newssting
Radio
BITING NEWS :
ఓ ఆసుపత్రిలో మహిళా రోగిపై ఉద్యోగి అత్యాచారం. గురుగ్రామ్ నగరంలో వెలుగుచూసిన దారుణం. ప్రైవేటు ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో 21 ఏళ్ల యువతి క్షయ వ్యాధితో చికిత్స కోసం చేరగా వెంటిలేటరుపై చికిత్స పొందుతూ స్పృహ లేని స్థితిలో ఉన్నపుడు ఆసుపత్రి ఉద్యోగి ఒకరు తనపై అత్యాచారం చేశాడని తన చేత్తో రాసిన నోట్ ద్వారా తండ్రికి తెలిపిన బాధితురాలు * నలుగురు ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభ్యులపై కేసులు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు. ఢిల్లీలో పారిశుద్ధ్య పనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించిన నలుగురు ఆప్ ఎమ్మెల్యేలపై పోలీసులు కేసులు. పారిశుద్ధ్య పనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆప్ నాయకుడు దుర్గేష్ పాథక్ 1500మంది ప్రజలతో పౌరకేంద్రం ముందు నిరసన కార్యక్రమం చేపట్టగా..అనుమతి లేకుండా నిరసన చేపట్టారని కేసులు నమోదు * 317వ రోజుకు చేరుకున్న అమరావతి రైతు నిరసనలు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు, మహిళలు చేపట్టిన నిరసనలు. అమరావతి గ్రామాల్లోని శిబిరాల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు. కరోనా సూచనలు పాటిస్తూ సాగుతున్న అమరావతి ఉద్యమం * ఉత్తర తమిళనాడుకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని, మిగిలినచోట్ల పొడి వాతావరణం కొనసాగుతుందని తెలిపిన వాతావరణ శాఖ. కాగా ఈశాన్య గాలులు ప్రారంభం కావడంతో అనేకచోట్ల, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో కురుస్తున్న మంచు. పగటిపూట మాత్రం కొనసాగుతున్న ఎండ * గ్రేటర్‌ ఎన్నికలకు పడిన మరో ముందడుగు. వార్డుల వారీగా రిటర్నింగ్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులను నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ. గ్రేటర్‌లో 150 వార్డులకు తహసీల్దార్‌, ఎంపీడీఓ తదితర కేడర్‌ అధికారులను రిటర్నింగ్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్లుగా జీహెచ్‌ఎంసీ సూచించిన వారిని నియమిస్తున్నట్లుగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆమోదం * బేగంపేట మెట్రో స్టేషన్‌ పై నుంచి పడి యువకుడు మృతి. ఈ నెల 26న జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. చార్టెడ్‌ అకౌంటెన్సీ కోర్స్‌ చేస్తున్న కర్నూల్‌ జిల్లా మంత్రాలయం రామచంద్రనగర్‌కు చెందిన జీ మంజునాథ్‌ (23) ఈ నెల 14న నగరానికి రాగా ఆత్మహత్య చేసుకున్నట్లుగా సీసీ కెమెరాలలో రికార్డు * గురువారం నుంచి అందుబాటులోకి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ధరణి ఫోర్టల్‌ సేవలు. మేడ్చల్‌ జిల్లా మూడుచింతలపల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభం. ధరణి సేవలు మొదలైతే తాసిల్దార్‌ కార్యాలయాల్లో రోజుకు16 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసే వెసులుబాటు * చెన్నై నగరాన్ని అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు. గత రాత్రి నుంచి మహానగరంలో ఎడతెరపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలు. తిరువాన్మియూర్, మైలాపూర్, రాయపెట్ట, అడయార్‌లలో వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు పలు కాలనీలు నీట మునిగగా వర్షపు నీటిని తొలగించడానికి అధికారులు అన్ని చర్యలు చేపట్టారు * మంచిర్యాల జిల్లాలోని హజీపూర్ మండలం నర్సింగ పూర్ శివారులో పెద్ద పులి సంచారం . ఎల్లంపల్లి ప్రాజెక్టు దిగువన పులి సంచారాన్ని గుర్తించిన గ్రామస్థులు. విషయం తెలిసిన అటవీ శాఖ అధికారులు అక్కడకు చేరుకుని అడుగుల ద్వారా పులి సంచారాన్ని నిర్ధారించారు. దీంతో సమీప అటవీ ప్రాంతాలకు ప్రజలు వెళ్ళొద్దని అధికారులు సూచనలు జారీ.

మారిన కేసీఆర్ ఆలోచ‌న‌..! జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ దూకుడుకు బ్రేక్ ..?

17-10-202017-10-2020 15:14:37 IST
Updated On 17-10-2020 15:31:17 ISTUpdated On 17-10-20202020-10-17T09:44:37.445Z17-10-2020 2020-10-17T09:43:54.807Z - 2020-10-17T10:01:17.536Z - 17-10-2020

మారిన కేసీఆర్ ఆలోచ‌న‌..! జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ దూకుడుకు బ్రేక్ ..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ‌లో తెరాస పార్టీకి ఎదురులేకుండా పోయింది. సీఎం కేసీఆర్ వ్యూహాలు, మంత్రి కేటీఆర్ దూకుడుతో ఇత‌ర పార్టీల‌న్నీ తేలిపోతున్నాయి. రెండ‌వ సారి వ‌రుస‌గా అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత టీఆర్ ఎస్ త‌న ఆధిప‌త్యాన్ని మ‌రింత పెంచుకుంది. ఓ ప‌క్క కాంగ్రెస్ పార్టీ ప్ర‌భావం అంతంత మాత్రంగానే ఉండ‌టం, మ‌రోవైపు బీజేపీసైతం పూర్తిస్థాయిలో తెరాస ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో పెట్ట‌లేక పోతుండ‌టంతో సీఎం కేసీఆర్ వ్యూహాలు ప‌క్కాగా అమ‌ల‌వుతున్నాయి. ఈ త‌రుణంలోనే ముంద‌స్తుగా జీహెచ్ఎంసీ ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది. 

ఇప్ప‌టికే ప‌లుసార్లు ఎమ్మెల్యేలు, కార్పొరేట‌ర్ల‌తో కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు స‌మావేశాలుసైతం నిర్వ‌హించారు. న‌వంబ‌ర్‌లో ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశాలు ఉన్నాయ‌ని, అందుకు అంద‌రూ సిద్ధంగా ఉండాల‌ని సూచించారు. ఇప్ప‌టికే అభ్య‌ర్థుల ఎంపిక‌పై దృష్టిసారించారు. మ‌రోవైపు రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ సైతం ఎన్నిక‌ల‌ను న‌వంబ‌ర్‌లో నిర్వ‌హించేందుకు సిద్ధ‌మ‌వుతుంది. బ్యాలెట్ పేప‌ర్‌ల ద్వారానే ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింది. ఓట‌ర్ల లెక్క‌ను సిద్ధం చేసింది. 

అయితే తెరాస ప్ర‌భుత్వం దూకుడుకు ఇప్పుడు బ్రేక్ ప‌డిన‌ట్లు క‌నిపిస్తోంది. జీహెచ్ ఎంసీలో ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లి మ‌రోసారి 100కుపైగా స్థానాల‌ను ద‌క్కించుకొనేందుకు కేసీఆర్ అమ‌లు చేసిన వ్యూహానికి వ‌రుణుడు రూపంలో దెబ్బ‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది. గ‌త నాలుగు రోజులుగా హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షాల‌తో ప్ర‌జ‌లు న‌ర‌క యాత‌న ప‌డుతున్నారు. స‌గానికిపైగా కాల‌నీలు నీట మునిగాయి. అనేక మంది గ‌ల్లంత‌య్యారు. వ‌ర్షం త‌గ్గి రెండు రోజులు అవుతున్నా ప‌లు కాల‌నీల ప్ర‌జ‌లు వ‌ర‌ద నీటిలో గ‌డుపుతున్నారు. ఓవైపు ప్ర‌భుత్వం స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌డుతున్నా.. ప్ర‌జ‌ల్లో మాత్రం వ్య‌తిరేఖ‌త వ్య‌క్త‌మ‌వుతుంది. 

కొద్దిపాటి వ‌ర్షానికి ఇలా ఉంటే ఇక రాష్ట్ర రాజ‌ధానిని తెరాస ప్ర‌భుత్వం బాగుచేసిందేంట‌ని ప్ర‌తిప‌క్షాల‌తో పాటు ప్ర‌జ‌ల నుంచి విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ప‌లు ప్రాంతాల్లో తెరాస నేత‌ల‌ను ప్ర‌జ‌లు నిల‌దీస్తున్నారు. ఈ స‌మ‌యంలో ఎన్నిక‌లు నిర్వ‌హిస్తే ఇబ్బంది ఎదుర‌వుతుంద‌ని సీఎం కేసీఆర్‌, తెరాస పెద్ద‌లు భావిస్తున్న‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే ఈ విష‌యంపై కేసీఆర్ ముఖ్య‌నేత‌ల వ‌ద్ద ప్ర‌స్తావించిన‌ట్లు తెలుస్తోంది. ఒక‌వేళ అనుకున్న విధంగా ఎన్నిక‌లు నిర్వ‌హిస్తే.. గెలుస్తాం కానీ.. సీట్లు త‌గ్గుతాయ‌ని, సీట్లు త‌గ్గితే ప్ర‌తిప‌క్షాల‌కు బ‌లం ఇచ్చిన‌ట్లే అవుతుంద‌ని కేసీఆర్ వ‌ద్ద తెరాస ముఖ్య‌నేత‌లు ప్ర‌స్తావించిన‌ట్లు తెలుస్తోంది. 

ఈ ప‌రిస్థితుల్లో ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్ల‌టం కంటే ఫిబ్ర‌వ‌రి, మార్చి వ‌ర‌కు ఎన్నిక‌ల జోలికి వెళ్ల‌క‌పోవ‌ట‌మే మంచిద‌నే అభిప్రాయాన్ని తెరాస ముఖ్య‌నేత‌లు కేసీఆర్ వ‌ద్ద ప్ర‌స్తావించారంట‌. దీంతో సీఎం కేసీఆర్‌సైతం ఆలోచ‌న‌లో ప‌డిన‌ట్లు తెలుస్తోంది. అయితే సీఎం కేసీఆర్ వ్యూహాలు ఎవ‌రికి అర్థం కావు. వ్య‌తిరేఖ ప‌రిస్థితుల్లోనూ ప్ర‌జ‌ల్లోకి వెళ్లి విజ‌యాలు సాధించిన సంద‌ర్భాలు అనేకం ఉన్నాయి. ఈ క్ర‌మంలో కేసీఆర్ నిర్ణ‌యంపై అంద‌రిలోనూ ఆస‌క్తి నెల‌కొంది. తెరాస ముఖ్య‌నేత‌ల సూచ‌న‌ల మేర‌కు కేసీఆర్ జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల‌పై వెన‌క్కు త‌గ్గుతారా..? లేక త‌న‌దైన వ్యూహాల‌తో అనుకున్న స‌మ‌యానికే ఎన్నిక‌ల‌కు వెళ్లేందుకు సిద్ధ‌మ‌వుతారా అనేది వేచి చూడాల్సిందే. 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle