newssting
Radio
BITING NEWS :
హైదరాబాద్ వాసులను వెంటాడుతున్న వరద భయం. రానున్న మూడ్రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. ఏ క్షణాన వరద ముంచెత్తుతుందోనని కంటిమీద కునుకులేకుండా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న లోతట్టు ప్రాంతాల ప్రజలు. * హైదరాబాద్ ను ఆదుకునేందుకు కదిలిన టాలీవుడ్ తారాగణం. సీఎం రిలీఫ్ ఫండ్ కు చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేష్ కోటి రూపాయల విరాళం. చెరో 50 లక్షలు ఇచ్చిన ఎన్టీఆర్, రామ్ చరణ్. * విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఘనంగా పోలీస్ సంస్మరణ దినోత్సవ వేడుకలు. కరోనాతో మృతి చెందిన పోలీసుల కుటుంబాలకు రూ.50 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం వైసీపీనే అన్న మంత్రి సుచరిత. * ఏపీ - తెలంగాణ ప్రభుత్వాల మధ్య ఇంకా కుదరని ఆర్టీసీ ఒప్పందం. ప్రభుత్వాల మొండి వైఖరితో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. ఆర్టీసీ అలసత్వాన్ని క్యాష్ చేసుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్. ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచిన ప్రైవేట్ బస్సులు. ప్రతి ఏటా ఆర్టీసీకి లాభాలు తెచ్చిపెడుతున్న దసరా. * స్కందమాతగా దర్శనమిస్తోన్న బాసర సరస్వతీ దేవి. * పూర్తిగా నిండిన గండిపేట చెరువు. ఏ క్షణంలోనైనా గేట్లు ఎత్తి నీరు విడుదల చేసే అవకాశం. లోతట్టుప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు.

కేంద్ర నిధులపై హరీష్, సంజయ్ మధ్య మాటల యుద్ధం..

15-10-202015-10-2020 12:43:23 IST
2020-10-15T07:13:23.774Z15-10-2020 2020-10-15T07:13:20.887Z - - 21-10-2020

కేంద్ర నిధులపై హరీష్, సంజయ్ మధ్య మాటల యుద్ధం..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దుబ్బాక ఉప ఎన్నికకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా సోలిపేట సుజాతారామలింగారెడ్డి బుధవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఆమె వెంట మంత్రి హరీశ్‌రావు, ఎంపీ ప్రభాకర్‌ రెడ్డి ఉన్నారు. బీజేపీ అభ్యర్థిగా రఘునందన్‌రావు నామినేషన్‌ వేశారు. ఆయన వెంట బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్‌ ఉన్నారు. రెండు పార్టీల అభ్యర్థులూ భారీ ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌, సంజయ్‌ విసురుకున్న సవాళ్లు, ప్రతిసవాళ్లతో దుబ్బాక దద్దరిల్లింది. 

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు కేంద్రమే నిధులిస్తోందని బీజేపీ నేతలు చేసుకుంటున్న ప్రచారం అబద్ధమని మంత్రి హరీష్ రావు  పేర్కొన్నారు. కల్యాణలక్ష్మి, ఉచిత విద్యుత్తు పథకాల్లో ఒక్క రూపాయి అయినా కేంద్రానిది ఉందా అని మండిపడ్డారు. పింఛన్లకు కేంద్రం కేవలం 1.8 శాతం నిధులే ఇస్తోందన్నారు. 

బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా బీడీ కార్మికులకు పింఛన్లు, ఉచిత విద్యుత్తు, కల్యాణలక్ష్మి, రైతుబంధు అమలు చేస్తోందా అని ప్రశ్నించారు. ఎవరి ప్రయోజనం కోసం విదేశీ మొక్కజొన్నలు తెస్తున్నారో చెప్పాలన్నారు. బాయిల కాడ మీటర్లు పెట్టాలని కేంద్రమే చెప్పిందనే విషయాన్ని ఆధారాలతో నిరూపించామని.. ఇంకా ఏం మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతారని ఎద్దేవా చేశారు. 

హరీశ్‌ వ్యాఖ్యలపై సంజయ్‌ ఘాటుగా స్పందించారు. ‘కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏఏ పథకాలకు ఎన్ని నిధులిచ్చిందో అంకెలతో సహా నిరూపించడానికి నేను రెడీ. వాటిని ఇవ్వలేదని నిరూపిస్తే దుబ్బాక నడిబొడ్డున ఉరేసుకుంటా. సీఎం కేసీఆర్‌.. చర్చకు సిద్ధమా’ అని ప్రశ్నించారు. కేంద్రం ఇస్తున్న నిధులను టీఆర్‌ఎస్‌ నాయకులు గుంటకాడ నక్కల్లా దోచుకు తింటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఆయుష్మాన్‌ భారత్‌’ను ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. 

దుబ్బాకకు రూ.10 కోట్ల నిధులు మాత్రమే విదిల్చిన టీఆర్‌ఎస్‌ పెద్దలు.. ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారో చెప్పాలన్నారు. ఎన్నికల్లో పోటీకి ఇద్దరు సంతానం మించి ఉండరాదన్న నిబంధనను మార్చేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారని.. ఇది ఎవరి ప్రయోజనాల కోసమో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. అదే హిందువుల కోసమైతే చట్ట సవరణ చేసేవారా అని నిలదీశారు. 

కాగా, బుధవారం మొత్తం 15 నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్‌ అభ్యర్థిగా చెరుకు శ్రీనివా‌సరెడ్డి నేడు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle