:35:32.698Z - 2021-07-26T04:41:22.314Z - 26-07-2021

హుజూరాబాద్ ఉప ఎన్నిక స్పీడందుకున్న సీఎం కేసీఆర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపధ్యంలో సీఎం కేసీఆర్ దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే రోజుకో మంత్రి నియోజకవర్గంలో పర్యటిస్తుండగా.. దళిత బంధు పథకాన్ని మరింత లోతుగా ప్రజల్లోకి తీసుకుపోయే విధంగా సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో హుజురాబాద్ నియోజకవర్గ దళితులతో నేడు ఆయన సమావేశం కానున్నారు. హుజురాబాద్‌ నియోజకవర్గంలోని గ్రామాల్లో నుంచి ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషుల చొప్పున ఎంపిక చేసి.. 427 మందిని ఈ భేటీకి ఆహ్వానించారు. 

ఇందులో భాగంగా ఈ సమావేశానికి హాజరు కావాలని సీఎం కేసీఆర్‌ దళిత సామాజిక వర్గ నేతలకు స్వయంగా ఫోన్‌ చేసి ఆహ్వానించడం విశేషం. జమ్మికుంట మండలం తనుగుల గ్రామానికి చెందిన కార్యకర్త, ప్రస్తుత ఎంపీటీసీ భర్త వాసాల రామస్వామితో సీఎం కేసీఆర్ ఫోన్‌ చేసి మాట్లాడారు. ప్రగతిభవన్‌కు బయల్దేరేముందు జూలై 26న మండల కేంద్రాల్లో సమావేశమై ప్రత్యేక బస్సుల్లో హుజురాబాద్‌కు చేరుకొని, అంబేద్కర్ విగ్రహానికి పూల దండ వేసి హైదరాబాద్‌కు రావాలని సూచించారు. ఇప్పటికే ఈటెల రాజేందర్ ప్రధాన అనుచరుడిగా ఉన్న శ్రీనివాస్ కి ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ గా నియమించి తనవైపుకి తిప్పుకున్న కేసీఆర్ ఇప్పుడు గ్రామ స్థాయిలో ఉన్న నాయకులని కూడా తనవైపుకి తిప్పుకునేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. దీంతో హుజూరాబాద్ సీటు టిఆర్ఎస్ కే దక్కుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అక్టోబర్ 2 తర్వాత ఏరోజైనా సరే.. పరీక్షలకు సిద్దం..

అక్టోబర్ 2 తర్వాత ఏరోజైనా సరే.. పరీక్షలకు సిద్దం..

   3 hours ago


రేవంత్ రెడ్డి పై మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా

రేవంత్ రెడ్డి పై మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా

   4 hours ago


చేవెళ్ల నుండి వైఎస్ఆర్ టి పార్టీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర

చేవెళ్ల నుండి వైఎస్ఆర్ టి పార్టీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర

   16 hours ago


మంత్రి వర్గంలో భారీ మార్పులకి సిద్దపడుతున్న వైఎస్ జగన్

మంత్రి వర్గంలో భారీ మార్పులకి సిద్దపడుతున్న వైఎస్ జగన్

   18 hours ago


5-11 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలకు ఫైజర్ వ్యాక్సిన్ ట్రయల్స్ విజయవంతం

5-11 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలకు ఫైజర్ వ్యాక్సిన్ ట్రయల్స్ విజయవంతం

   18 hours ago


పంజాబ్ ముఖ్యమంత్రిగా చరణ్‌జిత్ చన్నీ ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీ హాజరు

పంజాబ్ ముఖ్యమంత్రిగా చరణ్‌జిత్ చన్నీ ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీ హాజరు

   a day ago


ఆంధ్రప్రదేశ్ పరిషత్‌ ఎన్నికల ఫలితాలలో వైసీపీ హవా

ఆంధ్రప్రదేశ్ పరిషత్‌ ఎన్నికల ఫలితాలలో వైసీపీ హవా

   20-09-2021


ఆంధ్రప్రదేశ్ లో ఈనెల 25న జెడ్పీ చైర్మన్ల ఎన్నిక

ఆంధ్రప్రదేశ్ లో ఈనెల 25న జెడ్పీ చైర్మన్ల ఎన్నిక

   20-09-2021


హుజూరాబాద్‌ ఉప ఎన్నికకి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు..?

హుజూరాబాద్‌ ఉప ఎన్నికకి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు..?

   20-09-2021


అక్కడ ప్రతిపక్షాలకు ఒక్క ఓటు కూడా దక్కకపోవడం విశేషం

అక్కడ ప్రతిపక్షాలకు ఒక్క ఓటు కూడా దక్కకపోవడం విశేషం

   20-09-2021


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle